Home /News /telangana /

TS POLITICS BJP CHIEF BANDI SANJAY MET FORMER TELANGANA MP PONGULETI SRINIVAS REDDY FULL DETAILS HERE PRV

TRS | BJP: మాజీ ఎంపీ పొంగులేటిని కలిసిన బీజేపీ చీఫ్ బండి సంజయ్​.. పూర్తి వివరాలివే..

పొంగులేటితో బండి సంజయ్​ (Photo: Facebook/Bandi sanjay)

పొంగులేటితో బండి సంజయ్​ (Photo: Facebook/Bandi sanjay)

పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి. ఆయన టీఆర్​ఎస్​లోనే ఉంటానని చెబుతున్నా అదే మాట మీద చివరి వరకు ఉంటారా? అనేది చాలామందికి డౌటే. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ చీఫ్​ బండి సంజయ్​.. ఆదివారం పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డిని కలవడం రాజకీయ వర్గాల్లో హాట్​ టాఫిక్​గా మారింది.

ఇంకా చదవండి ...
    పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి (Ponguleti srinivas reddy). సౌమ్యునిగా, ఎవరినైనా ప్రేమతో ఆదరణగా దగ్గరకు తీసుకుంటారన్న పేరున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన సహజ ధోరణితో ప్రజలకు దగ్గరయ్యారు. వాస్తవానికి రాజకీయ అరంగేట్రం చేసిన ఏడాది కాలంలోనే ఎంపీ అయ్యారు. వైసీపీ (YSRCP) నుంచి ఎంపీగా తనతో పాటు, మరో ముగ్గురు ఎమ్మెల్యేలను గెలిపించుకుని వ్యక్తిగతంగా తన రాజకీయ ఇమేజ్‌ను పెంచుకున్న పొంగులేటి మారిన పరిస్థితుల్లో ఆ పార్టీని వీడారు. సీఎం కేసీఆర్‌ పిలుపు మేరకు టీఆర్​ఎస్​లో చేరారు. పార్టీ మారిన సమయంలో ఆయన ఖమ్మం (Khammam) ఎంపీగా, వైసీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నారు. శ్రీనివాసరెడ్డి భవిష్యత్తుకు నాది భరోసా అంటూ అప్పట్లో బహిరంగ వేదికపైనే తెరాస (TRS) అధినేత, సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారు.

    అయితే మరుసటి ఎన్నికల సమయానికి పొంగులేటి విషయంలో కేసీఆర్‌ మాట నిలుపుకోలేకపోయారు. సిట్టింగ్‌ ఎంపీగా ఉన్న తనకు టికెట్‌ నిరాకరించి, నామా నాగేశ్వరరావుకు టికెట్ కేటాయించారు. ఈ సందర్భంలో ఏదో ఒక పార్టీ నుంచి కంటెస్ట్‌ చేయాలని, లేదంటే ఇండిపెండెంట్‌గా పోటీ చేసినా గెలుపు ఖాయమన్న స్థాయిలో సానుభూతి వెల్లువెత్తింది. అయినా తానున్న పరిస్థితుల్లో పొంగులేటి ఎక్కడా తొందరపాటు ప్రదర్శించలేదు. పెదవి విప్పలేదు.



    మరోవైపు బీజేపీ (BJP) తెలంగాణలో బలంగా నాటుకుపోతోంది. ఈ నేపథ్యంలో ఎక్కువగా టీఆర్​ఎస్​, కాంగ్రెస్​లో అసంతృప్తులకు గాలం వేస్తూ ముందుకు సాగుతోంది. అందులో భాగంగానే ఖమ్మంపై ఎక్కువగా ఫోకస్​ పెట్టింది. అందులో ముఖ్యంగా పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి కూడా ఉండటం గమనార్హం. ఆయన టీఆర్​ఎస్​లోనే ఉంటానని చెబుతున్నా అదే మాట మీద చివరి వరకు ఉంటారా? అనేది చాలామందికి డౌటే. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ చీఫ్​ బండి సంజయ్ (BJP chief Bandi Sanjay)​.. ఆదివారం పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డిని కలవడం రాజకీయ వర్గాల్లో హాట్​ టాఫిక్​గా మారింది. అవును వీరిద్దరూ కలిశారు. ఎందుకు? ఎలా కలిశారంటే..?

    పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాధురి దంపతుల కుమార్తె సప్ని రెడ్డి , రామసహాయం సురేందర్ రెడ్డి మనుమడు అర్జున్ రెడ్డి ల వివాహ నిశ్చితార్ధ వేడుక హైదరాబాద్ లోని అప్పా జంక్షన్ కి సమీపంలో గల పొంగులేటి నూతన రిసార్ట్స్ లో ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి బండి సంజయ్ (Bandi sanjay)​కి ప్రత్యేక ఆహ్వానం అందింది. ఈ నేపథ్యంలో నిశ్చితార్థ వేడుకకు బీజేపీ చీఫ్​​ హాజరయ్యారు. పొంగులేటిని పలకరించారు. వధూవరులను ఆశీర్వదించారు. అయితే ఇలా పొంగులేటితో బండి సంజయ్​ని చూడటంతో ఇరువురి మధ్య సఖ్యత బాగానే ఉందంటూ చర్చించుకుంటున్నారు.



    ఈ సందర్భంగా బండి సంజయ్​ ఫేస్​బుక్​లో పోస్టు పెట్టారు. “హైదరాబాద్‌లో జరిగిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కుమార్తె నిశ్చితార్థ వేడుకకు హాజరయ్యాను. జీవితంలో కొత్త ప్రయాణం కోసం ఈ సందర్భంగా సప్ని మరియు అర్జున్ దంపతులను ఆశీర్వదించాను.”అని పేర్కొన్నారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Bandi sanjay, Hyderabad, Ponguleti srinivas reddy, Telangana bjp, Trs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు