Home /News /telangana /

TS POLITICS BJP FOUCS ON REVANTH REDDY COMMENTS ON REDDY COMMUNITY TO TARGET CONGRESS AND TRS IN TELANGANA AK

Telangana| BJP: బీజేపీ సరికొత్త ప్లాన్.. ఒకే వ్యూహంతో కాంగ్రెస్, టీఆర్ఎస్‌లకు చెక్ ?

బండి సంజయ్ (ఫైల్ ఫోటో)

బండి సంజయ్ (ఫైల్ ఫోటో)

Telangana Politics: తెలంగాణలో తాము అధికారంలోకి రావాలంటే బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని బీజేపీ భావిస్తోంది. ప్రస్తుతం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కీలక పాత్ర పోషిస్తున్న బండి సంజయ్ కూడా బీసీ సామాజికవర్గానికి చెందిన నాయకుడే.

    తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న టీఆర్ఎస్‌ను గద్దె దించి తాము అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నిస్తుంటే.. తెలంగాణలో(Telangana) తాము అధికారం దక్కించుకోవాలని కాంగ్రెస్ కూడా తమ వంతుగా ప్రయత్నిస్తోంది. అయితే ఈ విషయంలో కాంగ్రెస్ కంటే బీజేపీ ముందుంది. బీజేపీకి తెలంగాణలో అనుకూల రాజకీయ పవనాలు వీస్తుండటంతో.. వాటిని ఆసరాగా చేసుకుని అధికారం సొంతం చేసుకోవాలని ఈ పార్టీ హైకమాండ్ కూడా పావులు కదుపుతోంది. ఇదిలా ఉంటే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలను తమకు అనుకూలంగా మార్చుకోవాలనే ప్లాన్‌లో బీజేపీ ఉందని తెలుస్తోంది. రెడ్లను నమ్ముకున్న వాళ్లుమోసపోరని.. వెలమలను నమ్ముకుంటే కాకతీయుల రాజ్యమే పోయిందని కొద్దిరోజుల క్రితం రేవంత్ రెడ్డి వ్యాఖ్యాంచారు.

    దీనిపై కాంగ్రెస్ పార్టీలోనూ పెద్ద రచ్చ జరుగుతోంది. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ నేతలు కొందరు తప్పుబడుతున్నారు. మరోవైపు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తమకు అనుకూలంగా మలుచుకోవాలని బీజేపీ వ్యూహరచన చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి(Revanth Reddy) మాటలకు బట్టి కాంగ్రెస్ అంటే రెడ్ల పార్టీ.. టీఆర్ఎస్ అంటే వెలమల పార్టీ అనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్లాయి. వీటిని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ యోచిస్తున్నట్టు సమాచారం.

    తెలంగాణలో తాము అధికారంలోకి రావాలంటే బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని బీజేపీ భావిస్తోంది. ప్రస్తుతం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కీలక పాత్ర పోషిస్తున్న బండి సంజయ్(Bandi Sanjay) కూడా బీసీ సామాజికవర్గానికి చెందిన నాయకుడే. బీజేపీ అంటే బీసీల పార్టీ అని.. కాంగ్రెస్, టీఆర్ఎస్‌లకు భిన్నంగా బీజేపీలో బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తామని బీజేపీ భవిష్యత్తు వ్యూహరచన చేయనుందని సమాచారం. ఇప్పటికే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్‌కు ఆ పార్టీ నాయకత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది.

    Tummala nageswara rao: టీఆర్​ఎస్​ మాజీ మంత్రి తుమ్మల మరోసారి సంచలన వ్యాఖ్యలు.. వారి పని మీరే చేయాలంటూ..

    KCR| Bengaluru: కేసీఆర్‌ బెంగళూరు టూర్‌లో ఆయన మిస్సింగ్.. ఇక అంతేనా ?

    తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే.. ముఖ్యమంత్రి కూడా ఆయనే అవుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలనే ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని.. అలా చేయడం ద్వారా ఇటు కాంగ్రెస్, అటు టీఆర్ఎస్‌ను ఒకేసారి టార్గెట్ చేయవచ్చని బీజేపీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి తెలంగాణ రాజకీయాల్లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన రెడ్డి అనుకూల వ్యాఖ్యలపై కాంగ్రెస్‌లో వ్యతిరేక గళాలు వినిపించడంతో పాటు దీన్ని ఇతర పార్టీలు అనుకూలంగా మార్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Bandi sanjay, Bjp, Revanth Reddy, Telangana, Trs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు