హోమ్ /వార్తలు /తెలంగాణ /

Election Commission: కేసీఆర్ 'BRS'కు బిగ్ షాక్..పోటీగా మరో 3 పార్టీలు ఉన్నాయన్న కేంద్ర ఎన్నికల సంఘం

Election Commission: కేసీఆర్ 'BRS'కు బిగ్ షాక్..పోటీగా మరో 3 పార్టీలు ఉన్నాయన్న కేంద్ర ఎన్నికల సంఘం

సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్

దసరా పండుగ శుభసందర్బంగా తెలంగాణ సీఎం కేసీఆర్ కొత్త జాతీయ పార్టీని అనౌన్స్ చేశారు. ప్రస్తుతం ఉన్నTRS (Telangana rashtra samithi)ని BRS (bharath rashtra samithi)గా మారుస్తూ అధికారిక ప్రకటన చేశారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

    దసరా పండుగ శుభసందర్బంగా తెలంగాణ సీఎం కేసీఆర్ కొత్త జాతీయ పార్టీని అనౌన్స్ చేశారు. ప్రస్తుతం ఉన్నTRS (Telangana rashtra samithi)ని BRS (bharath rashtra samithi)గా మారుస్తూ అధికారిక ప్రకటన చేశారు. దీనితో టీఆర్ఎస్ ఇక బిఆర్ఎస్ గా మారబోతుంది. కేసీఆర్ ప్రకటనతో 21 ఏళ్ల టిఆర్ఎస్ ప్రస్థానంలో మరో కీలక మలుపు చేసుకుంది. ఇక దీనికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘానికి BRS తీర్మానం అందజేశారు.

    ఆ బృందంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, పార్టీ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. వీరు టీఆర్ఎస్ పార్టీని బిఆర్ఎస్ గా తీర్మానం చేసిన కాపీని కేంద్ర ఎన్నికల సంఘం డిప్యూటీ కమిషనర్ ధర్మేంద్ర శర్మకు అందజేసినట్లు వారు తెలిపారు. ఆ కాపీని కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని ధర్మేంద్ర చెప్పారని టీఆర్ఎస్ నాయకులూ వివరించారు.

    ఇదిలా ఉంటే TRS ను BRSగా మారుస్తూ తీసుకున్న నిర్ణయం పట్ల కేసీఆర్ కు ఈసీ షాకిచ్చింది. ఇప్పటికే BRS పేరుకు పోలికగా మరో 3 పార్టీలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇవన్నీ కూడా కేంద్ర ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ అయ్యి గుర్తింపు పొందలేదని తెలుస్తుంది. సికింద్రాబాద్ నుంచి బహుజన రాష్ట్ర సమితి, ముంబై నుంచి బహుజన రిపబ్లిక్ సోషలిస్టు పార్టీ, జైపూర్ నుంచి భారతీయ రాష్ట్ర సమానతవాది పార్టీలు ఈసీ దగ్గర గుర్తింపు పొందకుండా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకోనుందో ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

    అయితే ఈనెల 14 వరకు కేంద్ర ఎన్నికల సంఘం TRSను BRSగా మారుస్తూ ఆమోదిస్తే మాత్రం మునుగోడులో BRS పేరునే పోటీ చేయనున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ పార్టీ పేరు మారేంత వరకు పాత పేరు, పాత గుర్తుతోనే పోటీ చేయాల్సి వస్తుంది. అయితే ఇతర రాష్ట్రాల్లో పోటీ చేసేటప్పుడు మాత్రం కేంద్ర ఎన్నికల సంఘం కారు గుర్తునే కేటాయిస్తారా లేక మరేదైనా గుర్తును కేటాయిస్తారా అన్నది చూడాలి. ఏ రాష్ట్రంలోనైనా ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటే నోటిఫికేషన్ వెలువడడానికి 2 రోజుల ముందు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయాల్సి ఉంటుంది. ఒకవేళ ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల్లో పోటీ చేసే సమయానికి పేరు మార్చకుంటే టీఆర్ఎస్ పేరుతోనే పోటీకి అనుమతివ్వాలని లేఖ రాయాల్సి ఉంటుంది. అయితే మేము కొత్తగా జాతీయ పార్టీని ఏర్పాటు చేయడం లేదు కేవలం టీఆర్ఎస్ ను బీఆర్ ఎస్ గా మార్చాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరుతున్నామన్నారు.

    Published by:Rajashekar Konda
    First published:

    ఉత్తమ కథలు