(Sayyad rafi, News18, Mahbubnagar)
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (BJP chief Bandi Sanjay) రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర (Praja sangrama yatra) మహబూబ్నగర్లో (Mahbubnagar) ప్రారంభించిన సంగతి తెలిసిందే. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కేశంపేట మండలం తొమ్మిది రేకుల గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం ఈ ప్రజా సంగ్రామ యాత్రకు పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. ఇప్పటివరకు ఉమ్మడి రాష్ట్రంతో పాటు తెలంగాణలో కాంగ్రెస్ (Congress), తెలుగుదేశం, టీఆర్ఎస్ (TRS) పార్టీలకు ప్రజలు పాలన అవకాశం కల్పించారని ఇప్పుడు ఒక్క ఛాన్స్ భారతీయ జనతా పార్టీకి ఇస్తే ప్రజలను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటామని బండి సంజయ్ (BJP chief Bandi Sanjay) అన్నారు. ఇలా ప్రభాస్ మిర్చి (Prabhas Mirchi) మూవీ ఫేమస్ డైలాగ్ చెప్పారు బండి. రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షులు బొక్క నర్సింహారెడ్డి షాద్ నగర్ నియోజకవర్గం బిజెపి (BJP) నాయకులు శ్రీవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో నేతలు ఏపీ మిథున్ రెడ్డి, పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి, అందే బాబయ్య ఇంకా స్థానిక నేతలు పెద్ద ఎత్తున బండి సంజయ్ కు ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా గ్రామంలో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం రోడ్ షో ద్వారా గ్రామస్థులను ఉద్దేశించి మాట్లాడారు. కేసీఆర్ ఒక్కడి వల్ల తెలంగాణ రాలేదని, ప్రజలు, యువత, ఉద్యోగుల త్యాగాల పునాదులపై తెలంగాణ రాష్ట్రం వచ్చిందని అన్నారు. కానీ దీని ఫలితాలను కేసీఆర్ ఆయన కుటుంబం అనుభవిస్తున్నారని ఆరోపించారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులకే జీతాలు..
తెలంగాణ (Telangana) వస్తే యువతకు ఉద్యోగాలు (Jobs) రాలేదని, పేద ప్రజలకు ఒరిగింది ఏమీ లేదని ఆరోపించారు. ఒక్క కేసీఆర్ (Cm KCR) కుటుంబంలోనే ముఖ్యమంత్రి తో పాటు ఆయన కుమారుడు కేటీఆర్ కూతురు కవిత అల్లుడు హరీశ్ రావు అదేవిధంగా ఎంపీ జోగినిపల్లి సంతోష్ కు నెలకు ఐదు లక్షల జీతం మాత్రం వస్తోందని, ప్రజలకు ఏమైనా వస్తుందా? అని ప్రశ్నించారు. రాత్రింబవళ్లు ఫామ్ హౌజ్ లో కేసీఆర్ మద్యం సేవిస్తూ పాలనను మరిచిపోయారని ఆయన కుమారుడు కేటీఆర్ మాత్రం రోడ్ల పై పడి మొరుగుతున్నాడని తీవ్ర పదజాలం ప్రయోగించారు. తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ కుటంబం అందరూ కలిసి దోచుకుని వాటిని విదేశీ బ్యాంకుల్లో జమ చేస్తున్నారని ఆరోపించారు.
పాలమూరు జిల్లాలో యాత్ర చేపడితే పాలమూరులో కొన్ని పిచ్చి కుక్కలు మొరుగుతున్నాయి అని సంజయ్ (BJP chief Bandi Sanjay) విమర్శించారు. కేసార్ ప్రజల్లోకి వస్తే ఆయన్ని ప్రజలే కొరికి, గిచ్చిచంపుతారు అన్నారు. కేసీఆర్ను బర్బాద్ చేసే దాకా తను వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. తాను పాదయాత్ర చేసి చూసిన ఉమ్మడి పాలమూరు జిల్లా ఎడారిగా మారుతోదని సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. షాద్ నగర్ నియోజకవర్గం లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ నిర్మాణంతో పచ్చగా మారుస్తాను అని చెప్పిన కెసిఆర్ హామీ ఏమైంది? అని ప్రశ్నించారు.
అసలు KCR తెలంగాణ వ్యక్తి కాదని..
జిల్లాలో ప్రాజెక్టు పనులను కుర్చీ వేసుకొని కూర్చొని కట్టిస్తాం అని చెప్పి ఎందుకు ఆ పని చేయలేదని బండి విమర్శించారు. నారాయణపేట, మక్తల్, దేవరకద్ర, మహబూబ్ నగర్, జడ్చర్ల, లక్ష్మీదేవి పల్లి వద్ద కుర్చీ వేసుకొని ప్రాజెక్టు పనులు చేపడతానని శపథం చేసిన కేసీఆర్ ఆ దిశగా ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. ఢిల్లీలో గంటసేపు కూడా ఆందోళన చేయని కెసిఆర్ కేంద్రాన్ని నిందించే అర్హత లేదన్నారు. అసలు కెసిఆర్ తెలంగాణ వ్యక్తి కాదని అతని మూలాలు విజయనగరం జిల్లాలో ఉన్నాయని పేర్కొన్నారు. కేసీఆర్ నీచమైన బ్రతుకు అంటూ విమర్శించారు. కోవిడ్ కష్టకాలంలో ప్రధానమంత్రి మోదీ నిర్ణయం వల్ల ఒక్క వ్యాక్సిన్ కు ఎనిమిది వందల రూపాయలు ఖర్చు పెట్టి పేదలకు ఉచితంగా పంపిణీ చేశారని తెలిపారు.
కేంద్రం నిధులు లేనిదే రాష్ట్ర ప్రభుత్వం ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేపట్ట లేదని బండి సంజయ్(BJP chief Bandi Sanjay) అన్నారు. దమ్ముంటే తాను తగిన సాక్ష్యాధారాలతో కెసిఆర్ తో వాదించడానికి సిద్ధంగా ఉన్నా అంటూ సవాల్ విసిరారు. రాష్ట్రంలో ప్రభుత్వం చేపడుతున్న రైతు వేదిక, స్మశాన వాటిక, బియ్యం పంపిణీ, పల్లె ప్రకృతి వనాలకు కేంద్రం నిధులు మంజూరు చేసిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు కేటీఆర్ కవిత జోగినిపల్లి సంతోష్ లపై తీవ్రమైన విమర్శలు చేశారు. మే 14న తుక్కుగూడ వద్ద జరిగే బిజెపి భారీ సభకు అమిత్ షా వస్తున్నారని ఈ కార్యక్రమానికి ప్రతి ఊరు నుండి కార్యకర్తలు ప్రజలు మహిళలు తరలి రావాలని పిలుపునిచ్చారు.
షాద్ నగర్ నియోజకవర్గంలో ప్రవేశించిన యాత్ర..
ప్రజా వ్యతిరేక నియంతృత్వ కుటుంబ పాలన నుంచి విముక్తి కోసం జోగులంబా గద్వాల్ జిల్లాలో ప్రారంభమైన రెండో విడత ప్రజా సంగ్రామ పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతూ 27వ రోజు మన రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కేశంపేట మండలంలో ప్రవేశించింది. ప్రజాసంగ్రామ యాత్రతో పర్యటిస్తున్న తెలంగాణా రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ ను తొమ్మిదిరేకుల వద్ద ఘనంగా ఆహ్వానించిన రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి, షాద్ నగర్ నియోజకవర్గ బీజేపీ ఇన్చార్జ్ నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి, రాష్ట్ర నాయకులు మిథున్ రెడ్డి, యాత్ర ప్రముఖ్ పాపయ్య గౌడ్, సుదర్శన్ రెడ్డి, సినియర్ నాయకులు పాలమూరు విష్ణు వర్ధన్ రెడ్డి, అందే బాబయ్య, దేపల్లి అశోక్ గౌడ్, డాక్టర్ విజయ్ కుమార్, పల్లె అనంద్, మండల అధ్యక్షుడు పసుల నర్సింహులు, వంశీకృష్ణ, మల్చాలం మురళి, ఎంకనోళ్ళ వెంకటేష్, శ్రీకాంత్ యాదవ్, ప్యాట అశోక్, ఎబివిపి సాయి, నర్సింహా యాదవ్, అంతిగారి నరేష్, కేశంపేట మండల నాయకులు కార్యకర్తలు వందలాది మంది భారీగా పాల్గొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bandi sanjay, Mirchi film, Prabhas, Telangana bjp