Home /News /telangana /

TS POLITICS AMIT SHAH CLOSE AIDE SUNIL BANSAL WILL BE THE TELANGANA BJP INCHARGE REPLACING TARUN CHUG AK

Telangana| BJP: బీజేపీ కీలక నిర్ణయం.. కొత్త నేతకు తెలంగాణ పార్టీ బాధ్యతలు.. ఆయన ఎవరంటే..

నరేంద్రమోదీ, అమిత్ షా (ఫైల్ ఫోటో)

నరేంద్రమోదీ, అమిత్ షా (ఫైల్ ఫోటో)

Telangana BJP: రాష్ట్రంలో బీజేపీ బలపడుతున్నా.. ఇక్కడ చేరికలు మాత్రం ఆశించిన స్థాయిలో లేవనే భావనలో బీజేపీ నాయకత్వం ఉంది. ఈ విషయంలో తెలంగాణ బీజేపీ నేతల మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించుకుంటూ మందుకు సాగడంతో తరుణ్ చుగ్ అంతగా సఫలం కాలేదనే టాక్ కూడా ఉంది

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    తెలంగాణలో అధికారం దక్కించుకునే దిశగా పావులు కదుపుతున్న బీజేపీ నాయకత్వం.. ఆ దిశగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం తెలంగాణ బీజేపీ ఇంఛార్జ్‌గా ఉన్న తరుణ్ చుగ్‌ను తప్పించి.. ఆయన స్థానంలో సునీల్ బన్సల్‌ను(Sunil Bansal) నియమించింది. ఉత్తరప్రదేశ్బీజేపీ ప్రధాన కార్యదర్శి సునీల్‌ బన్సాల్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. దీంతో పాటు ఆయనకు పశ్చిమ బెంగాల్, తెలంగాణ (Telangana) ఒడిశా రాష్ట్రాల ఇన్‌ఛార్జ్‌గా బాధ్యతలు అప్పగించారు. ఈ నియామకం తక్షణ ప్రభావం నుండి అమలులోకి వస్తుందని బీజేపీ(BJP) పేర్కొంది. 2014 లోక్‌సభ ఎన్నికల నుండి ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికల వరకు ఉత్తరప్రదేశ్‌లో బిజెపి ఎన్నికల విజయంలో బన్సల్ కీలక పాత్ర పోషించారు. బీజేపీ ముఖ్యనేత అమిత్ షాకు సన్నిహితుడిగా, అమిత్ షా వ్యూహాలను క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో సమర్థుడిగా బీజేపీలో సునీల్ బన్సల్‌కు మంచి గుర్తింపు ఉంది.

    తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్న అమిత్ షా.. ఇందులో భాగంగానే సునీల్ బన్సల్‌కు ఈ కీలక బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తోంది. బూత్‌స్థాయి నుంచి బీజేపీని బలోపేతం చేయడంలో సునీల్ బన్సల్‌ చక్కటి వ్యూహంతో ముందుకు సాగుతారని బీజేపీ నేతలు చెబుతున్నారు. ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ బల పుంజుకుంటోంది. ఈ నేపథ్యంలో పార్టీని మరింత బలంగా తయారు చేసేందుకు అమిత్ షా సునీల్ బన్సల్‌ను రంగంలోకి దించారని తెలుస్తోంది. తెలంగాణతోపాటు పశ్చిమ బెంగాల్, ఒడిశా బాధ్యతలను కూడా సునీల్ బన్సల్‌కు బీజేపీ జాతీయ నాయకత్వం అప్పగించింది.



    అయితే ఇప్పటికిప్పుడు బెంగాల్, ఒడిశాలో బీజేపీకి రాజకీయ కార్యక్రమాలు పెద్దగా లేవనే చెప్పాలి. దీంతో ముందుగా సునీల్ బన్సల్ ఫోకస్ అంతా తెలంగాణ మీదే ఉంటుందని వేరే చెప్పనవసరం లేదు. మరోవైపు తెలంగాణ ఇంఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించిన తరుణ్ చుగ్‌కు జాతీయ స్థాయిలో మరో కీలక బాధ్యతలు అప్పగించబోతున్నారని సమాచారం. ఇక సునీల్ బన్సల్ తెలంగాణలో ముందుగా చేరికల మీద దృష్టి పెడతారనే టాక్ కూడా వినిపిస్తోంది.

    Munugodu| Congress: మునుగోడులో కాంగ్రెస్ అభ్యర్థిపై త్వరలోనే తేల్చేశారా ?.. ఈసారి భిన్నంగా..

    Rajanna Sircilla: సిరిసిల్లలో కేటీఆర్‌కు అంతా తానైన నర్సింగరావుకు ఈసారి పదవి దక్కేనా?

    రాష్ట్రంలో బీజేపీ బలపడుతున్నా.. ఇక్కడ చేరికలు మాత్రం ఆశించిన స్థాయిలో లేవనే భావనలో బీజేపీ నాయకత్వం ఉంది. ఈ విషయంలో తెలంగాణ బీజేపీ నేతల మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించుకుంటూ మందుకు సాగడంతో తరుణ్ చుగ్ అంతగా సఫలం కాలేదనే టాక్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో కొత్త తెలంగాణ బీజేపీ ఇంఛార్జ్ బాధ్యతలు తీసుకోబోతున్న సునీల్ బన్సల్.. యూపీ తరహాలోనే తెలంగాణలో బీజేపీ బలోపేతం చేస్తారా ? అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Amit Shah, Bjp, Telangana

    తదుపరి వార్తలు