తెలంగాణలో రాజకీయం (Telangana Politics) రసవత్తరంగా మారింది. రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ (Trs), బీజేపీ (Bjp) మధ్య మినీ యుద్ధమే నడుస్తుంది. ప్రస్తుత వాతావరణం ఎన్నికలను తలపిస్తున్నాయి. రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ (Bandi Sanjay) ఐదో విడత ప్రజా సంగ్రామ పాదయాత్ర, YSRTP అధినేత్రి వైఎస్ షర్మిల (Ys sharmila) ప్రజా ప్రస్థానం పేరుతో 3000 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేపట్టి ఇప్పటికి కొనసాగుతుంది. ఇక త్వరలో కాంగ్రెస్ కూడా పాదయాత్ర చేపట్టాలనే ఆలోచనలో ఉన్నారు. ఇక గులాబీ బాస్ కేసీఆర్ (Cm Kcr వరుస బహిరంగ సభలతో ప్రజల్లోకి వస్తున్నారు. అలాగే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు KA పాల్ కూడా ఇప్పటి నుంచే ప్రజల్లో ఉండాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు. ఇక తాజాగా తెలంగాణపై బీజేపీ (Bjp) హైకమాండ్ ఫోకస్ చేసినట్లు తెలుస్తుంది.
బండి సంజయ్ పాదయాత్ర ముగింపు సభకు హాజరు..
ఈ క్రమంలో డిసెంబర్ 16న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా (Jp Nadda) తెలంగాణకు రానున్నారు. బండి సంజయ్ (Bandi Sanjay) చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ కరీంనగర్ లో జరగనుంది. ఈ ముగింపు సభకు జెపి నడ్డా (Jp Nadda) ముఖ్య అతిధిగా హాజరు కానున్నారు. అయితే బండి సంజయ్ (Bandi Sanjay) పాదయాత్ర షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 17,18న ముగియాల్సి ఉంది. కానీ ఆ షెడ్యూల్ కంటే ముందే జేపీ నడ్డా (Jp Nadda) రాష్ట్రానికి రానుండడంతో పాదయాత్ర ముగింపు రోజును కూడా దానికి తగ్గట్టు మార్చినట్లు తెలుస్తుంది.
గుజరాత్ హడావుడి కాగానే..
కాగా ప్రస్తుతం బీజేపీ గుజరాత్ అసెంబ్లీ ఎలక్షన్లపై (Gujarat Assembly Elections) దృష్టి సారించింది. ఇప్పటికే అక్కడ ప్రచారం ముగియగా నేడు చివరి విడత పోలింగ్ కొనసాగుతుంది. ఇక డిసెంబర్ 8న ఫలితాలు రానున్నాయి. అనంతరం తెలంగాణపై నాయకులు ఫోకస్ చేయనున్నట్టు తెలుస్తుంది. ఈసారి సౌత్ లో జెండా పాతాలని బీజేపీ (Bjp) భావిస్తుండగా అది తెలంగాణ నుండే మొదలు పెట్టాలని హైకమాండ్ అడుగులు వేస్తుంది.
ఇందులో భాగంగానే జేపీ నడ్డా (Jp Nadda) రాష్ట్రానికి రానున్నారు. తెలంగాణాలో బీజేపీ (Bjp) యాక్షన్ ప్లాన్ ను ఇప్పటికే సిద్ధం చేసినట్లు సమాచారం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bandi sanjay, Bjp, JP Nadda, Karimnagar, Telangana, Telangana News