Home /News /telangana /

TS POLITICS BJP CHIEF BANDI SANJAY ACCUSED CM KCR OF MAKING TELANGANA INDEBTED AND MAKING EMPLOYEES UNABLE TO PAY THEIR DUES PRV

Telangana: సీఎం కేసీఆర్​పై బండి సంజయ్​ ఆగ్రహం..ఉద్యోగులకు ఆ గతి పట్టించారంటూ ధ్వజం

bandi sanjay, KCR (File photo)

bandi sanjay, KCR (File photo)

సీఎం కేసీఆర్​ తెలంగాణను అప్పుల కుప్పగా మార్చాడని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ విమర్శించారు. కేసీఆర్ పాలనా వైఫల్యం వల్లే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దిగజారిందని అన్నారు.

    తెలంగాణ (Telangana)లో బీజేపీ, టీఆర్​ఎస్​ పార్టీలు పోటాపోటీ మీడియా సమావేశాలతో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూనే ఉన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో ఇప్పటికే కత్తులు దూసుకుంటున్న ఇరుపార్టీలు తాజాగా తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆరోపణలు చేసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్​ (CM KCR) అప్పుల కుప్పగా మార్చాడని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ (Bandi Sanjay) ఆరోపణలు గుప్పించారు. సీఎం కేసీఆర్ (CM KCR) పాలనా వైఫల్యం వల్లే తెలంగాణ ఆర్ధిక పరిస్థితి దిగజారిందని బండి మండిపడ్డారు. ఈ మేరకు  బండి సంజయ్  బుధవారం ఓ  ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రమని, మిగులు రాష్ట్రమని చెబుతూనే రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని  బండి సంజయ్ ఆరోపణలు గుప్పించారు. రాష్ట్రాన్ని కేసీఆర్ దివాళా తీయించారని బండి  విమర్శించారు.

    జనవరి జీతమే రాలేదు..

    తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు కేసీఆర్​ ప్రభుత్వం జీతాలు, పెన్షన్లు ఇవ్వడం లేదని బండి సంజయ్​ ఆరోపించారు. రోజుకో జిల్లాకు జీతాలు చెల్లిస్తున్నారని బండి సంజయ్ విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల చెల్లింపు ప్రతి నెల రెండో వారానికి చేరుకుందని సంజయ్ ఆరోపించారు. 317 జీవో ద్వారా బదిలీ అయిన ఉద్యోగులకు జనవరి నెల జీతం ఇంకా చెల్లించలేదని బండి సంజయ్ చెప్పారు.

    దాచుకున్న డబ్బులను కూడా చెల్లించట్లేదే..

    తెలంగాణ (Telangana) ఉద్యోగులు జీపీఎఫ్ లో దాచుకున్న డబ్బులను కూడా టీఆర్​ఎస్​ ప్రభుత్వం చెల్లించే పరిస్థితి లేదన్నారు. తమ పిల్లల ఉన్నత చదువుల కోసం, వివాహాల కోసం దాచుకున్న డబ్బులు చెల్లించకపోవడాన్ని బండి సంజయ్ విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ట్రీట్ మెంట్ చేసుకొంటే ఆసుపత్రులకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు చెల్లించట్లేదని బండి అన్నారు  దీంతో కార్పొరేట్​ ఆసుపత్రులు ఉద్యోుగులకు వైద్యం చేయడం లేదని బండి సంజయ్ విమర్శించారు.

    పార్టీ బలోపేతంపై దృష్టి..

    కాగా, తెలంగాణలోని టీఆర్​ఎస్​ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని ఇదే మంచి సమయం అంటూ బీజేపీ నేతలు పావులు కదుపుతున్నారు. పార్టీ క్యాడర్ పటిష్టం చేసకునే పనిలో పడ్డారు.  ఈ మేరకు మంగళవారం నాడు Hyderabad లోని పార్టీ కార్యాలయంలో నేతలతో బీఎల్ సంతోష్ కుమార్ సమావేశమయ్యారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే విషయమై పార్టీ నేతలతో ఆయన చర్చించారు. ఈ సఃందర్భంగా పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చారు.

    తమకు కేటాయించిన నియోజకవర్గాలకు వెళ్లి నేతలంతా పనిచేయాలని బీజేపీ సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ కుమార్ చెప్పారు. హైద్రాబాద్ ను వదిలి వెళ్లాలన్నారు. జిల్లాల్లోనే పార్టీ జిల్లా అధ్యక్షులు ఉండాలని ఆయన సూచించారు. లేకపోతే పార్టీ పదవులకు రాజీనామా చేయాలని ఆయన తేల్చి చెప్పారు. పార్టీలో చేరికలు వద్దు, మేమే ఉంటామంటే కుదరదన్నారు. పనిచేసే వాళ్లకు పార్టీలో గుర్తింపు ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.మాట్లాడే భాష విషయంలో జాగ్రత్తగా ఉండాలని కూడా ఆయన సూచించారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Bandi sanjay, CM KCR, Telangana Politics

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు