Home /News /telangana /

TS POLITICS BANDI SANJAY SAYS THOSE RESPONSIBLE FOR THE DEATH OF KHAMMAM BJP LEADER SAIKIRAN WILL BE SEVERELY PUNISHED SNR KMM

Telangana Bjp: ఖమ్మం సాయిగణేష్ ఆత్మహత్యకు ఆ మంత్రే కారణం..వదిలే ప్రసక్తే లేదన్న బండి సంజయ్

(దోషుల్ని వదిలే ప్రసక్తే లేదు)

(దోషుల్ని వదిలే ప్రసక్తే లేదు)

Telangana Bjp:ఖమ్మంలో ఆత్మహత్య చేసుకున్న బీజేపీ నాయకుడు సాయిగణేష్‌ కుటుంబాన్ని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పరామర్శించారు. ప్రశ్నిస్తున్నాడనే నెపంతోనే సాయికిరణ్‌పై అక్రమ కేసులు పెట్టి ఆత్మహత్యకు కారణమయ్యారని జిల్లా మంత్రిపై విమర్శలు చేశారు. సాయికిరణ్‌ మృతికి కారకులైన వారిని వదిలిపెట్టమన్నారు.

ఇంకా చదవండి ...
    (G.SrinivasReddy,News18,Khammam)
    ఖమ్మం(Khammam)జిల్లా బీజేపీ యువనాయకుడు బీజేపీ సాయి గణేష్(Sai Ganesh)ఆత్మహత్యకు పరోక్షంగా జిల్లాకు చెందిన మంత్రే కారణమన్నారు తెలంగాణ బీజేపీ (BJP Telangana) రాష్ట్ర  అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay). సాయికిరణ్ మృతికి కారణమైన ఏ ఒక్కరిని వదలమని ఎంతటి వారినైనా ఊపేక్షించే ప్రసక్తే లేదని మండిపడ్డారు. నేరస్తుల్ని ఆ దేవుడు కూడా కాపాడలేడని ధ్వజమెత్తారు. గతనెలలో ఖమ్మంలో ఆత్మహత్య చేసుకున్న బీజేపీ నాయకుడు సాయి గణేష్ కుటుంబాన్ని పరామర్శించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు. సాయి గణేష్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు బండి సంజయ్. సాయి గణేష్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. సాయిగణేష్ మరణానికి కారకులైన వారికి శిక్షపడే వరకు పోరాడతామని భరోసా కల్పించారు బండి సంజయ్. బిజెపి రాష్ట్ర, స్థానిక నేతల సహకారంతో కొనుగోలు చేసిన ఇంటికి పత్రాలను కుటుంబ సభ్యులకు అందించారు.

    కేసులు పెట్టి ప్రాణాలు తీస్తారా..
    ఖమ్మం పర్యటనలో రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు బండి సంజయ్. తెలంగాణలో శాంతి భద్రతలు క్షిణించాయన్నారు. అంబేద్కర్‌ రాజ్యాంగం కాకుండా కల్వకుంట్ల రాజ్యాంగం అమలౌతుందన్నారు. చేతిలో అధికారం ఉందన్న ఒకే ఒక్క అహంకారంతో మంత్రి ఆయన అనుచరులు పోలీసులపై ఒత్తిడి చేసి సాయికిరణ్‌పై 16 కేసులు పెట్టించారని బండి సంజయ్ ఆరోపించారు. ప్రశ్నించే వాళ్లపై కేసులు పెట్టి భయపెట్టడం ఎక్కడి న్యాయమన్నారు. సాయి గణేష్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబితే మరణ వాగ్మూలం తీసుకోకపోవడం నేరం కాదా అని ప్రశ్నించారు. మరణ వాంగ్మూలం ఎందుకు తీసుకోలేదో వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు బండి సంజయ్.

    మృతుని కుటుంబానికి బీజేపీ భరోసా..
    కమ్మ సంఘం ఎన్నికల్లోనే మంత్రి మద్దతు దారుడిని ఆయన సామాజికవర్గానికి చెందిన వాళ్లు నమ్మలేదని దుయ్యబట్టారు బండి సంజయ్. వ్యాపారం కోసం పార్టీలు మారే సంస్కారం మంత్రిది ఎలాంటి వారిని చట్ట ప్రకారం శిక్షించే విధంగా న్యాయపోరాటం చేస్తామన్నారు. బండి సంజయ్ ఖమ్మం పర్యటనలో తమిళనాడు బీజేపీ సహా ఇంచార్జి పొంగులేటి సుధాకర్ రెడ్డి, భారతీయ కిషన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డితో పాటు మరికొందరు జిల్లా నేతలు ఉన్నారు. జిల్లాలో సాయికిరణ్ ఆత్మహత్య ఘటన విషయంలో టీఆర్ఎస్ కార్యకర్తల దాడిలో గాయపడ్డ హిందూవాహిని జిల్లా అధ్యక్షులు  చంద్రశేఖర్‌ని బండి సంజయ్ పరామర్శించారు.
    Published by:Siva Nanduri
    First published:

    Tags: Khammam, Telangana Politics

    తదుపరి వార్తలు