హోమ్ /వార్తలు /తెలంగాణ /

BJP|Rajasingh: ఎమ్మెల్యే రాజాసింగ్‌పై వేటు .. పార్టీ నుంచి సస్పెండ్ చేసిన బీజేపీ

BJP|Rajasingh: ఎమ్మెల్యే రాజాసింగ్‌పై వేటు .. పార్టీ నుంచి సస్పెండ్ చేసిన బీజేపీ

గతంలో నుపుర్ శర్మ చేసిన ఈ రకమైన వ్యాఖ్యల కారణంగా అనేక ఇతర దేశాల నుంచి విమర్శలు కొని తెచ్చుకున్న భారత్.. తాజాగా రాజాసింగ్ విషయంలో కఠిన చర్యలు తీసుకోవడానికి నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది. మరోవైపు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

BJP|Rajasingh: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కి ఊహించని దెబ్బ తగిలింది. భారతీయ జనతా పార్టీ ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. రాజాసింగ్‌ వ్యవహారశైలి పార్టీ నిబంధనలకు విరుద్దంగా ఉందనే కారణంతోనే సస్పెండ్ చేస్తున్నట్లుగా బీజేపీ హైకమాండ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రకటించింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

గోషామహల్ ఎమ్మెల్యే(Goshamahal MLA) రాజాసింగ్‌(Rajasingh)కి ఊహించని దెబ్బ తగిలింది. భారతీయ జనతా పార్టీ(BJP) ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. రాజాసింగ్‌ వ్యవహారశైలి పార్టీ నిబంధనలకు విరుద్దంగా ఉందనే కారణంతోనే సస్పెండ్ చేస్తున్నట్లుగా బీజేపీ హైకమాండ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రకటించింది.

వేటు పడింది..
బీజేపీ (BJP) హైకమాండ్ రాజాసింగ్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీచేసింది. పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించకూడదో..సెప్టెంబర్ 2లోగా వివరణ ఇవ్వాలని రాజాసింగ్‌ను పార్టీ ఆదేశించింది. అంతేగాక బీజేఎల్పీ పోస్ట్ నుంచి రాజాసింగ్‌ను అధిష్టానం తప్పించింది. సోషల్ మీడియాలో రాజాసింగ్ పోస్టు చేసిన ఒక వీడియో వివాదాస్పదమై వైరల్ కావడంతో దుమారం చెలరేగింది. దీంతో ఒక వర్గం సోమవారం రాత్రి నుంచి ఆందోళనకు దిగింది. అనంతరం ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి.

Rajasingh suspended letter
(MLA Rajasingh suspended letter)

Published by:Siva Nanduri
First published:

Tags: Raja Singh, Telangana News

ఉత్తమ కథలు