Home /News /telangana /

TS POLITICS AS PRASHANT KISHOR DECIDES TO STAY WITH TRS CM KCR NOW NETIZENS TROLLS CONGRESS CHIEF REVANTH REDDY MKS

Revanth | PK : రేవంత్ బ్రో.. పీకేతో ప్రెస్‌మీట్ ఎప్పుడు బ్రో? -తలకిందులైన టీకాంగ్రెస్ అంచనాలు!

కేసీఆర్, పీకే, రేవంత్

కేసీఆర్, పీకే, రేవంత్

సోనియా గాంధీ ఆఫర్ తిరస్కరిస్తూ ప్రశాంత్ కిషోర్ తీసుకున్న నిర్ణయం తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి భారీ ఊరట కల్పించింది. కానీ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి మాత్రం కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది. పీకేతో ప్రెస్ మీట్ ఎప్పుడంటూ రేవంత్ ను నెటిజన్లు ఆటాడుకుంటున్నారు..

ఇంకా చదవండి ...
కాంగ్రెస్‌ పార్టీలో చేరలేనంటూ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ తీసుకున్న నిర్ణయం తెలంగాణలో ఆ పార్టీకి భారీ ఊరటనిచ్చింది. సీఎం కేసీఆర్ తో కలిసి చేస్తోన్న పీకే.. కాంగ్రెస్-టీఆర్ఎస్ మధ్య పొత్తు కూదర్చబోతున్నారంటూ బీజేపీ చేస్తోన్న విమర్శలకు తెరపడినట్లయింది. కానీ ఈ పరిణామం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది. కాంగ్రెస్ కు హ్యాండిస్తూ పీకే తన నిర్ణయం వెలిబుచ్చిన మరుక్షణం నుంచి తెలంగాణ నెటిజన్లు రేవంత్ రెడ్డిని ఓ ఆటాడుకుంటున్నారు. పీకే-కేసీఆర్ బంధాన్ని, కాంగ్రెస్ లో పీకే చేరికను ఉద్దేశించి రేవంత్ ఇటీవల చేసిన సంచలన వ్యాఖ్యలే ఇందుకు కారణం. పీకే విషయంలో టీకాంగ్రెస్ చీఫ్ అంచనాలు తలకిందులు కావడం ఒక ఎత్తయితే.. ఆయన అన్న మాటలే తూటాలుగా తిరిగి రేవంత్ పైకి దూసుకెళుతుండటం మరో ఎత్తు.

జాతీయ కాంగ్రెస్ లో చేరికకు అంతా సిద్ధం చేసుకున్న ప్రశాంత్ కిషోర్ గత శనివారం సడన్ గా హైదరాబాద్ లో ప్రత్యక్షం కావడం, ప్రగతి భవన్ వెళ్లి సీఎం కేసీఆర్ ను కలవడం, ఏకంగా రెండు రోజులపాటు కేసీఆర్ తోనే గడిపి, తన రాజకీయ భవిష్యత్తుపై పీకే సంచలన నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. కాగా, పీకే హైదరాబాద్ లో ఉండగానే ఆయనను ఉద్దేశించి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పీకే హైదరాబాద్ వచ్చింది కేసీఆర్ తో తెగదెంపులు చేసుకోడానికేనని, రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ పతనమే లక్ష్యంగా పీకే చెప్పబోయే మాటలు మీరు(మీడియా) వినబోతున్నారని రేవంత్ అన్నారు. సరిగ్గా ఆయన వ్యాఖ్యలకు పూర్తి విరుద్దంగా వాస్తవ పరిస్థితులు మారిపోయాయి. కాంగ్రెస్ ప్రపోజల్ ను తిరస్కరించిన పీకే.. కేసీఆర్ తోనే కలిసుండాలని నిర్ణయించుకున్నారు.

KCR | TRS plenary: కేసీఆర్ జాతీయ పార్టీ.. నేటి ప్లీనరీలో ప్రకటన.. పీకే ద్వారా చక్రంతిప్పేలా!పీకే తాజా నిర్ణయం నేపథ్యంలో రేవంత్ రెడ్డిపై సోషల్ మీడియాలో భారీగా ట్రోలింగ్ జరుగుతోంది. మొన్నటి ప్రెస్ మీట్ లో రేవంత్ రెడ్డి చేసిన కామెంట్లు అలాంటివి మరి. పీకే హైదరాబాద్ విజిట్ పై రేవంత్ మాట్లాడుతూ.. ‘‘ఇకపై టీఆర్ఎస్ కుగానీ, సీఎం కేసీఆర్ తోగానీ ప్రశాంత్ కిషోర్ కు ఎలాంటి సంబంధం ఉండదు. పీకే ఐపాక్ సంస్థకూడా టీఆర్ఎస్ కోసం పనిచేయదు. ఈ విషయంలో ముందు నుంచి నేను చెప్పిందే ఇప్పుడు జరిగింది. పీకే కాంగ్రెస్‌లో చేరిన తర్వాత తెలంగాణకు వచ్చి నాతో కలిసి జాయింట్ ప్రెస్‌మీట్‌ పెట్టే రోజు చాలా దగ్గర్లోనే ఉంది. ఆ రోజు పీకే స్వయంగా టీఆర్ఎస్ కేసీఆర్ ను ఓడిస్తామని ఆయన నోటిమాటగా మీరు(మీడియా) వినబోతున్నారు’ అని వ్యాఖ్యానించారు.

CM KCR | Prashant Kishor: షాకింగ్ ట్విస్ట్: కేసీఆర్‌కు పీకే కటీఫ్.. ఇక టీఆర్ఎస్ ఓటమే ధ్యేయం!కాంగ్రెస్‌లో చేరడం లేదని ప్రశాంత్‌ కిశోర్‌ ప్రకటించడంతో సోషల్‌ మీడియాలో నెటిజన్లు రేవంత్‌రెడ్డిని ఆటాడుకున్నరు. పీకే చేరికపై ఆయన చేసిన వ్యాఖ్యలకు పాత పాటలను, మీమ్స్‌ను జోడించి ట్రోల్‌ చేశారు. ‘రేవంత్‌రెడ్డిబ్రో.. పీకేతో కలిసి తెలంగాణలో ప్రెస్‌మీట్‌ ఎప్పుడు పెడుతున్నావ్‌ బ్రో’ అని కొందరు.. ‘పీకే నోటితో టీఆర్‌ఎస్‌ను ఓడిస్తామని ఎప్పుడు చెప్పిస్తున్నావ్‌ రేవంత్ అన్నగారు’ అని ఇంకొందరు.. ‘పీకే తిరస్కరించింది, ఛీ కొట్టింది ఎవర్నో తెలిసిందా.. రేవంత్‌రెడ్డిగారూ’ అని మరికొందరు ప్రశ్నల వర్షం కురిపిస్తూ ట్రోలింగ్‌ చేశారు. విమర్శల సంగతి ఎలా ఉన్నా..

Prashant Kishor | Congress: సారీ మేడం.. నేను కాంగ్రెస్‌లో చేరట్లేదు: సోనియాకు భారీ షాకిచ్చిన పీకేరేవంత్ రెడ్డిపై ట్రోలింగ్ అంశాన్ని పక్కన పెడితే, కాంగ్రెస్ లోకి పీకే చేరడంలేదనే క్లారిటీ తెలంగాణ కాంగ్రెస్ కు గొప్ప ఊరటనిచ్చినట్లయింది. పీకే పోకతో కాంగ్రెస్-టీఆర్ఎస్ పొత్తు అంశం కూడా కొట్టుడుపోయిన దరిమిలా రాష్ట్రంలో కాంగ్రెస్ కు పొలిటికల్‌ రూట్‌ క్లియర్‌గా ఉన్నట్లేనని, వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ను గద్దె దించి అధికారంలోకి రావడమే తమ టార్గెట్‌ అని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. అధికార పార్టీతో అమీతుమీకి సిద్ధమవుతున్నామని, మే 6న వరంగల్ లో రాహుల్‌ గాంధీ సభ తర్వాత ఉధృతంగా కార్యక్రమాలు నిర్వహిస్తామని టీకాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. మరి పీకే విషయంలో రేవంత్ ఈసారి ఎలాంటి వ్యాఖ్యలు చేయబోతున్నారనేదీ ఆసక్తికరంగా మారింది.
Published by:Madhu Kota
First published:

Tags: CM KCR, Congress, Prashant kishor, Revanth Reddy, Telangana, Trolling, Trs

తదుపరి వార్తలు