హోమ్ /వార్తలు /తెలంగాణ /

Etela Rajendar: ఈటలకు మరోసారి బండి కౌంటర్.. అలాంటివి బీజేపీలో ఉండవంటూ..

Etela Rajendar: ఈటలకు మరోసారి బండి కౌంటర్.. అలాంటివి బీజేపీలో ఉండవంటూ..

ఈటల రాజేందర్, బండి సంజయ్ (ఫైల్ ఫోటో)

ఈటల రాజేందర్, బండి సంజయ్ (ఫైల్ ఫోటో)

Telangana BJP: ఈటల రాజేందర్ గజ్వేల్ నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన తరువాత బీజేపీలో దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. బీజేపీ నాయకత్వం ఈ విషయంలో ఈటల రాజేందర్‌కు అనుమతి ఇచ్చిందా ? అనే వాదన కూడా వినిపించింది.

తెలంగాణలో టీఆర్ఎస్‌ను వీడి బీజేపీలో చేరి మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచారు మాజీమంత్రి ఈటల రాజేందర్. బీజేపీలో ఆయన ప్రస్తుత చేరిక కమిటీకి కన్వీనర్‌గా ఉన్నారు. ఇతర పార్టీల నుంచి నేతలను బీజేపీలోకి తీసుకొచ్చే కీలక బాధ్యతలను ఈటల రాజేందర్(Etela Rajendar) పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే పలువురు నేతలతో ఈ మేరకు సంప్రదింపులు జరిగిన ఈటల.. త్వరలోనే వారిని పార్టీలోకి తీసుకెళ్లబోతున్నారనే చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే ఈటల రాజేందర్ కొద్దిరోజుల క్రితం చేసిన ఓ ప్రకటన బీజేపీతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కేసీఆర్(KCR) ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న గజ్వేల్  నుంచి పోటీ చేస్తానని ఈటల రాజేందర్ ప్రకటించారు. అయితే ఆయన బీజేపీ అధిష్టానం సూచన మేరకు ఈ ప్రకటన చేశారా లేక సొంతంగానే ఈ నిర్ణయం తీసుకున్నారా ? అన్నది ఎవరికీ అర్థంకాలేదు.

అయితే ఈటల రాజేందర్ ఈ విషయంలో సొంతంగానే నిర్ణయం తీసుకుని ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్టు ఇటీవల బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలతో అర్థమైంది. అంతేకాదు ఈ విషయంలో ఈటల రాజేందర్ తీసుకున్న నిర్ణయాన్ని బండి సంజయ్ పరోక్షంగా తప్పుబట్టారనే టాక్ కూడా వినిస్తోంది. ఇటీవల మీడియాతో మాట్లాడిన బండి సంజయ్.. బీజేపీలో ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలనే విషయాన్ని తమ పార్టీ నాయకత్వమే నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎవరికి వాళ్లు సొంత నిర్ణయాలు తీసుకోలేరని అన్నారు. తన విషయంలోనూ ఇదే వర్తిస్తుందని బండి సంజయ్ క్లారిటీ ఇచ్చారు.

ఈ రకంగా ఈటల రాజేందర్ గజ్వేల్ నుంచి పోటీ చేయాలనే ఆలోచన కేవలం ఆయన వ్యక్తిగతమే అని.. ఈ విషయంలో పార్టీకి సంబంధం లేదని బండి సంజయ్ తేల్చేశారు. నిజానికి ఈటల రాజేందర్ గజ్వేల్ నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన తరువాత బీజేపీలో దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. బీజేపీ నాయకత్వం ఈ విషయంలో ఈటల రాజేందర్‌కు అనుమతి ఇచ్చిందా ? అనే వాదన కూడా వినిపించింది. కానీ అలాంటిదేమీ లేదని ఆ తరువాత తేలిపోయింది. అయితే ఈటల రాజేందర్ ఈ రకమైన ప్రకటన చేయడంపై కొందరు నేతలు అసహనం వ్యక్తం చేశారు.

Telangana Congress: టార్గెట్ రాజగోపాల్ రెడ్డి.. రూటు మార్చనున్న కాంగ్రెస్.. ఈ రోజే తేలిపోనుందా ?

New Scheme in Telangana: తెలంగాణలో రైతు బీమా తరహాలో మరో సంచలన పథకం.. మంత్రి కేటీఆర్ సంచలన ప్రకటన.. ఈ నెల 7 నుంచే..

ఇతర పార్టీల్లో ఉండే ఈ రకమైన సంప్రదాయం బీజేపీలో ఉండదని.. ఈ విషయం తెలియకుండా ఈటల రాజేందర్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారేమో అనే కొందరు భావించారు. మరోవైపు ఈటల రాజేందర్‌కు ఈ విషయంలో స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని.. లేకపోతే చాలామంది నేతలు తాము పోటీ చేయబోయే సీట్ల గురించి ప్రకటించి పార్టీకి లేనిపోని తలనొప్పులు తీసుకొచ్చే అవకాశం ఉందని రాష్ట్ర పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే బండి సంజయ్ ఈ అంశంపై స్పందించారేమో అనే టాక్ కూడా వినిపిస్తోంది. మొత్తానికి బండి సంజయ్ స్పందన తరువాత ఈటల రాజేందర్ మళ్లీ గజ్వేల్ నుంచి పోటీ చేసే అంశంపై ప్రస్తావిస్తారేమో చూడాలని పార్టీ వర్గాలు ఎదురుచూస్తున్నాయి.

First published:

Tags: Bandi sanjay, Etela rajender, Gajwel, Telangana

ఉత్తమ కథలు