హోమ్ /వార్తలు /తెలంగాణ /

TRS vs BJP : ట్యాంక్‌బండ్‌ కాకపోతే ప్రగతిభవన్‌లో.. గణేష్ నిమజ్జనం చేసి తీరుతాం : బండి సంజయ్

TRS vs BJP : ట్యాంక్‌బండ్‌ కాకపోతే ప్రగతిభవన్‌లో.. గణేష్ నిమజ్జనం చేసి తీరుతాం : బండి సంజయ్

సీఎం కేసీఆర్‌కు  బండి సంజయ్ కౌంటర్

సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్ కౌంటర్

Bandi Sanjay: గణేష్‌ నవరాత్రుల సందర్భంగా రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్‌కి ప్రతిపక్ష బీజేపీకి మధ్య మరోసారి వార్ కొనసాగుతోంది. నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లను ప్రభుత్వం ఇప్పటి వరకు మొదలుపెట్టకపోవడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తీవ్రంగా తప్పుపట్టారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

గణేష్‌ నవరాత్రుల సందర్భంగా రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్‌(TRS)కి ప్రతిపక్ష బీజేపీకి మధ్య మరోసారి వార్ కొనసాగుతోంది. నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లను ప్రభుత్వం ఇప్పటి వరకు మొదలుపెట్టకపోవడాన్ని బీజేపీ(BJP)రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌(Bandi Sanjay)తీవ్రంగా తప్పుపట్టారు. సుప్రీం కోర్టు ఉత్తర్వుల(Supreme Court orders)పేరుతో హిందూ సమాజాన్ని, హిందువుల మనోభావాల్ని దెబ్బతీస్తున్నారని సీఎం కేసీఆర్‌(KCR)పై విమర్శలు చేశారు. ట్యాంక్ బండ్‌(Tank Bund)లో నిమజ్జనం ఏర్పాట్లను ప్రభుత్వం ఏర్పాటు చేయపోతే వినాయక నిమజ్జనం జరిగే ప్రదేశం మారుతుందన్నారు. ఖైరతాబాద్‌ గణేష్‌(Khairatabad Ganesh) విగ్రహం మొదల్కొని అన్నింటిని ప్రగతిభవన్‌(Pragati Bhavan)కు తీసుకొచ్చి అక్కడే నిమజ్జనం చేయాల్సి వస్తుందని బండి సంజయ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. టీఆర్ఎస్‌కి మిత్రపక్షంగా ఉన్న ఎంఐఎం మెప్పు కోసం టీఆర్ఎస్‌ ఇలాంటి ప్రయత్నాలు చేయడం మానుకోవాలని తెలంగాణ బీజేపీ నేతలు ప్రభుత్వానికి సూచించారు.

Wood ganesh:74 ఏళ్లుగా ఏటా ఘనంగా చవితి ఉత్సవాలు .. నిమజ్జనం మాత్రం లేదు కారణం ఏంటో తెలుసాట్యాంక్‌బండ్ కాకపోతే ..ప్రగతిభవన్‌లో :  బండి సంజయ్‌ 

తెలంగాణలో బీజేపీ , టీఆర్ఎస్‌కి మధ్య బయటకు కనిపించని వార్ జరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా జరుపుకునే గణేష్ నవరాత్రి ఉత్సవాలకు, గణేష్ నిమజ్జనం కార్యక్రమాల ఏర్పాట్లను ప్రభుత్వం చేపట్టడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. కేవలం సుప్రీం కోర్టు ఉత్తర్వుల పేరుతో గణేష్‌ నిమజ్జనం కార్యక్రమాన్ని ఎలాగైనా అడ్డుకోవాలనే ఆలోచనలో టీఆర్ఎస్ సర్కారు ఉందని ఆయన ఆరోపించారు. కేవలం ఒక వర్గం ఓట్ల కోసం యావత్ హిందూ సమాజాన్ని చులకన చేయడం, నిర్లక్ష్యంగా చూడటం మంచి పద్దతి కాదన్నారు బండి సంజయ్. గణేష్‌ నిమజ్జనం కార్యక్రమాన్ని తాము ప్రశాంతంగా నిర్వహించాలని చూస్తుంటే టీఆర్ఎస్ ప్రభుత్వం నిబంధనల పేరుతో అలజడి సృష్టించాలని చూస్తోందన్నారు.

నిమజ్జనం ఏర్పాట్లు మేం చేస్తాం..

ప్రభుత్వానికి నిమజ్జనం ఏర్పాట్లు చేయడం చేతకాకపోతే భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పారు బీజేపీ చీఫ్. ఏర్పాట్లు చేయకపోయినా నిమజ్జనం చేసి తీరుతామన్నారాయన. ఒకవేళ శాంతిభద్రతల పేరుతో ఏదైనా ఆందోళన సృష్టించాలని చూస్తే విగ్రహాలు నిమజ్జనం చేసే ప్లేసు మారుతుందన్నారు. ట్యాంక్‌బండ్‌లో కాకుండా ప్రగతి భవన్‌లో నిమజ్జనం చేస్తామని ఘాటుగా వార్నింగ్‌ ఇచ్చారు.

ఎంఐఎం కోసమే ఇదంతానా: బండి సంజయ్

ఎంఐఎం లాంటి మతతత్వ పార్టీని సంతృప్తి పరచడానికే వినాయక ఉత్సవాలను ప్రభుత్వం అడ్డుకుంటోందన్నారు. కేవలం ఒక వర్గం ఓట్ల కోసం ఇంతటి రాజకీయ దిగజారుడు తనం సరికాదని చెప్పారు బండి సంజయ్. కరోనా విపత్కర పరిస్థితుల్లో రంజాన్‌ పండుగకు ఓల్డ్ సిటీలో ముస్లింలు ప్రార్ధనలు చేసుకుంటే హిందువులు ఎవరూ అభ్యంతరం చెప్పలేదన్నారు. అలాంటి ఇప్పుడు టీఆర్ఎస్‌ ప్రభుత్వం హిందువుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తోందన్నారు. ఏది ఏమైనా గణేష్ నిమజ్జనం చేసి తీరుతామన్న బండి సంజయ్ సోమవారం ఖైరతాబాద్‌ గణేషుడ్ని దర్శించుకున్నారు.

Hyderabad : అర్ధరాత్రి అమ్మాయిలను సీక్రెట్‌గా వీడియో తీశాడు .. వాళ్లకు తెలియడంతో పారిపోవాలని ట్రై చేసి..మనోభావాలు దెబ్బతీయొద్దు..

వినాయకచవితి హిందువులు అందరూ జరుపుకునే పండుగ అనే విషయాన్ని మర్చిపోవదన్నారు బండి సంజయ్. హైదరాబాద్‌లో నిమజ్జనం ఏర్పాట్లపై బీజేపీ, వీహెచ్‌పీ మాట్లుడుతుంటే టీఆర్ఎస్‌ నేతలు, కొందరు కుహునా మేధావులు బీజేపీ మత విధ్వేషాలను రెచ్చగొడుతోందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు బండి సంజయ్. ఇప్పటికైనా టీఆర్ఎస్‌ ప్రభుత్వం చేస్తున్న ఈ కుటిల రాజకీయాల్ని హిందూ సమాజం తిప్పికొట్టాలని ..నిమజ్జనం ఏర్పాట్లు చేయడంపై ప్రభుత్వాన్ని నిలదీయాలని అందరికి పిలుపునిచ్చారు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.

Published by:Siva Nanduri
First published:

Tags: Bandi sanjay, CM KCR, Ganesh Chaturthi​ 2022, Telangana Politics

ఉత్తమ కథలు