Home /News /telangana /

TS POLITICS BJP HIGH COMMAND MAY SENT TELANGANA LEADER TO RAJYA SABHA FROM UTTAR PRADESH QUOTA MODI AND AMIT SHAH FOCUS AK

Telanagna| BJP: తెలంగాణ బీజేపీ నేతలకు హైకమాండ్ బంపర్ ఆఫర్.. త్వరలోనే కీలక పదవి ?

ప్రధాని మోదీ, తెలంగాణ (ప్రతీకాత్మక చిత్రం)

ప్రధాని మోదీ, తెలంగాణ (ప్రతీకాత్మక చిత్రం)

Telangana: తెలంగాణలో పార్టీ శ్రేణులు, నేతలను మరింత ఉత్సాహపరిచేందుకు బీజేపీ నాయకత్వం కొత్త నిర్ణయం తీసుకోబోతందని తెలుస్తోంది.

    తెలంగాణపై బీజేపీ సీరియస్‌గా ఫోకస్ చేసింది. ఆ పార్టీ రాష్ట్రంలో చేపడుతున్న రాజకీయ కార్యక్రమాలను బట్టి ఈ విషయం స్పష్టంగా అర్థమవుతోంది. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావడమే లక్ష్యంగా పెట్టుకున్న కమలనాథులు.. అధికార టీఆర్ఎస్‌కు ధీటుగా వ్యూహాలు రచిస్తోంది. తెలంగాణలో(Telangana) బీజేపీ పాగా వేయడం ద్వారా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు(KCR) చెప్పొచ్చనే భావనలో బీజేపీ ఉంది. తెలంగాణలో తమ పార్టీ పరిస్థితి మెరుగవుతోందని.. వచ్చే ఎన్నికల నాటికి తమ బలం గణనీయంగా పెరుగుతుందని బీజేపీ లెక్కలు వేసుకుంటోంది. ఇందుకు సంబంధించి ఎప్పటికప్పుడు సర్వే నివేదికలను, క్షేత్రస్థాయి నుంచి రిపోర్టులను తెప్పించుకునంది అందుకు అనుగుణంగా ముందుడుగు వేస్తోంది.

    మరోవైపు తెలంగాణలో పార్టీ శ్రేణులు, నేతలను మరింత ఉత్సాహపరిచేందుకు బీజేపీ నాయకత్వం కొత్త నిర్ణయం తీసుకోబోతందని తెలుస్తోంది. త్వరలోనే భర్తీ కానున్న పలు రాజ్యసభ(Rajya Sabha) సీట్లలో ఒకటి తెలంగాణ ప్రాంతానికి చెందిన నేతకు కేటాయించాలని బీజేపీ నాయకత్వం యోచిస్తున్నట్టు సమాచారం. ఇటీవల రాష్ట్రానికి వచ్చిన ఆ పార్టీ ముఖ్యనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. పలువురు నేతలతో సమావేశమయ్యారు. వారికి ఆయన ఇదే విషయాన్ని చెప్పినట్టు టాక్.

    తాజాగా తెలంగాణ నుంచి లక్ష్మణ్, మురళీధర్ రావు, గరికపాటి మోహన్ రావు, విజయశాంతి పేర్లను బీజేపీ హైకమాండ్ పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఉద్యమ నేపథ్యం, ప్రజల్లోకి దూసుకెళ్లగలిగే తత్వం ఉన్న నేతలకు పదవులు ఇవ్వడమో లేక సామాజిక సమీకరణలు బేరిజు వేసుకుని పెద్దల సభకు నేతలకు ఎంపిక చేయడమో చేయాలని బీజేపీ హైకమాండ్ యోచిస్తోంది.

    Komatireddy Venkat reddy: వచ్చే ఎన్నికల్లో పోటీపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి క్లారిటీ.. అది చాలు అని వ్యాఖ్య..

    KCR: కేసీఆర్ వ్యూహం ఫలించిందా ?..ఆ నేత మనసు మారిపోయిందా ?.. టీఆర్ఎస్‌కు కలిసొస్తుందా ?

    ఉత్తరప్రదేశ్ కోటాలో తెలంగాణకు చెందిన ఓ నాయకుడికి అవకాశం ఇవ్వాలని బీజేపీ నాయకత్వం భావిస్తుండటంతో.. ఆ ఛాన్స్ ఎవరికి దక్కుతుందనే అంశంపై ఈ నెలాఖరుతో ఓ స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు బీజేపీ జాతీయ నాయకత్వం ఎలాంటి అంశాలు పరిగణనలోకి తీసుకుని నాయకులను ఎంపిక చేస్తుందనే అంశంపై రాష్ట్ర నేతలు లెక్కలు వేసుకుంటున్నారని.. పెద్దల సభకు వెళ్లే ఆ అవకాశం తమకు ఇవ్వాలని బీజేపీ పెద్దలను కోరుతున్నారని తెలుస్తోంది. మొత్తానికి యూపీ కోటాలో తెలంగాణ నేతకు రాజ్యసభ ఛాన్స్ ఇస్తే.. రాష్ట్రంలో బీజేపీ జాతీయ నాయకత్వం మరింత ఫోకస్ పెట్టనుందని అర్థం చేసుకోవచ్చు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Bjp, Telangana

    తదుపరి వార్తలు