Home /News /telangana /

TS POLITICS BANDI SANJAY BLAMES TRS FOR BJP LEADERS DEATH IN KHAMMAM SNR KMM

Khammam: పురుగుల మందు తాగి బీజేపీ నేత సూసైడ్..చావుకు కారణం వాళ్లేనట

(బీజేపీ లీడర్ సాయి గణేష్)

(బీజేపీ లీడర్ సాయి గణేష్)

Khammam:బీజేపీ నాయకుడు సాయి గణేష్‌ మృతితో ఖమ్మంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. అక్రమ కేసులు పెట్టి పోలీసులు వేధించడం వల్లే పురుగుల మందు తాగాడని బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. మరోవైపు జిల్లాలో ఉద్రిక్తత పరిస్థితుల నేపధ్యంలో పోలీసులు మంత్రి కార్యాలయం, టీఆర్‌ఎస్‌ ఆఫీస్‌ దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేశారు.

ఇంకా చదవండి ...
ఖమ్మ(Khammam)జిల్లాకు చెందిన బీజేపీ(BJP) నాయకుడు మృతి చెందడంతో బీజేపీ శ్రేణులు ఆగ్రహం ఉన్నారు. బీజేపీ మజ్దూర్‌ యూనియన్‌ జిల్లా కన్వీనర్ (Mazdoor Union District Convener)సాయి గణేష్(Sai Ganesh)ఈనెల 14వ తేదిన పురుగుల మందు (Insecticide)తాగాడు. జిల్లా పోలీసు(Police)లు తనపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ ఖమ్మం త్రీటౌన్‌ పోలీస్ స్టేషన్‌(Threetown Police Station)లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పురుగుల మందు తాగిన సాయి గణేష్‌ని ముందు ఖమ్మం ఆసుపత్రి(Hospital)లో చికిత్స అందించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌(Hyderabad)యశోధ ఆసుపత్రి(Yashodha Hospital)లో చేర్చారు. చికిత్స పొందుతూ శనివారం (Saturday)ఉదయం ప్రాణాలు విడిచాడు సాయి గణేష్. దీనిపై బీజేపీ నాయకులు తీవ్రఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాయిగణేష్‌ లాంటి బలమైన బీజేపీ నాయకుడ్ని జిల్లా పోలీసులు, అధికారంలో ఉన్న మంత్రి కలిసి పొట్టనపెట్టుకున్నారని మండిపడుతున్నారు. మరోవైపు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి ముందు బీజేపీ నాయకులు, శ్రేణులు ఆందోళనకు దిగారు.

కమలం పార్టీ కార్యకర్త మృతి..
సాయి గణేష్‌ని అధికార పార్టీ నేతలు, పోలీసులు ఆత్మహత్య చేసుకునేంతగా వేధింపులకు గురి చేశారని ఆరోపించారు. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మరోవైపు జిల్లాలో పాదయాత్ర చేస్తున్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ సాయి గణేష్‌ మృతిపై స్పందించారు. బీజపీ కార్యకర్త చావుకు ప్రభుత్వం, జిల్లాకు చెందిన మంత్రే కారణమన్నారు. టీఆర్ఎస్‌ ప్రభుత్వం బీజేపీ నాయకులపై అధికారదర్పాన్ని ఉపయోగించి భయబ్రాంతులకు గురి చేస్తోందన్నారు. టీఆర్ఎస్‌ నేతల అక్రమాలు, దుర్మార్గాలను ప్రశ్నిస్తున్న బీజేపీ నేతలపై అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురి చేస్తోందని విమర్శించారు బండి సంజయ్. చనిపోయిన సాయి గణేష్‌పై అక్రమ కేసులు పెట్టడం వల్లే తీవ్ర మనస్థాపానికి గురై పోలీస్ స్టేషన్‌లోనే పురుగుల మందు తాగాడని అందుకు ప్రభుత్వ పెద్దలే కారణమని మండిపడ్డారు బండి సంజయ్.

ఖమ్మంలో టెన్షన్ టెన్షన్..
బీజేపీ నాయకుడు సాయి గణేష్ మృతితో జిల్లా కేంద్రంలో బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం అధికార బలాన్ని అడ్డుపెట్టుకొని బీజేపీ శ్రేణులపై దాడులు చేయడం, అక్రమ కేసులు పెడుతోందని ఆరోపిస్తున్నారు. ఖమ్మంలో బీజేపీ నాయకుల ఆందోళనల నేపధ్యంలో మంత్రి పువ్వాడ అజయ్, టీఆర్‌ఎస్‌ జిల్లా పార్టీ కార్యాలయం దగ్గర పోలీసుల భద్రత ఏర్పాటు చేశారు. ఇప్పటికే ధాన్యం కొనుగోలు విషయంలో ఉప్పు-నిప్పులా ఉన్న టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య సాయి గణేష్‌ మరణం మరింత అగ్గిని రాజేసినట్లైంది.
Published by:Siva Nanduri
First published:

Tags: Bjp, Khammam police, TRS leaders

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు