Home /News /telangana /

TS POLITICS BJP LEADER AMIT SHAH MEETING WITH TELANGANA LEADERS PERSONALLY TO CREATE NEW STRATEGIES AK

Amit Shah: తెలంగాణ కోసం అమిత్ షా సరికొత్త వ్యూహాలు.. ఆ భేటీలన్నీ అందుకోసమేనా ?

అమిత్ షా (ఫైల్)

అమిత్ షా (ఫైల్)

TS Politics: కొద్దిరోజులుగా అమిత్ షా తెలంగాణ నాయకులతో సమావేశమవుతున్నారు. అయితే ఒక్కొక్క నేతతో ఆయన వేర్వేరుగా సమావేశాలు ఏర్పాటు చేయడం ఇక్కడ చెప్పుకోవాల్సిన కీలక పరిణామం.

    రాజకీయాల్లో ఎవరి వర్కింగ్ స్టయిల్ వారికి ఉంటుంది. తమదైన శైలిలో రాజకీయాలు చేస్తూ విజయాలను అందుకుంటుంటారు కొందరు నేతలు. అలాంటి నాయకుల్లో కేంద్ర హోంమంత్రి, బీజేపీ ముఖ్యనేత అమిత్ షా(Amit shah) ఒకరు. ఆయన రాజకీయాలు, రాజకీయ వ్యూహాలు భిన్నంగా ఉంటాయి. పార్టీకి అనూహ్య విజయాలు తెచ్చిపెడుతుంటాయి. కేంద్రం, అనేక రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి రావడానికి వ్యూహరచన చేసిన సక్సెస్ సాధించిన అమిత్ షా.. ఇప్పుడు తెలంగాణపై(Telangana) ఫోకస్ చేశారు. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ(BJP) పావులు కదుపుతోంది. ఇందులో అమిత్ షా వ్యూహాలు ఎంతో కీలకమని వేరే చెప్పనవసరం లేదు. ఎప్పటికప్పుడు తెలంగాణ నేతలు సమావేశమవుతూ.. రాష్ట్రంలో పార్టీని ఏ విధంగా అధికారంలోకి తీసుకురావాలనే దానిపై చర్చలు జరుపుతున్నారు అమిత్ షా.

    ఇందుకోసం వారికి సలహాలు, సూచనలు ఇస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు. అయితే కొద్దిరోజులుగా అమిత్ షా తెలంగాణ నేతలతో సమావేశమవుతున్న తీరు తెలంగాణ బీజేపీ వర్గాలతో పాటు రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపుతోంది. కొద్దిరోజులుగా అమిత్ షా తెలంగాణ నాయకులతో సమావేశమవుతున్నారు. అయితే ఒక్కొక్క నేతతో ఆయన వేర్వేరుగా సమావేశాలు ఏర్పాటు చేయడం ఇక్కడ చెప్పుకోవాల్సిన కీలక పరిణామం. కిషన్ రెడ్డి, డీకే అరుణ, లక్ష్మణ్, ఈటల రాజేందర్.. ఇలా తెలంగాణ నాయకులతో ఆయన వేర్వేరుగా సమావేశం అయ్యారు.



    ఈ సందర్భంగా ఆయన వారితో ఏం మాట్లాడారు ? వాళ్లు ఆయనకు ఏం చెప్పారు ? అన్నది ఆ పార్టీ నేతలకే తెలియాలి. త్వరలోనే తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కూడా ఢిల్లీ వెళ్లి అమిత్ షాను కలవబోతున్నారు. దీంతో తెలంగాణ నేతలతో అమిత్ షా వేర్వేరుగా సమావేశం కావడం వెనుక ఏదైనా ఆంతర్యం ఉందా ? అనే చర్చ జరుగుతోంది. త్వరలోనే తెలంగాణలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో వాటి గురించే అమిత్ షా వీరితో సమావేశం అవుతున్నారా ? లేక మరేదైనా ప్రత్యేక కారణంగా ఉందా ? అన్నది హాట్ టాపిక్‌గా మారింది.

    Rythu Bandu: రైతులకు శుభవార్త చెప్పిన సీఎం కేసీఆర్.. ఆ రోజు నుంచే ఖాతాల్లోకి రైతుబంధు డబ్బులు

    KCR New Plan: కేసీఆర్ మనసు మార్చుకున్నారా ? అలా జరుగుతుందని భావించారా ?

    అయితే తెలంగాణలో అధికారం దక్కించుకోవడంపై ఫోకస్ చేసిన బీజేపీ.. ఈ విషయంలో రాష్ట్ర బీజేపీ నేతల అభిప్రాయాలను వేర్వేరుగా సేకరిస్తోందని.. వాటన్నింటినీ క్రోడీకరించిన తరువాత తరువాత రాష్ట్రంలో సరికొత్త వ్యూహాన్ని అమలు చేసే అవకాశం ఉందని పలువురు నేతలు చర్చించుకుంటున్నారు. అయితే తెలంగాణ నేతలతో అమిత్ షా వేర్వేరుగా సమావేశం కావడాన్ని బట్టి ఆయన రాష్ట్రంపై ఏ స్థాయిలో ఫోకస్ చేశారన్నది అర్థమవుతోందనే చర్చ కూడా సాగుతోంది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Amit Shah, Bjp, Telangana

    తదుపరి వార్తలు