హోమ్ /వార్తలు /తెలంగాణ /

ఫ్లాష్..ఫ్లాష్: వైఎస్ షర్మిలకు బిగ్ రిలీఫ్..పాదయాత్రకు తెలంగాణ హైకోర్టు అనుమతి..కానీ..

ఫ్లాష్..ఫ్లాష్: వైఎస్ షర్మిలకు బిగ్ రిలీఫ్..పాదయాత్రకు తెలంగాణ హైకోర్టు అనుమతి..కానీ..

వైఎస్ షర్మిలకు బిగ్ రిలీఫ్

వైఎస్ షర్మిలకు బిగ్ రిలీఫ్

YSRTP అధినేత్రి వైఎస్ షర్మిల (Ys sharmila)కు బిగ్ రిలీఫ్. షర్మిల చేపట్టిన పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని పోలీసులను తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. సీఎం కేసీఆర్, రాజకీయ, మతపరమైన వ్యాఖ్యలు చేయొద్దని హైకోర్టు వ్యాఖ్యానించింది. షర్మిల తన పాదయాత్రలో ఎలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయొద్దని సూచిస్తూ పాదయాత్రకు అనుమతి ఇచ్చింది.  

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

YSRTP అధినేత్రి వైఎస్ షర్మిల (Ys sharmila)కు బిగ్ రిలీఫ్. షర్మిల చేపట్టిన పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని పోలీసులను తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. సీఎం కేసీఆర్, రాజకీయ, మతపరమైన వ్యాఖ్యలు చేయొద్దని హైకోర్టు వ్యాఖ్యానించింది. షర్మిల  (Ys sharmila) తన పాదయాత్రలో ఎలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయొద్దని సూచిస్తూ పాదయాత్రకు అనుమతి ఇచ్చింది. Ysrtp పాదయాత్రపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటీషన్ వేసింది. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు పాదయాత్రకు మళ్లీ దరఖాస్తు పెట్టుకోవాలని హైకోర్టు సూచించింది.

Warangal: చరిత్ర కలిగిన శిల్పకళా సంపద.. అభివృద్ధికి నోచుకోని ఖిల్లా వరంగల్

అగ్గిరాజేసిన నిన్నటి వ్యాఖ్యలు..

షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా నిన్న నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు అగ్గిరాజేశాయి. చేతకాని ఎమ్మెల్యేలంతా తెరాసలోనే అన్నారు. ఇక పేరులోనే పెద్ది..ఆయనది చిన్న బుద్ధి అని విమర్శించారు. ఈ నియోజకవర్గంలో రాళ్ల వాన పడి 20 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగితే ఆదుకొనే పరిస్థితి లేదని ఆరోపించారు. 15 రోజుల్లో పరిహారం ఇస్తానని చెప్పి పెద్ది సుదర్శన్ రెడ్డి మోసం చేశారని షర్మిల ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నారు. షర్మిల కాన్వాయ్ ను, ప్రచార రథాన్ని ధ్వంసం చేశారు. ఈ క్రమంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీనితో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.

Ys Sharmila: వైఎస్ షర్మిలపై కేసు నమోదు..జైలుకు తరలించే అవకాశం?

వైఎస్ విజయమ్మ ఆగ్రహం..

ఇక షర్మిల అరెస్టుపై ఆమె తల్లి విజయమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన బిడ్డను చూడడానికి వెళ్తుంటే పోలీసులు అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించొద్దా? పాదయాత్ర చేయకూడదా? అని విజయమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. షర్మిల పాదయాత్ర ప్రారంభిస్తారా అని మీడియా అడగగా ప్రారంభిస్తుందని నేను అనుకుంటానని అన్నారు. ఈ ఘటనపై ఎవరు కూడా ప్రశ్నించకపోవడం బాధ కలిగించిందని అన్నారు. ఇక ఏపీ సీఎం జగన్ వస్తారా అన్న ప్రశ్నకు ఆమె స్పందిస్తూ జగన్ తో ఏపీతో మనకేం సంబంధం చూద్దాం అంటూ చెప్పుకొచ్చారు. పోలీసుల తీరుపై విజయమ్మ ధర్నా చేపట్టారు. 10 నిమిషాల్లో షర్మిలను విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

సినిమాను తలపించిన అరెస్ట్ సీన్..

ఇక అంతకుముందు లోటస్ పాండ్ నుండి ప్రగతి భవన్ కు బయలుదేరిన షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆమె డోర్ తీయకుండా అలాగే ఉండిపోయారు. దీనితొ షర్మిల కారులో ఉండగానే క్రేన్ సాయంతో సోమాజిగూడ నుండి SR నగర్ స్టేషన్ కు తరలించారు. అక్కడ కూడా ఆమె డోర్ తీయకపోవడంతో పోలీసులు లాఠీ సాయంతో కారు డోర్ తీశారు. అనంతరం ఆమెను పీఎస్ లోపలి తీసుకెళ్లారు.

First published:

Tags: Hyderabad, Telangana, YS Sharmila

ఉత్తమ కథలు