హోమ్ /వార్తలు /తెలంగాణ /

Bandi Sanjay: బండి సంజయ్ 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర..ఎప్పుడు..ఎక్కడి నుంచి ప్రారంభమంటే?

Bandi Sanjay: బండి సంజయ్ 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర..ఎప్పుడు..ఎక్కడి నుంచి ప్రారంభమంటే?

Pc: Twitter

Pc: Twitter

తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర షురూ కానుంది. ఈనెల 28 నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుంది. ముథోల్ నుండి కరీంనగర్ వరకు ఈ పాదయాత్ర కొనసాగుతుందని బీజేపీ వర్గాలు స్పష్టం చేశాయి. భైంసాలో పాదయాత్ర ప్రారంభ సభ నిర్వహిస్తామని తెలిపారు. కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెల్లనంటే వెళతారనే అర్ధం అని అన్నారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకున్న వారిని ఈ చెప్పుతో కొట్టాలని బండి సంజయ్ విమర్శించారు. 

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Karimnagar

తెలంగాణ (Telangana)లో ప్రస్తుతం ఎన్నికల వాతావరణం కనిపిస్తుంది. ముందస్తు ఎన్నికలకు పోయేది లేదని కేసీఆర్ (Cm Kcr) స్పష్టం చేసిన అటు బీజేపీ (Bjp), ఇటు కాంగ్రెస్ (Congress) తమ వ్యూహాలను రచిస్తున్నారు. కేసీఆర్ (Cm Kcr) ముందస్తుకు వెళ్లడం లేదని చెబితే ఖచ్చితంగా ముందస్తు ఎన్నికల (Early Elections)కు వెళతారని పలువురు నాయకులు జోస్యం చెబుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటి నుంచే ప్రజల మధ్య ఉండాలని కేసీఆర్ (Cm Kcr) ఎమ్మెల్యేలకు దిశానిర్ధేశం చేశారు. అయితే ముందస్తు ఎన్నికలకు వెళ్లమంటూ ప్రకటన చేసి క్యాడర్ ను ప్రజల్లోకి వెళ్లాలని ఆదేశించడంతో ఈసారి ముందస్తు ఎలక్షన్స్ ఖాయంగా కనిపిస్తుంది. అయితే ఈ విషయాన్ని పసిగట్టిన కాంగ్రెస్ (Congress), బీజేపీ (Bjp) కూడా ప్రజల్లోకి రావడానికి సిద్ధం అవుతుంది.

Bandi Sanjay: జనసేనతో పొత్తు ఉంటుందా?.. వచ్చే ఎన్నికలపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ (Bandi Sanjay) 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర  (Praja Sangram Yatra) షురూ కానుంది. ఈనెల 28 నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుంది. ముథోల్ నుండి కరీంనగర్ (Karimnagar) వరకు ఈ పాదయాత్ర కొనసాగుతుందని బీజేపీ వర్గాలు స్పష్టం చేశాయి. భైంసాలో పాదయాత్ర ప్రారంభ సభ నిర్వహిస్తామని తెలిపారు. కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెల్లనంటే వెళతారనే అర్ధం అని అన్నారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకున్న వారిని ఈ చెప్పుతో కొట్టాలని బండి సంజయ్ (Bandi Sanjay) విమర్శించారు. నియోజకవర్గంలో లక్ష ఓట్లే లక్ష్యంగా పని చేస్తున్నామని బండి సంజయ్ తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

News coverage of Hon’ble MP of Karimnagar & BJP State President Shri @bandisanjay_bjp.

(1/7) pic.twitter.com/z6i2n7RMjk

— Office of Bandi Sanjay Kumar (@BSKOffice) November 17, 2022

కాగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్(Bandi Sanjay)నాల్గో విడత పాదయాత్రను కుత్బుల్లాపూర్‌ (Kutbullapur) నియోజకవర్గంలోమొదలుపెట్టారు. ఈ పాదయాత్రకు ముఖ్యఅతిధిగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్‌బన్సాల్ హాజరయ్యారు. ఈ పాదయాత్ర పూర్తిగా హైదరాబాద్‌(Hyderabad)శివారు ప్రాంతాల్లో 9 నియోజకవర్గాలను కవర్ చేస్తూ 10 రోజుల పాటు కొనసాగింది. ఈ పాదయాత్రలో భాగంగానే బహిరంగ సభను నిర్వహించారు. అయితే ఆ సమయంలో మునుగోడు ఉపఎన్నిక షెడ్యూల్ రావడంతో 5వ విడత ఆలస్యం అయింది. అయితే తాజాగా ఐదో విడత పాదయాత్ర ముథోల్ నుంచి కరీంనగర్ వరకు కొనసాగనుంది. మరి బండి సంజయ్ పాదయాత్ర వచ్చే ఎన్నికల్లో ఏ మేర ప్రభావం చూపిస్తుందో చూడాలి.

First published:

Tags: Bandi sanjay, Bjp, Karimnagar, Telangana, Trs, TRS leaders

ఉత్తమ కథలు