Home /News /telangana /

TS POLITICS BJP CHIEF BANDI SANJAY EXPRESSED HIS ANGER OVER THE SHOOTING INCIDENT OF MINISTER SRINIVAS GOUD IN THE FREEDOM RALLY PRV

Bandi sanjay: తెలంగాణలో రజాకార్ల పాలన ఉన్నట్లుంది: మంత్రి శ్రీనివాస్​ గౌడ్​పై బండి సంజయ్​ ఆగ్రహం

శ్రీనివాస్​ గౌడ్​, బండి సంజయ్​ (ఫైల్​ ఫొటోలు)

శ్రీనివాస్​ గౌడ్​, బండి సంజయ్​ (ఫైల్​ ఫొటోలు)

మంత్రి శ్రీనివాస్ గౌడ్ తుపాకీ కాల్పుల వ్యవహారం తెలంగాణలో హాట్​ టాపిక్​గా మారింది. దీనిపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శలు గుప్పించారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Nalgonda, India
    మంత్రి శ్రీనివాస్ గౌడ్ తుపాకీ కాల్పుల (Minister Srinivas Goud gun firing) వ్యవహారం తెలంగాణలో హాట్​ టాపిక్​గా మారింది. దీనిపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (BJP chief Bandi Sanjay )విమర్శలు గుప్పించారు. తెలంగాణలో రజాకార్ల పాలన మళ్లీ వచ్చినట్టుగా కన్పిస్తుందని  బండి సంజయ్ చెప్పారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా ఉమ్మడి నల్గొండ (Nalgonda) జిల్లాలో సంజయ్ ఆదివారం మీడియాతో చిట్ చాట్ చేశారు. స్పోర్ట్స్ మీట్ ను ప్రారంభ సూచికంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ గాల్లోకి కాల్పులు (Gun firing) జరిపారు. ఈ రకంగా కాల్పులు జరపడాన్ని బండి సంజయ్ తప్పుబట్టారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు (TRS MLA), మంత్రులు లైసెన్స్ ఉన్న గుండాలు అంటూ ఆయన మండి పడ్డారు.

    Munugodu by Elections: తెలంగాణ రాజకీయం.. మునుగోడులో పోటీకి ఆ జాతీయ పార్టీ భయపడుతోందా? 

    కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మంచి లీడర్..

    మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ను విమర్శించలేదన్నారు. తనతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి టచ్ లో ఉన్నారని తాను ఏనాడూ కూడా చెప్పలేదని మరోసారి వివరణ ఇచ్చారు బండి సంజయ్. కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మంచి లీడర్ అని ఆయన కితాబిచ్చారు. మునుగోడు ఉప ఎన్నిక నుండి కాంగ్రెస్, టీఆర్ఎస్ ఎప్పుడో పారిపోయాయని ఆయన ఎద్దేవా చేశారు. ఈడీని కేంద్ర ప్రభుత్వం వాడుకోదల్చుకొంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక్క మంత్రి, ఎమ్మెల్యే కూడా మిగలరన్నారు. కమ్యూనిష్టులు ఎప్పుడు ఎలా ఉంటారో వారికే తెలియదన్నారు. దుబ్బాకలో కాంగ్రెస్ క్యాడర్ బీజేపీకి సపోర్ట్ చేసిందని గుర్తు చేశారు బండి సంజయ్​.



    ఫ్రీడం ర్యాలీలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. అయితే తుపాకులతో కవాతులు నిర్వహించాలని ఎక్కడా లేదు. మహబూబ్ నగర్‌లోనూ ఇలా పోలీసులు తుపాకులతో కవాతులు నిర్వహించలేదు. కానీ మంత్రి గారు పాల్గొంటున్నారన్న ఉద్దేశంతో సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బందితో పాటు కార్యక్రమం కోసం పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇలా ఏర్పాటు చేసిన వారిలో తన పక్కన ఉన్న పోలీసు అధికారి నుంచి ఎస్ఎల్ఆర్ వెపన్‌ను తీసుకున్న శ్రీనివాస్ గౌడ్ ఊహించని విధంగా కాల్పులు జరిపేశారు.

    అయితే కాల్పుల ఘటన తెలంగాణలో చర్చనీయాంశం కావడంతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. తాను కాల్చింది రబ్బర్ బుల్లెట్ అంటూ మంత్రి వివరణ ఇచ్చారు. తను కాల్చింది రబ్బర్ బుల్లెట్ అని తాను ఎవరి వద్ద గన్ తీసుకొని కాల్చలేదని స్వయంగా ఎస్పీ ఇస్తేనే కాల్చానని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వివరణ ఇచ్చారు. టీవీలో వస్తున్న కథనాలపై స్పందించారు తనపై అసత్య కథనాలతో బురద జల్లుతున్నారంటూ మంత్రి మండిపడ్డారు. ఫోన్ లైన్ లో ఈ ఘటనపై వివరణ ఇచ్చారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Bandi sanjay, Gun fire, Srinivas goud

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు