హోమ్ /వార్తలు /తెలంగాణ /

Big Breaking: మొయినాబాద్ ఫామ్ హౌజ్ కేసులో పోలీసులకు భారీ ఊరట..నిందితులు లొంగిపోవాలని ఆదేశం

Big Breaking: మొయినాబాద్ ఫామ్ హౌజ్ కేసులో పోలీసులకు భారీ ఊరట..నిందితులు లొంగిపోవాలని ఆదేశం

హైకోర్టు

హైకోర్టు

మొయినాబాద్ ఫామ్ హౌజ్ కేసులో తెలంగాణ హైకోర్టు (Telangana Highcourt) కీలక తీర్పునిచ్చింది. సీబీఐ (CBI) కోర్టు తీర్పును సవాల్ చేస్తూ సైబరాబాద్ పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేసిన హైకోర్టు నిందితుల రిమాండ్ ను ఏసీబీ కోర్టు కొట్టివేయడాన్ని సమర్ధించింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

మొయినాబాద్ (Moinabadh) ఫామ్ హౌజ్ కేసులో తెలంగాణ హైకోర్టు (Telangana Highcourt) పోలీసులకు ఊరటనిచ్చింది.  నిందితులను రిమాండ్ కు ఇవ్వలేమని సీబీఐ (CBI) కోర్టు తీర్పును సవాల్ చేస్తూ సైబరాబాద్ పోలీసులు హైకోర్టును (High court) ఆశ్రయించారు. దీనిపై విచారణ చేసిన హైకోర్టు (High court) ఏసీబీ కోర్టు రిమాండ్ రిజెక్ట్ ను కొట్టివేసింది. నిందితుల రిమాండ్ కు అనుమతినిస్తూ హైకోర్టు (High court) ఆదేశాలు ఇచ్చింది. నిందితులు వెంటనే సైబరాబాద్ సీపీ ముందు లొంగిపోవాలని  కోర్టు ఆదేశించింది. వారిని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలని హైకోర్టు (High court) ఆదేశాలు ఇచ్చింది.

Telangana: ఫ్రీ..:ఫ్రీ..ఫ్రీ.. మటన్ కొంటే చికెన్ ఉచితం.. అదిరిపోయే ఆఫర్.. ఎక్కడంటే..

మొదటగా లా అండ్ ఆర్డర్ పోలీసులకు ఈ కేసులో రిమాండ్ చేసే అధికారం లేదని హైకోర్టు (High court) స్పష్టం చేసింది. నిందితుల అరెస్ట్ లో ఏసీబీ ప్రొసీజర్ ఫాలో కాలేదని హైకోర్టు అభిప్రాయపడింది. ఈ క్రమంలో పోలీసుల పిటీషన్ ను హైకోర్టు (High court) తిరస్కరించింది. నిందితులను రిమాండ్ కు అర్హత లేదని కోర్టు తెలిపింది. పీసీ యాక్ట్ పెడితే ఏసీబీ రూల్స్ ఫాలో కావాలని కోర్టు స్పషం చేసింది. దీనిపై మరోసారి ప్రభుత్వ వాదనలను హైకోర్టు (High court) విని కీలక ఆదేశాలు జారీ చేసింది.

Raja Singh: ఏడాది పాటు జైల్లోనే రాజాసింగ్.. జీవో జారీచేసిన తెలంగాణ సర్కార్

ఈనెల 26న మొయినాబాద్ ఫామ్ హౌజ్ ఘటన తెలంగాణ వ్యాప్తంగా సంచలనం రేపింది.  టీఆర్ఎస్ కు చెందిన పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు (Rega Kanthrao), అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు (Guvvala Balaraju), తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి (Pilot Rohit Reddy), కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి (Harshavardhan Reddy)ని పార్టీ వీడాలని కాంట్రాక్టులు, పదవులు డబ్బు ఇస్తామని ప్రలోభపెట్టారు. ఎమ్మెల్యేల ఫిర్యాదుతోనే తాము ఈ యత్నాలను బయటపెట్టినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఫరీదాబాద్ ఆలయానికి చెందిన రామచంద్ర భారతి (Rama chandra bhrathi), హైదరాబాద్ (Hyderabad) కు చెందిన నందూ కుమార్ (Nandukumar), తిరుపతికి చెందిన సింహయాజి (Simhayaji)ని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ పనంతా బీజేపీ (Bjp) పన్నిన పన్నాగమనే టీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. మా ఎమ్మెల్యేలను కొనాలనే కుట్రను తిప్పికొట్టామని టీఆర్.ఎస్ నాయకులు చెబుతున్నారు. ఇదంతా టీఆర్ఎస్ (Trs) ఆడుతున్న కొత్త నాటకమని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు.

First published:

Tags: Highcourt, Police, Telangana

ఉత్తమ కథలు