తెలంగాణ సీఎం కేసీఆర్ (Cm Kcr) పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) నిప్పులు చెరిగారు. ఖమ్మంలో బీఆర్ఎస్ బహిరంగ సభలో కేసీఆర్ (Cm Kcr) చేసిన వ్యాఖ్యలను బండి తీవ్రంగా వ్యతిరేకించారు. BRS బహిరంగ సభ అట్టర్ ప్లాప్ అయింది. కేసీఆర్ (Cm Kcr) సభకు ఇవాళ వచ్చిన వారు రేపు రారని బండి సంజయ్ (Bandi Sanjay) ఎద్దేవా చేశారు. నిన్నటి సభకు కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, బీహార్ సీఎం నితీష్ కుమార్ ఎందుకు రాలేదో సమాధానం చెప్పాలని బండి సూటిగా ప్రశ్నించారు. ఇక అగ్నిపథ్ అనేది బిపిన్ రావత్ (Bipin Ravath) సూచించారు. ఆయన కంటే ఎక్కువగా కేసీఆర్ కు అగ్నిపథ్ గురించి తెలుసా అని విమర్శించారు.దేశంపై కేసీఆర్ ద్వేషం పెంచుకున్నాడని బండి సంజయ్ (Bandi Sanjay) ఫైర్ అయ్యారు.
BRS బహిరంగ సభ అట్టర్ ప్లాప్..
బీఆర్ఎస్ బహిరంగ సభ అట్టర్ ప్లాప్ అయిందని బండి సంజయ్ (Bandi Sanjay) సెటైర్లు వేశారు. అసలు నిన్న ఇండియా-న్యూజిలాండ్ మ్యాచ్ చూశారు తప్ప ఎవరూ సభను పట్టించుకోలేదన్నారు. ఇక సీఎంలను యాదాద్రికి తీసుకెళ్లి భక్తులను ఇబ్బందులకు గురి చేశారు. ఇక రాష్ట్రంలో ఏ గ్రామంలో 24 గంటలు కరెంట్ ఉంటుందో చెప్పాలని బండి సూటిగా ప్రశ్నించారు. ఎప్పుడు కరెంటు ఉంటుందో పోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. డిస్కంలను ప్రభుత్వం చెల్లించడం లేదని బండి సంజయ్ (Bandi Sanjay) ఆరోపణలు చేశారు.
రైతుబంధు ఇస్తున్నారు కానీ..
రైతులకు రైతుబంధు పేరిట సాయం అందజేసి సబ్సిడీలన్నీ తీసేశారన్నారు. కనీసం పెండింగ్ బిల్లులు చెల్లించడానికి కూడా డబ్బులు లేవన్నారు. ఇక నిన్నటి సభలో కేసీఆర్ జై తెలంగాణ అనలేదు. తెలంగాణ సోయి అంటే ఏంటో ఇప్పుడు ప్రజలు చూపిస్తారని బండి సంజయ్ (Bandi Sanjay) సవాల్ విసిరారు.
పోలీస్ రిక్రూట్ మెంట్ పై బండి విమర్శలు..
బిపిన్ రావత్ గొప్ప ఆలోచనే అగ్నిపథ్ అని బండి సంజయ్ (Bandi Sanjay) గుర్తు చేశారు. ఇక తెలంగాణ పోలీస్ రిక్రూట్ మెంట్ సక్రమంగా అమలు చేయడం లేదని అన్నారు. తెలంగాణలో ఉన్న వాళ్లందరికీ దళితబంధు ఇవ్వలేదు కానీ దేశమంతా ఇస్తామని నమ్మలేని మాటలు చెబుతున్నారు. అంబెడ్కర్ జయంతి, వర్ధంతికి రాని కేసీఆర్ దళితులకు ఎలా మేలు చేస్తారని బీజేపీ చీఫ్ మండిపడ్డారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bandi sanjay, Bjp, BRS, CM KCR, Telangana, Telangana bjp