హోమ్ /వార్తలు /తెలంగాణ /

నేడు తెలంగాణకు సచివాలయం అప్పగింత... 27న కొత్త సెక్రటేరియట్‌కి శంకుస్థాపన

నేడు తెలంగాణకు సచివాలయం అప్పగింత... 27న కొత్త సెక్రటేరియట్‌కి శంకుస్థాపన

Telangana Updates : రాష్ట్ర విభజన తర్వాత చాలా అంశాలు సెటిల్ అయ్యాయి. మరి సచివాలయం మాత్రం ఎందుకు పెండింగ్ పెట్టడం అనుకున్న పెద్దలు... లెక్క తేల్చేస్తున్నారు.

Telangana Updates : రాష్ట్ర విభజన తర్వాత చాలా అంశాలు సెటిల్ అయ్యాయి. మరి సచివాలయం మాత్రం ఎందుకు పెండింగ్ పెట్టడం అనుకున్న పెద్దలు... లెక్క తేల్చేస్తున్నారు.

Telangana Updates : రాష్ట్ర విభజన తర్వాత చాలా అంశాలు సెటిల్ అయ్యాయి. మరి సచివాలయం మాత్రం ఎందుకు పెండింగ్ పెట్టడం అనుకున్న పెద్దలు... లెక్క తేల్చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య పెండింగ్‌లో ఉన్న భవనాల అప్పగింత కార్యక్రమం ఇవాళ జరగబోతోంది. రాష్ట్ర విభజన టైమ్‌లో ఏపీ ప్రభుత్వానికి హైదరాబాద్‌లో కేటాయించిన భవనాల్ని తిరిగి ఏపీ అధికారులు ఇవాళ తెలంగాణ అధికారులకు అప్పగిస్తారు. సచివాలయంలోని కొన్ని బ్లాకులు, ఏపీ డీజీపీ కార్యాలయ భవనం, లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్‌లను ఇచ్చేస్తారు. ఫలితంగా సచివాలయం మొత్తం తెలంగాణ సొంతమవుతుంది. అందువల్ల ఈ నెల 27న కొత్త సెక్రటేరియట్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఏపీ సీఎం జగన్‌ను ఆహ్వానించేందుకు సీఎం కేసీఆర్ ఇవాళ విజయవాడ వెళ్తున్నారు. అప్పుడు రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలపై చిన్నపాటి చర్చ జరిగే అవకాశం ఉంది.

కొత్త సచివాలయం ఎందుకు ? : కొత్త సచివాలయం నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం రూ.500 కోట్లు కేటాయిస్తోంది. ఇప్పుడు అది అవసరమా అని ప్రశ్నిస్తున్నారు కొద్దిపాటి సంఖ్యలో ఉన్న కాంగ్రెస్ నేతలు. సచివాలయం పేరుతో డబ్బులు వేస్ట్ చేస్తున్నారన్నది వాళ్ల ఉద్దేశం. ప్రభుత్వం మాత్రం ఇప్పుడున్న సచివాలయం పాతదైపోయిందనీ, భవిష్యత్ అవసరాలకి తగ్గట్టుగా కొత్త సెక్రటేరియట్ నిర్మాణం ఉంటుందని చెబుతోంది. వాస్తు పేరుతో... సీఎం కేసీఆర్... మనీ వేస్ట్ చేస్తున్నారని విమర్శిస్తున్నాయి విపక్షాలు.

telangana secretariat,telangana news,telangana new secretariat,new secretariat,new telangana secretariat,new secretariat building in telangana,telangana,telangana new secretariat plan,ts new secretariat,kcr on telangana secretariat,telangana secreatariat,telangana secretariat vaastu,telangana new secretariat design,telangana secreteriat,gaddar in telangana secretariat,telangana new secretariat building,telangana latest news,తెలంగాణ సెక్రటేరియట్,సచివాలయం,భవనాల అప్పగింత,
కొత్త సచివాలయం నమూనా (File)

కొత్త సెక్రటేరియట్ ఎక్కడ ? : ఏపీకి ఇచ్చిన సెక్రటేరియట్ భవనాలన్నీ వెనక్కి రావడంతో కొత్త సచివాలయాన్ని ఆ ప్రదేశంలోనే నిర్మిస్తారని సమాచారం. 25 ఎకరాల విస్తీర్ణం ఉన్న ఆ స్థలంలో అన్ని హంగులతో పర్యావరణహితంగా ఉండేలా సచివాలయం ఉంటుదట. కొత్తది పూర్తయ్యే వరకూ... బూర్గుల రామకృష్ణారావు భవన్‌ను టెంపరరీ సెక్రటేరియట్‌గా వాడుకోబోతున్నారు. మంత్రుల ఆఫీస్‌లు BRK భవన్‌కి వెళ్లే ఛాన్సుంది.

ఎప్పటికి పూర్తవుతుంది : మొత్తం 25 ఎకరాల్లోని 30 శాతం స్థలంలో (దాదాపు 8 ఎకరాలు) నిర్మించే కొత్త సచివాలయం మామూలుగా ఉండదని తెలుస్తోంది. 5.5లక్షల అడుగుల విస్తీర్ణంలో భవనాల్ని నిర్మిస్తారు. ఒక్కోటీ 10 అంతస్థులు ఉంటాయి. ఇప్పుడున్న భవనాన్ని 4 నెలల్లో పూర్తిగా కూల్చేస్తారు. ఆ తర్వాత మరింత బలమైన పునాదులతో కొత్త భవన నిర్మాణం మొదలవుతుంది. అది 2021 (రెండేళ్ల కాలం)కి పూర్తవుతుంది.

సచివాలయం ప్రత్యేకతలేంటి : సెక్రటేరియట్ నిర్మాణంతోపాటూ... సందర్శకులు కూర్చోవడానికి గ్యాలరీ, పార్కింగ్ స్థలం, పార్కులు, క్యాంటీన్లను కూడా నిర్మిస్తారు. ప్రస్తుతం ఉన్న సచివాలయంలో ఓ హిందూ ఆలయం, ఓ మసీదూ ఉన్నాయి. వాటిని అలాగే ఉంచాలా, కూల్చేసి కొత్తవి నిర్మించాలా, లేక ఇక్కడ కాకుండా ఇంకెక్కడికైనా మార్చాలా అన్నదానిపై తెలంగాణ సీఎం కేసీఆర్ త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు.


ఇవి కూడా చదవండి :

ఏపీ టీడీపీ ఖాళీ అవుతుందా... ప్రతిపక్ష హోదా పోతుందా?

మనం బ్లాక్‌హోల్‌లో ఉన్నామా... సైంటిస్టుల షాకింగ్ థియరీ...


World Yoga : ప్రపంచవ్యాప్తంగా యోగా సంబరాలు... ప్రధాని మోదీ ఫుల్ హ్యాపీ...

First published:

Tags: CM KCR, Kcr, Telangana, Telangana News, Telangana updates

ఉత్తమ కథలు