మునుగోడు (Munugode)ఉపఎన్నికలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (Komati Reddy Rajagopal Reddy)ఒక్కడిని ఓడించడానికి టీఆర్ఎస్ (TRS)ప్రభుత్వం మొత్తం కలిసి కట్టుగా పని చేసిందన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay).ప్రజాతీర్పును గౌరవిస్తామన్న బండి సంజయ్ ఇంతకీ మునుగోడులో గెలిచింది కేసీఆర్(KCR) హరీష్‌రావా(Harish RaO),కేటీఆర్, (KTR),లేక వామపక్షాల కాదంటే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డా (Kusukuntla Prabhakarreddy)అని ప్రశ్నించారు. గెలిచామని విర్రవీగతున్న టీఆర్ఎస్ ఒక్క ఎమ్మెల్యే సీటు గెలవడం కోసం వెయ్యి కోట్లు ఖర్చు చేసిందని ఆరోపించారు. ఫలితాల అనంతరం ప్రెస్‌మీట్ పెట్టిన బండి సంజయ్ మునుగోడు ప్రజల తీర్పును శిరసావహిస్తామన్నారు. ప్రజలకు కేసీఆర్ ఇచ్చిన హామీలను 15రోజుల్లో నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
ఒక్కడిపై వెయ్యి కోట్లు ఖర్చు ..
మునుగోడు ఉపఎన్నికల ముందు గెలిచేది మేమే అని చెప్పుకున్న ప్రధాన పార్టీలు బీజేపీ, టీఆర్ఎస్ ఫలితాల తర్వాత అంతకు రెట్టింపు స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నాయి. ప్రలోభాలు, డబ్బు ఖర్చు చేసినా బీజేపీనప్పటికి ప్రజలు ఓడించి బుద్ధి చెప్పారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. దీనికి కౌంటర్ ఇచ్చారు బండి సంజయ్ . ఒక్క రాజగోపాల్‌రెడ్డిని ఓడించడానికి వెయ్యి కోట్లు ఖర్చు చేయడంతో పాటుగా 16మంది మంత్రులు, 86మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మునుగోడులో పని చేశారని..ఒక్కో ఎమ్మెల్యే ఒక్కో బూత్‌కి పని చేసినప్పటికి మోస్తరు మెజారిటీతో టీఆర్ఎస్ గెలిచి విర్రవీగుతోందని కౌంటర్ ఇచ్చారు.
Live: Addressing the Press Conference at BJP State Office. https://t.co/7Kz18VNz9q
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) November 6, 2022
ఆ 12మందిని పోటీ చేయించే దమ్ముందా..
మునుగోడు విజయాన్ని అడ్డుపెట్టుకొని విర్రవీగుతున్న టీఆర్ఎస్ నాయకుల్ని ప్రజలు గమనిస్తున్నారని హెచ్చిరించారు బండి సంజయ్. ప్రజల తీర్పును గౌరవిస్తున్నామన్న తెలంగాణ బీజేపీ చీఫ్ టీఆర్ఎస్ పార్టీ బెదిరింపులు, ప్రలోభాలకు తట్టుకొని నిలబడి పోరాడిన తమ పార్టీ కార్యకర్తలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానన్నారు. మునుగోడు ఓటమితో మా పోరాటం ఆగిపోదన్న సంజయ్ ..మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్ధిని గెలిపిస్తే 15రోజుల్లో ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని చెప్పిన కేసీఆర్ మాట నిలబెట్టుకోవాలన్నారు. ఒక్క ఓటమితో బీజేపీ శ్రేణులు నిరుత్సాహానికి లోనవద్దని కోరారు. చివరగా వేరే పార్టీల నేతల్ని టీఆర్ఎస్లో చేర్చుకున్న పార్టీ అధినాయకులకు వారితో రాజీనామా చేయించి ప్రజాక్షేత్రంలో మళ్లీ పోటీ చేసే దమ్ము ఉందా అని సవాల్ విసిరారు బండి సంజయ్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.