హోమ్ /వార్తలు /telangana /

PM Modi | TRS Kavitha : మోదీ 8 ఏళ్ల సంబురాలపై కేసీఆర్ కూతురు కవిత సంచలన విమర్శలు

PM Modi | TRS Kavitha : మోదీ 8 ఏళ్ల సంబురాలపై కేసీఆర్ కూతురు కవిత సంచలన విమర్శలు

మోదీకి కవిత 8 ప్రశ్నలు

మోదీకి కవిత 8 ప్రశ్నలు

ఇప్పటికే సీఎం కేసీఆర్ జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ అజెండాను సెట్ చేస్తూ, అతి త్వరలోనే సంచలనం జరగబోతోందని చెప్పగా, ఇప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాదాపు అంతటి సంచలన ప్రశ్నలనే ప్రధాని మోదీపైకి సంధించారు.

ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గద్దనెక్కి 8 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బీజేపీ దేశవ్యాప్తంగా ఎనిమిదేళ్ల వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నది. (PM Modi @ 8Years) అయితే కమలనాథుల సంతోషాన్ని ఆవిరిచేస్తూ కారు గుర్తు పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ (Telangana CM KCR) తనయ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) సంచలన విమర్శలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీకి కవిత సంధించిన 8 ప్రశ్నల తాలూకు ట్వీట్లు వైరలయ్యాయి. మోదీజీ అని గౌరవంగా సంబోధిస్తూనే ఈ ప్రశ్నలకు బదులుందా? అంటూ కవిత విమర్శల బాణాలు సంధించారు.

బీజేపీ ఎనిమిదేళ్ల పాల‌న‌లో దేశ ప్ర‌జ‌లు నిస్స‌హాయులుగా మిగిలిపోయార‌ని నిజామాబాద్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత ఆవేద‌న వ్య‌క్తంచేశారు. బీజేపీ పాల‌న‌లో ప్ర‌జ‌ల‌కు ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగ‌లేద‌ని తెలిపారు. ఎనిమిదేళ్ల పాల‌న‌లో బీజేపీ వైఫ‌ల్యాల‌పై ఆమె మోదీ స‌ర్కారుకు ట్విట‌ర్ వేదిక‌గా ఎనిమిది ప్ర‌శ్న‌లు సంధించారు. మోదీ స‌ర్కారు ఈ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు చెప్పాల‌ని కేసీఆర్ కూతురు స‌వాల్ విసిరారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ అజెండాను సెట్ చేస్తూ, అతి త్వరలోనే సంచలనం జరగబోతోందని చెప్పగా, ఇప్పుడు కవిత దాదాపు అంతటి సంచలన ప్రశ్నలనే ప్రధానిపైకి సంధించారు.

CM KCR | Akunuri Murali : కాళేశ్వరం ప్రాజెక్టు మూసేయక తప్పదు : ఎందుకో చెప్పిన రిటైర్డ్ ఐఏఎస్..


మోదీకి కల్వకుంట్ల క‌విత విసిరిన ఎనిమిది ప్ర‌శ్న‌లివే: 1.మహిళా శక్తికి సమాన ప్రాధాన్యత కల్పించడం ద్వారా మ‌హిళా సాధికారత సాధించడం. మహిళా రిజర్వేషన్ బిల్లు ఎక్కడ మోడీ జీ? 2.మన దేశ జీడీపీ పడిపోతున్నా.. గ్యాస్,డీజిల్,పెట్రోల్ (జీడీపీ) ధరలు పెరుగుతున్నాయి. విచిత్రంగా అవి దేశ ప్రభుత్వ నియంత్రణలో ఎందుకు లేవు? అమితంగా పెంచిన ఇంధ‌న‌ ధరల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఎక్కడ పెట్టుబడిగా పెట్టారు?

CM KCR | KTR : కేటీఆర్ సీఎం కావాల‌ని ఆంధ్రా యువ‌కుడి పాద‌యాత్ర‌.. దసరాకు కేసీఆర్ నిర్ణయం?


3. తెలంగాణ రాష్ట్రంపై బీజేపీ ప్రభుత్వ పక్షపాతానికి ముగింపు ఎప్పుడు? తెలంగాణకు రావాల్సిన రూ.7000 కోట్ల పెండింగ్‌ నిధులను బీజేపీ ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేస్తుంది? 4.ద్రవ్యోల్బణం రికార్డు స్థాయికి చేరుకుంది, “మెహంగై ముక్త్ భారత్” అని ప్రకటించుకున్న మీరు అసలు అలాంటి “అచ్ఛే దిన్” ఎప్పుడు తెస్తారు? 5.విఫలమైన లా అండ్ ఆర్డర్, విఫలమైన వ్యవస్థలు.. భారతదేశ ప్రజలకు కృత్రిమ ప్రచారాలు లేని నిజమైన “అమృత్ కాల్” ఎప్పుడు వస్తుంది?

PM Kisan Yojana: రైతులకు శుభవార్త.. బ్యాంక్ ఖాతాల్లోకి పీఎం కిసాన్ 11 విడత డబ్బులు.. 31న మోదీ స్వయంగా..


6. రైతులు భారతదేశానికి గుండె చప్పుడు.. కానీ, ఈ రోజు తెలంగాణలోని వరి రైతులు, పసుపు రైతులు తమ కష్టానికి కనీస గుర్తింపును కోరినందుకు బీజేపీ చేతిలో నష్టపోతున్నారు! 7. మోడీ ప్రభుత్వ “న్యూ ఇండియా” వాస్తవికత ఏంటంటే, ఇక్కడ కోట్లాది మంది భారతీయులు తమకు కనీస ఆదాయం అందించే ఉపాధిని పొందడంలో కష్టపడుతున్నారు. 8. చివరగా, పీఎం కేర్స్ నిధుల గురించిన నిజమైన సమాచారం దేశ‌ ప్రజలకు తెలియజేసే రోజు వస్తుందా? అని మోదీని కవిత ప్రశ్నించారు.

Published by:Madhu Kota
First published:

Tags: Bjp, CM KCR, Kalvakuntla Kavitha, Pm modi, Telangana, Trs

ఉత్తమ కథలు