Home /News /telangana /

TS POLITICS BJP FORMED STEERING COMMITTEE FOR MUNUGODU BY ELECTIONS CONSISTS OF 14 MEMBERS AK

BJP| Munugodu: ‘మునుగోడు’పై బీజేపీ కీలక నిర్ణయం.. ఇక అక్కడ గెలుపు బాధ్యత వీరిదే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Telangana|BJP: మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీకి పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మనోహర్ రెడ్డి కో ఆర్డినేటర్‌గా వ్యవహరించనున్నారు. ఇక ఈ కమిటీలో వీరిద్దరితో పాటు మరో 14 మంది సభ్యులు ఉన్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ప్రధాన రాజకీయ పార్టీలకు మునుగోడు(Munugodu) ఉప ఎన్నిక ఎంతో కీలకంగా మారింది. ఈ స్థానాన్ని గెలుచుకుని తెలంగాణ రాజకీయాల్లో తమ ఆధిపత్యాన్ని చాటుకోవాలని ఒకరు.. ఉనికి చాటుకోవాలని మరొకరు.. రాబోయే రోజుల్లో అధికారం తమదే అని ఇంకొకరు ప్రయత్నాలు చేస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో గెలుపు ద్వారా దుబ్బాక, హుజూరాబాద్ సక్సెస్‌ను కంటిన్యూ చేయాలని బీజేపీ(BJP) యోచిస్తోంది. ఇందుకోసం స్వయంగా బీజేపీ ముఖ్యనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) ఎప్పటికప్పుడు ఇక్కడ పార్టీ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. ఇటీవల తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు తెలంగాణకు వచ్చిన అమిత్ షా.. మునుగోడు ఉప ఎన్నికల్లో పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉందనే దానిపై పార్టీ నేతలను ఆరా తీశారు. తన దగ్గర ఉన్న సమాచారాన్ని వారికి వివరించి.. వారి దగ్గర ఉన్న వివరాలను సేకరించి కీలక సూచనలు చేశారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఉప ఎన్నికలకు సంబంధించి ఓ స్టీరింగ్ కమిటీని ప్రకటించింది. మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీకి పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మనోహర్ రెడ్డి కో ఆర్డినేటర్‌గా వ్యవహరించనున్నారు. ఇక ఈ కమిటీలో వీరిద్దరితో పాటు మరో 14 మంది సభ్యులు ఉన్నారు. ఈ మేరకు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. కమిటీ సభ్యులుగా ఎమ్మెల్యే ఈటల రాజేందర్, మాజీ ఎంపీలు ఏపీ జితేందర్ రెడ్డి, గరికపాటి మోహన్ రావు, విజయశాంతి, రవీంద్ర నాయక్, రాపోలు ఆనంద భాస్కర్, మాజీ మంత్రి చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, మండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్, దుగ్యాల ప్రదీప్ కుమార్, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, కపిలవాయి దిలీప్ కుమార్, ఆచారి, దాసోజు శ్రవణ్ లు కొనసాగనున్నారు. బీజేపీకి ముగ్గురు ఎమ్మెల్యేలు ఉండగా... ఒక్క ఈటల రాజేందర్ కు మాత్రమే ఈ కమిటీలో చోటు దక్కింది. మరో ఎమ్మెల్యే రఘునందన్ రావుకు ఈ కమిటీలో చోటు కల్పించలేదు. ఉప ఎన్నిక కోసం బీజేపీ స్టీరింగ్ కమిటీని ప్రకటించడంతో.. ఇక మునుగోడులో బీజేపీ గెలుపు బాధ్యత ఈ కమిటీ మీదే ఎక్కువగా ఉంటుందని పలువురు చర్చించుకుంటున్నారు. Minister KTR: మంత్రి కేటీఆర్ మరో వినూత్న కార్యక్రమం.. ఇంటర్ విద్యార్థులకు ట్యాబ్ ల పంపిణీ.. ఫొటోలివే Renuka Chowdary: రేణుక చౌదరి అలా చేయబోతున్నారా ? వర్కవుట్ అవుతుందా ? అందులోనూ ఈ కమిటీలో జితేందర్ రెడ్డి, ఈటల రాజేందర్ ఉన్నారు. జితేందర్ రెడ్డి దుబ్బాక, హుజూరాబాద్‌లో బీజేపీ విజయాల్లో కీలక పాత్ర పోషించారు. దీంతో ఆయన మునుగోడులోనూ తన వ్యూహాలను పదునుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓ వైపు టీఆర్ఎస్ మునుగోడులో తమ పార్టీ అభ్యర్థిని కూడా ప్రకటించకుండా ముందుకు సాగుతుంటే.. బీజేపీ మాత్రం ఇక్కడ గెలుపు కోసం స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేయడం విశేషం. మొత్తానికి బీజేపీ తాజా నిర్ణయంతో కాంగ్రెస్ , టీఆర్ఎస్‌లు కూడా మునుగోడులో గెలుపు కోసం ప్రత్యేక కమిటీలు ప్రకటిస్తాయేమో చూడాలి.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Munugodu By Election, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు