హోమ్ /వార్తలు /తెలంగాణ /

Munugodu: ప్రచారం ముగుస్తున్న వేళ..కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి బిగ్ రిలీఫ్..ఆ ఆరోపణలపై ఈసీ క్లియరెన్స్

Munugodu: ప్రచారం ముగుస్తున్న వేళ..కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి బిగ్ రిలీఫ్..ఆ ఆరోపణలపై ఈసీ క్లియరెన్స్

రాజగోపాల్ రెడ్డికి బిగ్ రిలీఫ్

రాజగోపాల్ రెడ్డికి బిగ్ రిలీఫ్

మునుగోడు ఉపఎన్నిక (Munugodu ByPoll) ప్రచారానికి మరికొద్ది గంటల్లో ఫుల్ స్టాప్ పడనుంది. ఈ క్రమంలో మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komati reddy Rajagopal reddy)కి భారీ ఊరట లభించింది. ఆయన కంపెనీకి చెందిన ఖాతా నుండి పలువురికి రూ.5.26 కోట్ల నగదు బదిలీ అయ్యాయని, ఇది నిబంధనలకు విరుద్ధం అని టీఆర్.ఎస్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. దీనిపై విచారించిన ఈసీ రాజగోపాల్ రెడ్డి (Rjagopal Reddy)పై వచ్చిన ఆరోపణలు నిరాధారణమైనవని స్పష్టం చేసింది. 

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

మునుగోడు ఉపఎన్నిక (Munugodu ByPoll) ప్రచారానికి మరికొద్ది గంటల్లో ఫుల్ స్టాప్ పడనుంది. ఈ క్రమంలో మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komati reddy Rajagopal reddy)కి భారీ ఊరట లభించింది. ఆయన కంపెనీకి చెందిన ఖాతా నుండి పలువురికి రూ.5.26 కోట్ల నగదు బదిలీ అయ్యాయని, ఇది నిబంధనలకు విరుద్ధం అని టీఆర్.ఎస్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. దీనిపై విచారించిన ఈసీ రాజగోపాల్ రెడ్డి (Rjagopal Reddy)పై వచ్చిన ఆరోపణలు నిరాధారణమైనవని స్పష్టం చేసింది.

Munugodu Violence: బీజేపీకి పరిస్థితి అర్థమైంది.. అందుకే దాడులు చేస్తున్నారన్న హరీశ్ రావు

ఇటీవల కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komati Reddy Rajagopal Reddy) కి కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  (Komati Reddy Rajagopal Reddy) కుటుంబానికి చెందిన కంపెనీ నుండి మునుగోడులోని పలువురికి రూ.5.2 కోట్లు బదిలీ చేశారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం  (Election Commission) వివరణ ఇవ్వాలని రాజగోపాల్ రెడ్డి (Komati Reddy Rajagopal Reddy) కి నోటీసులు ఇచ్చింది. నగదు బదిలీ ఆరోపణలపై సమాధానం ఇవ్వాలని నోటీసులు పేర్కొంది. అక్టోబర్ 14, 18, 29 తేదీల్లో ఈ నగదు బదిలీ జరిగిందని తెలుస్తుంది.

దీనిపై టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ నగదుతో మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలోని ఓటర్లను ప్రలోభపెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. దీనిపై ఈసీ (Election Commission) స్పందిస్తూ అక్టోబర్ 31 సాయంత్రం 4 గంటల లోపు సమాధానం ఇవ్వాలని నోటీసులు ఇచ్చింది. టీఆర్ఎస్ నుంచి ఫిర్యాదు స్వీకరించిన ఈసీ రాజగోపాల్ రెడ్డికి  (Komati Reddy Rajagopal Reddy) నోటీసులు ఇచ్చింది. వారు ఆరోపించిన విధంగా ఈ బదిలీని మీరు లేదా మీ ఆదేశాల మేరకు కుటుంబ యాజమాన్యంలోని కంపెనీ ద్వారా జరిగితే 23 వేర్వేరు బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేయబడిన ఈ ఫండ్ ఓటరు ప్రేరణ కోసం ఉపయోగించకుండా చూసుకోవడం మీ బాధ్యత. ఇది అవినీతి పద్ధతి అని ఈసీ నోటీసుల్లో పేర్కొంది.

ఈసీ  (Election Commission) ఇచ్చిన నోటిసులపై మునుగోడు  (Munugodu) బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komati Reddy Rajagopal Reddy) స్పందించారు. సుశి ఇన్ఫ్రా అకౌంట్ నుంచి బదిలీ అయిన నగదు బదిలీకి తనకు ఎలాంటి సంబంధం లేదని వెల్లడించారు. ఇప్పటికే దీనికి సంబంధించి ఎన్నికల కమిషన్ కు వివరణ కూడా ఇచ్చామన్నారు. టీఆర్ఎస్ ఓడిపోతుందనే ఇలాంటి ఫిర్యాదులకు పాల్పడుతున్నారన్నారు. మునుగోడు ఉపఎన్నికలో  (Munugodu Bypoll) ఆ పార్టీని బొందపెట్టడం ఖాయమని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఈసీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి క్లియరెన్స్ ఇవ్వడంతో బిగ్ రిలీఫ్ దొరికినట్లయింది.

First published:

Tags: Komatireddy rajagopal reddy, Munugodu By Election, Telangana

ఉత్తమ కథలు