Home /News /telangana /

TS POLITICS BJP HIGH COMMAND IS NOT SATISFIED WITH JOINING FACTOR IN TELANGANA DUE TO LOCAL LEADERS ATTITUDE AK

Telangana| BJP: తెలంగాణలో బీజేపీ దూకుడు... ఆ విషయంలో మాత్రం అనుకున్నట్టు జరగడం లేదా ?

అమిత్ షా, మోదీ, బండి సంజయ్ (ఫైల్ ఫోటో)

అమిత్ షా, మోదీ, బండి సంజయ్ (ఫైల్ ఫోటో)

Telangana| BJP: టీఆర్ఎస్ మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఒక్కరే ఇప్పటివరకు బీజేపీలోచేరుతున్నట్టు తెలిపారు. ఆయన కూడా తరుణ్ చుగ్, బండి సంజయ్ వంటి వాళ్లు స్వయంగా వెళ్లి చర్చలు జరిపితేనే బీజేపీలోకి వచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

ఇంకా చదవండి ...
    తెలంగాణలో బీజేపీ దూకుడు కొనసాగుతోంది. ప్రధాని నరేంద్రమోదీ (Narendra Modi)మొదలుకుని అనేకమంది జాతీయ నాయకులు తెలంగాణపై రాజకీయ దండయాత్ర చేయడానికి సిద్ధమయ్యారు. వీరందరి లక్ష్యం ఒక్కటే. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికారం దక్కించుకోవడం. ఆ దిశగా బీజేపీ (BJP)జాతీయ నాయకత్వం రూట్ మ్యాప్ రెడీ చేసి.. రాష్ట్ర నాయకత్వం ద్వారా దాన్ని అమలు చేయిస్తోంది. అదే సమయంలో జాతీయ నాయకత్వం కూడా తెలంగాణలో(Telangana) బలపడేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఇంత చేస్తున్న ఓ విషయంలో మాత్రం బీజేపీ అనుకున్న విధంగా జరగడం లేదనే చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది. బీజేపీ బలపడుతోందని తెలంగాణ ప్రజలకు స్పష్టమైన సంకేతాలు ఇవ్వాలని ఆ పార్టీ భావిస్తోంది. ఇందుకోసం చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తోంది.

    స్వయంగా ప్రధాని నరేంద్రమోదీ వంటి నాయకులు కూడా ఇందుకోసం బరిలోకి దిగుతున్నారు. అయితే ఇంత చేస్తున్నా.. బీజేపీకి ఒక్క విషయంలో మాత్రం అసంతృప్తి ఉందనే టాక్ వినిపిస్తోంది. తెలంగాణలో బీజేపీ ఇంత దూకుడుగా ముందుకు సాగుతున్నా.. ఆ పార్టీలో చేరే నాయకుల సంఖ్య మాత్రం తక్కువగా ఉంటోంది. నిజానికి బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు, ప్రధాని సభ సందర్భంగా అనేక మంది నాయకులు బీజేపీలోకి వెళతారని రాజకీయవర్గాల్లో ప్రచారం జరిగింది.



    కానీ అలా జరుగుతున్న దాఖలాలు మాత్రం కనిపించడం లేదు. టీఆర్ఎస్ మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఒక్కరే ఇప్పటివరకు బీజేపీలోచేరుతున్నట్టు తెలిపారు. ఆయన కూడా తరుణ్ చుగ్, బండి సంజయ్ వంటి వాళ్లు స్వయంగా వెళ్లి చర్చలు జరిపితేనే బీజేపీలోకి వచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆయన మినహా మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ స్థాయిలో ఉన్న నేతలెవరూ బీజేపీలో చేరుతున్న దాఖలాలు కనిపించడం లేదు. అయితే చేరికల విషయంలో తెలంగాణ బీజేపీ నేతలు అంతగా ఆసక్తి చూపించకపోవడం వల్లే ఈ రకమైన పరిస్థితి ఉందనే వాదన ఉంది.

    Peddapalli: పెద్దపల్లి జిల్లాలో ప్రకృతి ప్రేమికుల కోసం కోట్ల నిధులు ఖర్చు .. దాని వెనుక ఓ సోషల్ కాజ్ ఉందిలే

    Telangana: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక నుంచి జెడ్పీ చైర్మ‌న్లు, ఎంపీపీల‌కూ ఆ పవర్​

    చాలామంది తెలంగాణ బీజేపీ నేతలు ఇతర పార్టీల నుంచి బలమైన నేతలు బీజేపీలోకి వస్తే.. ఆ ప్రభావం తమపై ఉంటుందనే భావనలో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే బీజేపీలో చేరే వారితో తమకు ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదని.. ఆ రకమైన నేతలే పార్టీలోకి వచ్చే విధంగా ప్రొత్సహించాలనే భావనలో ప్రస్తుత తెలంగాణ బీజేపీ నేతలు ఉన్నట్టు సమాచారం. చేరికల విషయంలో ప్రస్తుత నేతలు వైఖరి మార్చుకోవాలని ఆ పార్టీ ముఖ్యనేతలు గతంలోనే హెచ్చరించారు. కానీ ఈ విషయంలో ప్రస్తుతం ఉన్న నేతలు మాత్రం తమ తీరు తమదే అన్నట్టుగా వ్యవహరిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Amit Shah, Bandi sanjay, Bjp, Narendra modi, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు