Home /News /telangana /

TS POLITICS BJP CHIEF BANDI SANJAY SAID THAT 12 MLAS FROM TRS ARE HOLDING SECRET MEETINGS TO DISCUSS THEIR FUTURE PRV

Bandi sanjay: బండి సంజయ్​ సంచలన వ్యాఖ్యలు.. టీఆర్​ఎస్​లో 12 మంది ఎమ్మెల్యేల రహస్య సమావేశం..?

బండి సంజయ్, కేసీఆర్

బండి సంజయ్, కేసీఆర్

ప్రజా సంగ్రామ యాత్ర రెండో రోజులో భాగంగా భువనగిరిలో గురువారం బండి సంజయ్​ మీడియాతో మాట్లాడారు. ఈసందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు.

    తెలంగాణలో మరిన్ని ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ (BJP chief Bandi Sanjay) అన్నారు. టీఆర్‌ఎస్‌ నాయకులే ఉప ఎన్నికలకు కారణం కాబోతున్నారని తెలిపారు. ఇప్పటి వరకు నాలుగు ఉప ఎన్నికల్లో రెండు గెలిచామని, మునుగోడు ఎన్నిక తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును నిర్మించే ఎన్నికలని అన్నారు. కోమటి రెడ్డి బ్రదర్స్ బీజేపీ(BJP)ని, మోదీ పథకాలను చాలా సందర్భాల్లో ప్రశంసించారని ప్రస్తావించారు. చికోటి వ్యవహారంలో కేసీఆర్‌ (KCR) కుటుంబ పాత్ర ఉందని బండి సంజయ్‌ ఆరోపించారు. ప్రజా సంగ్రామ యాత్ర రెండో రోజులో భాగంగా భువనగిరిలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయుష్మాన్ భారత్‌లో జర్నలిస్టులను చేర్చే విషయంపై చర్చిస్తానని తెలిపారు. తెలంగాణలో రానున్నది బీజేపీ ప్రభుత్వమేనని, అధికారంలోకి వచ్చాక జర్నలిస్టులకు రైల్వే పాసులు, ఇళ్లు నిర్మించి ఇస్తామని పేర్కొన్నారు. జర్నలిస్టులను ఆదుకునే బాధ్యత తమదేనన్నారు.

    కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి మద్దతుందంటూ..

    మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ గెలిచి తీరుతుందని బండి సంజయ్ ధీమాను వ్యక్తం చేశారు. మునుగోడు ఉప ఎన్నిక తెలంగాణ ప్రజల భవిష్యత్తును తీర్చిదిద్దనుందన్నారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి మొదటి నుండి టీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాడుతున్నారన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీజేపీలో చేరతారని వార్తలను తాను చూసినట్టుగా చెప్పారు.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మొదటి నుండి టీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాడుతున్నాడన్నారు. . చాలా సందర్భాల్లో మోదఈ పాలనను అభినందించారన్నారు. . బీజేపీ సిద్ధాంతాలు, మోదీ నాయకత్వాన్ని నమ్మి వచ్చే వాళ్లందరినీ బీజేపీలోకి ఆహ్వానిస్తామన్నారు.అదే సమయంలో ప్రధానమంత్రి మోదీ ఆధ్వర్యంలోని ప్రభుత్వ విధానాలను పలుమార్లు ప్రశంసించారని గుర్తు చేశారు.



    మునుగోడు ఉప ఎన్నికతో కేసీఆర్ పతనం పతాక స్థాయికి చేరుకుంటుందన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో గెలిచేది బీజేపీయేనని ఆయన చెప్పారు..కాళేశ్వరం మునగడానికి కేసీఆరే ప్రధాన కారణంగా ఆయన ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం వస్తే తప్పకుండా ఉచిత విద్య, వైద్యం అందిస్తామన్నారు.

    భవిష్యత్తు కోసం..

    తెలంగాణలో ఓ 12 మంది TRS ఎమ్మెల్యేలు రాజీనామాకు సిద్దంగా ఉన్నారని  బండి సంజయ్​ చెప్పారు.  ప్రజలతో ఒత్తిడి చేయించుకుని రాజీనామా చేయబోతున్నారన్నారు. టీఆర్ఎస్ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. ఇప్పటికే 10 నుంచి 12 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక రహస్య ప్రదేశంలో సమావేశమై, తమ భవిష్యత్ ఏంటి అని ఆలోచించుకుంటున్నారన్నారు బండి. కేసీఆర్​ కుటుంబంపై అనేక ఆరోపణలు వస్తున్నాయన్నారు..దీంతో టీఆర్ఎస్ లో కొనసాగితే రాజకీయ భవిష్యత్తు ఉండదనే నిర్ణయానికి ఎమ్మెల్యేలు వచ్చారన్నారు. చీకోటి ప్రవీణ్ కుమార్ క్యాసినో దందా వెనుక కేసీఆర్ కుటుంబ హస్తంతోపాటు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల హస్తం ఉందని బండి సంజయ్ ఆరోపించారు.

    నయీం కేసుతోపాటు మొత్తం వ్యవహారంపై బీజేపీ అధికారంలోకి వచ్చాక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. నయీం ఆస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరూ కొనుగోలు చేయొద్దని ఆయన సూచించారు.నయీమ్ ను ఎన్ కౌంటర్ చేయించిందే కేసీఆర్ కుటుంబమన్నారు.. నయీం అరాచకాల వెనుక టీఆర్ఎస్ హస్తముందన్నారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Bandi sanjay, Telangana Politics, Trs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు