ముందస్తు ఎన్నికలకు సిద్ధమన్న మంత్రి కేటీఆర్ (Minister KTR) వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) స్పందించారు. మేము ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని కేటీఆర్ కు బండి సవాల్ విసిరారు. మేము ముందస్తు ఎన్నికలకు సిద్ధం. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రెడీగా ఉన్నాం. అయితే ముందస్తు ఎన్నికల మాట నీ తండ్రితో చెప్పించగలవా అని కేటీఆర్ ను బండి సంజయ్ (Bandi Sanjay) ప్రశ్నించారు. బీజేపీలో ఎవరూ కోవర్టులు లేరు. ఈటల రాజేందర్ (Etela Rajender) మాటలను అలా అనుకోనని బండి స్పష్టం చేశారు. ఇక రాష్ట్రంలో 24 గంటల కరెంటు ఎక్కడ ఇస్తున్నారు. దీనిని నిరూపిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటానని బండి సంజయ్ (Bandi Sanjay) అన్నారు. దీనికి కేటీఆర్ సిద్ధమా అని సవాల్ విసిరారు.
రైతుల ఆత్మహత్యల్లో 4వ స్థానంలో తెలంగాణ ..
రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ 4వ స్థానంలో ఉంది. అసలు రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు లేవని చెప్పడం సిగ్గు చేటు. ఇక దళితుడిని సీఎం చేయడం ఎంత నిజమో రైతులను ఎమ్మెల్యేలు చేస్తామనడం అంతే నిజం. రైతుబంధు ఇస్తూ అన్ని రకాల సబ్సిడీలను ఎత్తివేశారు. గోదావరిలో మన వాటా నీటిని వాడుకోలేని కేసీఆర్ దేశం గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని బండి సంజయ్ (Bandi Sanjay) విమర్శించారు. ప్రజలు ఆదాయం ఇస్తుంటే ఒక్కో కుటుంబంపై రూ. 6 లక్షల అప్పు కేసీఆర్ బహుమతిగా ఇచ్చాడని ఎద్దేవా చేశారు.
శ్వేతపత్రం విడుదల చేయాలి..
తెలంగాణ అభివృద్ధి, ఆదాయంపై ప్రభుత్వం శ్వేతపత్రం రిలీజ్ చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. కరెంటు చార్జీల పెంపుతో మరోసారి ప్రజలపై భారం మోపేందుకు సర్కార్ సిద్ధంగా ఉందని బండి సంజయ్ విమర్శించారు. ఇక ఎసిడి ఛార్జీలను ప్రజలు చెల్లించవద్దన్నారు. మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నాయా అని బండి ప్రశ్నించారు. కేసీఆర్ సీఎం అయ్యాక వలసలు పెరిగిపోయాయి. కనీసం దుబాయిలో చనిపోయిన వారిని కూడా తీసుకురాలేక పోతున్నారన్నారు. ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేక జీవో నెంబర్ 317ను తీసుకొచ్చారని బండి మండిపడ్డారు.
నిన్న నిజామాబాద్ లో పర్యటించిన కేటీఆర్ (Minister Ktr) అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో ముందస్తు ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. బీఆర్ఎస్ శ్రేణులు కూడా అందుకు సన్నద్ధం కావాలని మంత్రి వ్యాఖ్యానించారు. కేంద్రం పార్లమెంట్ ను రద్దు చేసి ముందస్తుకు వస్తే తాము కూడా ముందస్తుకు వచ్చే విషయంపై ఆలోచిస్తామన్నారు. అప్పుడు అందరం కలిసి ముందస్తుకు వెళ్లొచ్చని మంత్రి కేటీఆర్ (Minister Ktr) అన్నారు. ఈ క్రమంలో బండి సంజయ్ కేటీఆర్ కు సవాల్ విసిరారు. మరి బండి వ్యాఖ్యలపై కేటీఆర్ ఎలా రియాక్ట్ అవుతారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bandi sanjay, Kcr, Minister ktr, Telangana