రాష్ట్ర గవర్నర్ కు ప్రభుత్వం కనీస గౌరవం ఇవ్వడం లేదని తెలంగాణ చీఫ్ బండి సంజయ్ (Bandi Sanjay) కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర గవర్నర్ ను పట్టించుకోవడం లేదు, గవర్నర్ లేకుండానే బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తారా అని ఆయన ప్రశ్నించారు. నేడు మహబూబ్ నగర్ (Mahabubnagar)లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో పాల్గొన్న బండి సంజయ్ (Bandi Sanjay) కేసీఆర్ (Cm Kcr) సర్కార్ పై ఫైర్ అయ్యారు.
తెలంగాణ ప్రజలకు కేసీఆర్ ఏం చేశారు?
అసలు తెలంగాణ ప్రజలకు కేసీఆర్ ఏం చేశారని బండి సంజయ్ (Bandi Sanjay) సూటిగా ప్రశ్నించారు. ఇక ఇప్పుడు కేసీఆర్ జాతీయ పార్టీ ఎందుకు పెట్టారని అన్నారు. రాష్ట్రంలో ప్రతీ ఒక్కరిపై కూడా అప్పులు మోపిన ఘనత కేసీఆర్ సర్కార్ దే అన్నారు. కేసీఆర్ ఏ దేశం గురించి మాట్లాడితే ఆ దేశం దివాళా తీస్తుంది. చైనా గురించి మాట్లాడితే కరోనా సంక్షోభంతో బిక్కుబిక్కుమంటుంది. తెలంగాణ ప్రజలు ప్రత్యామ్నాయ ప్రభుత్వం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రజలు బీజేపీకి ఈసారి అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నారు. ఇక ప్రస్తుతం శ్రీలంక, పాకిస్థాన్ ఎంతటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయో మనం చూస్తున్నాం. కేంద్రం సరైన విధివిధానాల వల్లే భారత్ పరిస్థితి ఇప్పుడు వాటికంటే మెరుగ్గా ఉన్నాయని బండి సంజయ్ (Bandi Sanjay) అన్నారు.
గవర్నర్ కు మర్యాద ఏది?
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కు కనీస గౌరవం కూడా ప్రభుత్వం ఇవ్వడం లేదని బండి సంజయ్ (Bandi Sanjay) విమర్శించారు. అసలు గవర్నర్ లేకుండానే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తారా అని బండి (Bandi Sanjay) ప్రశ్నించారు.
ఆస్తులు, సంక్షేమ కార్యక్రమాలపై శ్వేతపత్రం..
కేసీఆర్, కుటుంబసభ్యుల ఆస్తుల వివరాలపై అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేయాలని బండి సంజయ్ (Bandi Sanjay) డిమాండ్ చేశారు. అలాగే సంక్షేమ కార్యక్రమాల అమలుపై కూడా శ్వేతపత్రం రిలీజ్ చేయాలని అన్నారు. ఇక జీవో నెంబర్ 317కు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్న ప్రభుత్వ టీచర్లకు బండి సంజయ్ (Bandi Sanjay) మద్దతు తెలిపారు. జీవో 317ను సవరించకుంటే వారికి మద్దతుగా ధర్నా చౌక్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామన్నారు. కాగా గవర్నర్ కు, ప్రభుత్వానికి మధ్య కొంతకాలంగా దూరం పెరిగిన విషయం తెలిసిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bandi sanjay, Bjp, Kcr, Tamilisai Soundararajan, Telangana