తెలంగాణలో రాజకీయ వేడి పుట్టిస్తున్న హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు టీఆర్ఎస్ తరపున గెల్లు శ్రీనివాస్ యాదవ్ సిద్ధమయ్యారు. ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల కావడంతో.. ఆయన ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ తరపున రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఈ సందర్భంగా తన ఆస్తులు, అప్పులు, కేసులు, ఇతర వివరాలు ఈసీకి సమర్పించిన అఫిడవిట్లో పొందుపర్చారు. తన దగ్గర నగదు రూ. 2,82,402.44 ఉందని పేర్కొన్నారు. తన భార్య దగ్గర రూ. 11,94,491(250 గ్రాముల బంగారం) ఉందని అఫిడవిట్లో చూపించారు. తన పేరు మీద ఎలాంటి వ్యవసాయ భూమి లేదని.. తన భార్య పేరు మీద 12 గుంటల వ్యవసాయ భూమి ఉందని వెల్లడించారు. తన పేరు మీద 1210 గజాల స్థలం ఉందని.. 20 లక్షల విలువ చేసే ఇల్లు ఉందని పేర్కొన్నారు. ఇక ఎలాంటి అప్పులు లేవని అఫిడవిట్లో వివరించారు. తనకు భార్య శ్వేత, కూతురు సంఘమిత్ర, కుమారుడు తారక రామారావు ఉన్నారని అన్నారు. తన మీద కేసుల వివరాలను కూడా అఫిడవిట్లో పేర్కొన్నారు.
అంతకుముందు టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ రిటర్నింగ్ అధికారికి నామినేషన్ సమర్పించారు. 2001 నుండి ఉద్యమనాయకుడు కేసీఆర్ గారికి అండగా పార్టీకి నిబద్దతగా, క్రమశిక్షణతో పదవిలో ఉన్నా, లేకున్నా ఉద్యమం చేసిన నిజమైన ఉద్యమకారుడు గెల్లుశ్రీనివాస్ యాదవ్ అని, అందుకే కేసీఆర్ గారు గెల్లును బలపర్చారని హుజురాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా అవకాశం ఇచ్చారన్నారు మంత్రి గంగుల కమలాకర్.
మంచిరోజైన శుక్రవారం రోజు టీఆర్ఎస్ అబ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ నామినేషన్ దాఖలు చేసారని, కేసీఆర్ బొమ్మ మీదే టీఆర్ఎస్ అభ్యర్థులు గెలుస్తారని, తాము సైతం అలాగే గెల్చామని రేపు హుజురాబాద్లో గెల్లు శ్రీనివాస్ యాదవ్ సైతం కేసీఆర్ బొమ్మపైనే అత్యధిక మెజార్టీతో గెలుస్తారన్నారు. ఈరోజు ఓట్ల కోసం వస్తున్న ఈటెల ఐదు సంవత్సరాల కాలనికి హుజురాబాద్లో అవకాశం ఇస్తే, అవకాశవాదంతో, వ్యక్తిగత ఎజెండాతో మద్యలోనే కత్తి వదిలేసి పోరాటాన్ని ఆపేశారని దుయ్యబట్టారు.
Huzurabad: సాయంత్రం వరకే ఛాన్స్.. ఏదో ఒకటి చెప్పండి.. మాజీమంత్రికి కాంగ్రెస్ డెడ్లైన్
గెల్లు శ్రీనివాస్ యాదవ్ పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండి సేవచేస్తారన్నారు. గతంలో హుజురాబాద్ నియెజకవర్గం టీఆర్ఎస్ కు కంచుకోటని, 2018 కంటే అత్యధిక మెజార్టీని సాధిస్తామన్నారు గంగుల. కేసీఆర్ పై ప్రేమున్నప్పటికీ ఈటెలపై వ్యతిరేకతతో గతంలో కోల్పోయిన ఓట్లు సైతం ఈ సారి సాధిస్తున్నామన్నారు. అభివ్రద్దే మనందరికీ ముఖ్యం కావాలని, ఈటెల నిర్లక్ష్యంతో హుజురాబాద్ కోల్పోయిన అభివ్రుద్దిని తిరిగి గాడిలో పెట్టాలంటే గెల్లు శ్రీనివాస్ యాదవ్కు సంపూర్ణ మద్దతు తెలియజేసి ఓటేయాలని కోరారు గంగుల కమలాకర్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Gellu Srinivas Yadav, Huzurabad By-election 2021, Telangana, Trs