Home /News /telangana /

TS POLITICS ATTRACTING INVESTMENTS IN KTR AMERICA TOUR CALLAWAY COMPANY DIGITAL CENTER IN HYDERABAD SNR

KTR US TOUR:హైదరాబాద్‌లో మరో డిజిటల్ సెంటర్‌ ఏర్పాటు కేటీఆర్‌ అమెరికా పర్యటనలో ఒప్పందం

(పెట్టుబడుల ప్రవాహం)

(పెట్టుబడుల ప్రవాహం)

KTR US TOUR:హైదరాబాద్‌లో గోల్ఫ్ క్రీడకు సంబంధించిన డిజిటల్ సెంటర్‌ ఏర్పాటు కానుంది. తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటనలో క్యాలవే అనే సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ డిజిటల్ సెంటర్‌ ఏర్పాటు చేయడం వల్ల 300మంది సాఫ్ట్‌వేర్ నిపుణులకు ఉపాధి దొరుకుతుంది.

ఇంకా చదవండి ...
రాష్ట్రానికి పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా అమెరికాAmericaలో పర్యటిస్తున్న తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ KTRఆప్రయత్నంలో సక్సెస్ అవుతున్నారు. రెండో రోజు కూడా పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశయ్యారు మంత్రి. ఇందులో భాగంగానే గోల్ఫ్ క్రీడ (Golf sport) కు చెందిన ప్రతిష్టాత్మక కంపెనీ క్యాలవే (Callaway) హైదరాబాద్ (Hyderabad)లో తన డిజిటల్ సెంటర్(Digital Center) ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన గోల్ఫ్ బ్రాండ్స్ ఒడిసి, ట్రవిస్ మాథ్యూ, ఓజియో, జాక్ వోల్ఫ్ స్కిన్ లను కలిగి ఉన్న క్వాలవే వార్షికాదాయం 3.2 బిలియన్ డాలర్లు. ఈ డిజిటెక్ సెంటర్ తో గోల్ఫ్ క్రీడకు సంబందించిన డేటా అనలిటిక్స్ తో పాటు తన గ్లోబల్ కార్యకలాపాలకు సపోర్ట్‌ను, టెక్ సొల్యూషన్స్ ను అందించేందుకు ఈ డిజిటెక్ సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ డిజిటెక్ సెంటర్‌తో గోల్ఫ్ ఆటగాళ్ల ఆటతీరుతో సహా వారి క్రీడా నైపుణ్యం, దాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలనే విషయానికి సంబంధించి ఎదురయ్యే అనేక సమస్యలకు టెక్నాలజీ ఆధారిత పరిష్కారాలను తమ కంపెనీ సూచిస్తుందని తెలిపింది. ప్రపంచంలోని అనేక ప్రముఖ నగరాలను పరిశీలించిన తర్వాత హైదరాబాద్‌లో తమ కంపెనీని ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ ప్రతినిధులు కేటీఆర్ కి తెలిపారు. లాస్ ఏంజెల్స్ దగ్గరలో వున్న కాల్స్ బాద్ నగరంలో మంత్రి కేటీఆర్‌తో కాల్ వే కంపెనీ కార్యనిర్వాహక ఉపాధ్యక్షులు, సి ఎఫ్ వో బ్రయన్ లించ్, సి ఐ వో సాయి కూరపాటితో సమావేశం అయ్యారు.

పెట్టుబడుల ప్రవాహం..
అమెరికా తర్వాత హైదరాబాద్ లో ఏర్పాటుచేయబోయే  తమ సెంటరే అతిపెద్దదని కంపెనీ ప్రతినిధులు చెప్పారు. డిజిటెక్ సెంటర్ ఏర్పాటుతో తొలి దశలో అత్యంత నైపుణ్యం కలిగిన 300 మంది సాఫ్ట్‌వేర్ రంగ నిపుణులకు ఉపాధి దొరుకుతుందన్నారు. పెట్టుబడికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే చేస్తామన్నారు క్వాలవే ప్రతినిధులు మంత్రి కేటీఆర్‌తో స్పష్టం చేశారు.హైదరాబాద్‌లో ఇప్పటికే అనేక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్‌లతో పాటు ఐటీ, టెక్నాలజీ కేంద్రాలను అనేక కంపెనీలు ఏర్పాటు చేశాయి. ఈ విషయాన్ని ప్రస్తావించిన మంత్రి కేటీఆర్ గోల్ఫ్ క్రీడ ఆధారిత వినూత్న టెక్నాలజీ సెంటర్‌ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడం పట్ల క్యాలవే కంపెనీకి ధన్యవాదాలు తెలిపారు.

హైదరాబాద్‌లో మరో టెక్ సెంటర్..
ఇప్పటికే ఫైనాన్స్ బ్యాంకింగ్ ఫార్మా ఐటి రంగాల టెక్నాలజీ సెంటర్ లు హైదరాబాదులో ఉన్నాయని, కాల్ వే కంపెనీ ప్రకటన తర్వాత అనేక ఇతర క్రీడలకు సంబంధించిన టెక్నాలజీ సెంటర్ లు హైదరాబాద్‌లో ఏర్పాటు అవుతాయన్న ఆశాభావాన్ని మంత్రి కేటీఆర్ వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో క్రీడా టూరిజం, క్రీడా అగ్రి తయారీ వంటి అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, చీఫ్ రిలేషన్ ఆఫీసర్ అమర్నాథ్ రెడ్డి ఆత్మకూరి, డిజిటల్ మీడియా డైరెక్టర్ దిలీప్ కొనతం పాల్గొన్నారు.
Published by:Siva Nanduri
First published:

Tags: America, Investments, Minister ktr

తదుపరి వార్తలు