హోమ్ /వార్తలు /తెలంగాణ /

YS Sharmila: వైఎస్ షర్మిలకు బెయిల్ మంజూరు.. రోజంతా కొనసాగిన హైడ్రామా ముగింపు

YS Sharmila: వైఎస్ షర్మిలకు బెయిల్ మంజూరు.. రోజంతా కొనసాగిన హైడ్రామా ముగింపు

వైఎస్ షర్మిల (ఫైల్ ఫోటో)

వైఎస్ షర్మిల (ఫైల్ ఫోటో)

YS Sharmila: పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేశారని షర్మిల తరపు న్యాయవాదులు వాదించారు. ఇరువర్గాల వాదనను విన్న మెజిస్ట్రేట్.. షర్మిలకు రిమాండ్‌ను తిరస్కరించారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు(YS Sharmila) బెయిల్ మంజూరైంది. వ్యక్తిగత పూచీకత్తుపై న్యాయమూర్తి ఆమెకు బెయిల్ మంజూరు చేశారు. ఈ విషయంలో మెజిస్టేట్ ముందు వాడివేడిగా వాదనలు జరిగాయి. రిమాండ్ విధించకపోతే శాంతిభద్రతల సమస్య తలెత్తవచ్చని పోలీసుల తరపు న్యాయవాది వాదించారు. అయితే పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేశారని షర్మిల తరపు న్యాయవాదులు వాదించారు. ఇరువర్గాల వాదనను విన్న మెజిస్ట్రేట్.. షర్మిలకు రిమాండ్‌ను తిరస్కరించారు. వ్యక్తిగత పూచీకత్తుపై ఆమెకు బెయిల్ మంజూరు చేశారు. వైఎస్‌ షర్మిలను 14ఏసీ ఎంఎం మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు ఎస్‌ఆర్‌ నగర్‌(SR Nagar) పోలీసులు. ఆమె రిమాండ్ ప్రధానాంశంగా వాదనలు సాగుతున్నాయి. తమ క్లయింట్ పై తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేశారన్న వైఎస్‌ షర్మిల తరపు లాయర్లు వాదించారు. 

శాంతి యుతంగా నిరసన తెలపడానికి వెళ్తే అక్రమంగా అరెస్ట్ చేశారని, పోలీసుల తీరును తప్పుపట్టారు. గతంలో ఎమ్మెల్యే రాజాసింగ్(MLA Raja Singh) రిమాండ్‌ వ్యవహారాన్ని ఈ సందర్భంగా న్యాయవాది మెజిస్ట్రేట్‌ ముందు ప్రస్తావించారు. పోలీస్ విధులకు ఎక్కడ ఆటంకం తమ క్లయింట్‌ ఆటంకం కలిగించలేదని షర్మిల తరపు లాయర్లు పేర్కొన్నారు. అయితే లా అండ్ ఆర్డర్‌ సమస్య తలెత్తే అవకాశం ఉన్నందునే ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ముందస్తుగా సహకరించాలి అని కోరామని, కానీ, ఆమె, పార్టీ కార్యకర్తలతో న్యూసెన్సు క్రియట్ అయ్యిందని పోలీసులు తెలిపారు. ఇలాంటి సమయంలో రిమాండ్ విధించకపోతే శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని పోలీసులు మెజిస్ట్రేట్‌ను కోరారు.

మరోవైపు వైఎస్‌ఆర్‌టీపీ కార్యకర్తల నిరసనల నేపథ్యంలో నాంపల్లి కోర్టు దగ్గర ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కోర్టు ముందు భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. నాంపల్లి కోర్టుకు వైఎస్‌ఆర్‌టీపీ లీగల్‌సెల్‌ చైర్మన్‌ వరప్రసాద్‌తో పాటు షర్మిల భర్త బ్రదర్‌ అనిల్‌ చేరుకున్నారు.

ఫ్లాష్..ఫ్లాష్: వైఎస్ షర్మిలకు బిగ్ రిలీఫ్..పాదయాత్రకు తెలంగాణ హైకోర్టు అనుమతి..కానీ..

Bandi Sanjay: భైంసాను దత్తాత తీసుకుంటాం..బహిరంగ సభలో బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

అంతకుముందు ఉదయం టీఆర్‌ఎస్‌ నేతల దాడిలో ధ్వంసమైన కారునుడ్రైవ్‌ చేసుకుంటూ సీఎం క్యాంప్‌ ఆఫీస్‌కు షర్మిల బయలుదేరారు. ఈ నేపథ్యంలో రాజ్‌భవన్‌ రోడ్డులో వైఎస్‌ షర్మిలను అడ్డుకుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కారు అద్దాలు మూసివేసి వైఎస్‌ షర్మిల లోపలే కూర్చున్నారు. డోర్‌ లాక్‌ చేసి కారు దిగేందుకు నిరాకరించారు. దీంతో షర్మిల కారును క్రేన్‌ ద్వారా లిఫ్ట్‌ చేసి ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడి నుంచి నాంపల్లి కోర్టుకు తరలించారు.

First published:

Tags: Telangana, YS Sharmila

ఉత్తమ కథలు