TS POLITICS AMIT SHAHS COMMENT THAT BJP WILL WIN IN TELANGANA WHENEVER THE ELECTIONS COME SNR
Amit Shah: ఎన్నికలు ఎప్పుడొచ్చినా తెలంగాణలో గెలిచేది బీజేపీనే : అమిత్‌షా
(ప్రతీకాత్మకచిత్రం)
Amit Shah: తెలంగాణలో ఏర్పడబోయేది బీజేపీ ప్రభుత్వమేనన్నారు కేంద్రమంత్రి అమిత్‌షా. హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన విజయ సంకల్ప్ సభ వేదికపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీఆర్ఎస్ని ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పారు.
రాబోయే ఎన్నికల్లో తెలంగాణ(Telangana)లో బీజేపీ(BJP) ప్రభుత్వం ఏర్పడటం ఖాయమన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా. ముందస్తు ఎన్నికలు వచ్చినా ..ఎలక్షన్లు ఆలస్యమైనా గెలిచేసి భారతీయ జనతా పార్టీయేనని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చడం కోసం ఏర్పడిన ప్రత్యేక రాష్ట్రం గత ఎనిమిదేళ్లుగా కేసీఆర్(KCR) చేతిలో బంధీగా ఉందన్నారు. టీఆర్ఎస్(TRS) ప్రభుత్వం, కేసీఆర్ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన నీళ్లు, నిధులు, నియామకాలు ఏమాత్రం అమలు కాలేదన్నారు బీజేపీ అగ్రనేత. తెలంగాణ ఏర్పడిన సమయంలో ప్రజలకు కేసీఆర్ ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ తన కుటుంబానికి కుటుంబ సభ్యులకు సమకూర్చుకుంటున్నారని మండిపడ్డారు అమిత్‌షా(Amit Shah).
కేసీఆర్ పతనం ఆరంభం..
తెలంగాణ ప్రజలకు కేసీఆర్ చేసిన ద్రోహాన్ని మర్చిపోలేదన్నారు అమిత్‌షా. అందుకే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీజేపీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఒక్కసారి బీజేపీకి అధికారం కట్టబెడితే టీఆర్ఎస్ పార్టీని కూపటి వేళ్లతో పెకిలిస్తామన్నారు. రాష్ట్ర ప్రజలకు ఏవైతే టీఆర్ఎస్ హామీలు ఇచ్చిందో నీళ్లు, నిధులు, నియామకాలను సంపూర్ణంగా అమలు చేసి ప్రజలకు సంక్షేమ పాలన, అవినీతిరహిత పాలన అందిస్తామని పరేడ్ గ్రౌండ్లో జరిగిన విజయసంకల్ప సభావేదికగా మాటిచ్చారు అమిత్‌షా.
ఓటమి భయంతో...
తెలంగాణ ప్రజల సమస్యలు ముఖ్యమంత్రి కేసీఆర్‌కి పట్టడం లేదన్నారు. ఫామ్‌హౌస్‌లో కూర్చున్న ముఖ్యమంత్రికి ప్రజలు పడుతున్న అవస్థలు కనిపించడం లేదన్నారు అమిత్‌షా. కేవలం తన కొడుకుని ముఖ్యమంత్రిని ఎలా చేయాలి అనే ఆలోచన తప్ప మరొకటి లేదన్నారు. అంతే కాదు 8ఏళ్లుగా సచివాలయానికి వెళ్లడం లేదంటే ఆయన భయం ఏంటో అర్ధం చేసుకోవాలని సూచించారు అమిత్‌షా. వాస్తు దోషం ఉందని సచివాలయానికి వెళితే మీ ప్రభుత్వం పడిపోతుందని తాంత్రికుడికి చెప్పిన మాట నమ్మని కేసీఆర్ క్యాంప్ ఆఫీస్‌కే పరిమితమయ్యారని చెప్పారు. కేసీఆర్ సచివాలయానికి వెళితే ప్రభుత్వం కూలిపోయి బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందనే భయంతోనే సచివాలయం భవనాన్ని కూల్చివేసినట్లుగా అమిత్‌షా తెలిపారు. అంతే కాదు తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహిస్తామన్న కేసీఆర్ కేవలం ఓవైసీకి భయపడే నిర్వహించలేదన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం గుర్తు కారు అయినా..స్టీరింగ్ మాత్రం ఓవైసీ చేతిలో ఉందన్నారు అమిత్‌షా.
ఒక్క చాన్సు ఇచ్చి చూడండి..
తెలంగాణలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించడంతో కేసీఆర్‌లో భయం మొదలైందని..ఓటమి భయం పట్టుకుందన్నారు కేంద్రమంత్రి పియుష్గోయల్. రాబోయే ఎన్నికల్లో బీజేపీ గెలివడం ఖాయమని..టీఆర్ఎస్ని ప్రజలు ఓడించి ఇంటికి పంపించడం తప్పదని చెప్పారు. రాష్ట్రంలో ప్రజలకు సంక్షేమ పాలన కావాలంటే ఖచ్చితంగా డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఉండాలన్నారు యూపీ సీఎం యోగీ అధిత్యనాథ్. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో యూపీ సంక్షేమంలో అభివృద్దిలో పరుగులు పెడుతోందని..తెలంగాణ ప్రజలు ఆ విషయాన్ని గుర్తుంచుకొని..రాబోయే ఎన్నికల్లో బీజేపీకి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.