నటుడు, నిర్మాత, వ్యాపారవేత్తగా ఉన్న బండ్ల గణేష్ రాజకీయ నాయకుడనే ముద్రవేసుకోవడానికి గత కొన్ని ఏళ్లుగా పడరాని పాట్లు పడుతున్నారు. మీడియాలో , సోషల్ మీడియాలో ప్రస్తుత రాజకీయాలపై తనకు తోచినట్లుగా స్టేట్‌మెంట్‌లు ఇచ్చే టెంపర్ ప్రొడ్యూసర్ ఈసారి ఏకంగా కమలదళపతిపై కస్సుబుస్సుమన్నారు. గులాబీ బాస్‌ని భుజాలకు ఎత్తుకున్నారు. ఈయన స్టేట్‌మెంట్, డైలాగ్ డెలవరీ చూస్తుంటే గతంలో కాంగ్రెస్‌లో ఉండి టీఆర్‌ఎస్‌ని తిట్టినట్లుగా ..ఇప్పుడు టీఆర్‌ఎస్‌కు వంత పలుకుతూ బీజేపీని టార్గెట్ చేశారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆంధ్రా(Andhra)- తెలంగాణ(Telangana)అనే తేడా లేదు. అధికార, ప్రతిపక్ష పార్టీలు అనే ఆలోచన చేయరు. తనకు నచ్చినట్లు, ఆ క్షణానికి ఏం మాట్లాడుతాలనిపిస్తే అదే మాట్లాడతారు నటుడు, నిర్మాత బండ్లగణేష్Bandla Ganesh. గతంలో కమ్మ కులం అంటూ ఏపీ ఎంపీ, వైసీపీ(YCP MP) నేత విజయసాయిరెడ్డి(Vijayasai Reddy)తో ట్విట్టర్(Twitter)లో గట్టిగా వార్ పెట్టుకున్న గణేష్ ..ఇప్పుడు తెలంగాణ ఎంపీ, బీజేపీ(BJP MP) రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay)తో కయ్యానికి కాలు దువ్వారు. ప్రజాసంగ్రామయాత్రలో బండి సంజయ్ తెలంగాణ సీఎం కేసీఆర్(KCR)పై చేసిన వ్యాఖ్యలను పట్టుకొని బండ్ల గణేష్ ఓ మీడియా(Media)తో జరిగిన ప్రత్యేక ఇంటర్వూ( Interview)లో బీజేపీ నాయకులపై విమర్శలు, ఆరోపణలు చేశారు.
బండి కామెంట్స్‌కి బండ్ల కౌంటర్..
బండి సంజయ్ తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ఖాసీం చంద్రశేఖర్ రిజ్వీగా పేరు మార్చి విమర్శించడాన్ని బండ్లగణేష్ తీవ్రంగా తప్పు పట్టారు. ఒక ముస్లిం పేరుతో హిందూ మతాన్ని అవమానించారంటూ బండి సంజయ్‌పై బండ్ల గణేష్ ఫైర్ అయ్యారు. హిందువులు, ముస్లింల మధ్య విద్వేషాలు సృష్టిస్తూ బీజేపీ మత హింసను రెచ్చగొడుతోందని బండ్ల ఆరోపించారు. రాజకీయాల ధ్రువీకరణతో తెలంగాణలో అధికారంలోకి రావాలని బీజేపీ భావిస్తోందంటూ బండ్ల గణేష్ బీజేపీ నేతలపై నిప్పులు చెరిగారు.
భారతదేశం లో ఏ బీజేపీ నాయకుడికి లేనంత దైవ భక్తి కేసీఆర్ గారికి వుంది
ఒక్క చంద్రశేఖరుడు అనే హిందువుని పరమేశ్వరుడి పేరు గల వ్యక్తిని ముస్లిం పేరు పెట్టి మత విధవ్వేషాలు రెచ్చగొడుతుంది మీరు (బండి సంజయ్)@ganeshbandla pic.twitter.com/DWGZtKY44d
— Latha (@LathaReddy704) August 17, 2022
కేసీఆర్‌లో దైవభక్తి కొదవలేదు..
కేసీఆర్‌లోని దైవభక్తి, హిందుత్వవాదంతో పోలిస్తే దేశంలో ఏ బీజేపీ నాయకుడు సరిపోరని కౌంటర్ ఇచ్చారు బండ్ల గణేష్. అంతే కాదు కేసీఆర్ వేల కోట్లు వెచ్చించి యాదాద్రి ఆలయాన్ని నిర్మించారని చెప్పారు. గత 75 ఏళ్లలో దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంత భారీ స్థాయిలో ఆలయాన్ని నిర్మించిన దాఖలాలు లేవన్నారు. ఒక హిందువుగా ఆయన చేసే యాగాలు, పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలను బీజేపీ నేతలు ఎవరైనా చేశారా అని ప్రశ్నించారు బండ్లగణేష్.
మునుగోడులో బీజేపీకి మూడో స్థానమే..
ఫైనల్‌గా మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ పొజిషన్ ఏంటో కూడా తేల్చి చెప్పారు టెంపర్ ప్రొడ్యూసర్. స్వతహాగా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చినప్పటికి మునుగోడు కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా ఉంటుందన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్‌కు కంచుకోట కావడంతో అక్కడ కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని బీజేపీకి మూడో స్థానం దక్కుతుందని బండ్ల గణేష్ ఓ టీవీ షోకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పారు. అంతే కాదు బీజేపీ నేతలు కేసీఆర్ పేరును ఖాసీం రిజ్వీగా మార్చినట్లే బీజేపీ నేతలు అమిత్‌షా, మోదీ పేర్లను మార్చితే ఊరుకుంటారా అని ఈ రాజకీయ చిచ్చులోకి బీజేపీ కమలం పార్టీ పెద్దలను సైతం లాగారు బండ్ల గణేష్.
ఈ స్టేట్‌మెంట్‌కి కారణం ఏమిటి..
తాను ఏ రాజకీయ పార్టీకి చెందిన వాడిని కాదంటూనే బండ్ల గణేష్ ఏపీలో కులం పేరుతో వైసీపీని, తెలంగాణలో మతం పేరుతో బీజేపీని టార్గెట్ చేయడం చూస్తుంటే..కచ్చితంగా కండువా మార్చుతారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే చేవెళ్ల ఎంపీ టీఆర్ఎస్ నాయకుడు కావడం..ఆయనతో తనకు మంచి రిలేషన్ ఉందని..వ్యాపారంలో కూడా భాగస్వామి అని పలుమార్లు చెప్పుకొచ్చిన సినీ నటుడు రాబోయే ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచనతోనే ఈ తరహా స్ట్రాటజీ ఫాలో అవుతున్నారని బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bandi sanjay, Bandla Ganesh, CM KCR, Telangana News