Home /News /telangana /

TS POLITICS AMIT SHAH AND RAHUL GANDHI TELANGANA TOUR IN MAY WILL HEAT STATE POLITICS TRS CHIEF KCR MAY COUNTER CONGRESS BJP AK

Telangana| May: టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ.. మే నెలలో మరింత హీటెక్కనున్న రాజకీయం

అమిత్ షా, కేసీఆర్, రాహుల్ గాంధీ (ఫైల్ ఫోటో)

అమిత్ షా, కేసీఆర్, రాహుల్ గాంధీ (ఫైల్ ఫోటో)

Telangana May: మే నెలలో తెలంగాణలో ఎండ వేడితో పాటు రాజకీయ వేడి మరింతగా పెరగబోతోందని నేతల పర్యటనలు బట్టి అర్థమవుతోంది.

    తెలంగాణలో ఎండ వేడితో పాటు పొలిటికల్ హీట్ కూడా పెరుగుతోంది. అధికార టీఆర్ఎస్‌ను టార్గెట్ చేసేందుకు బీజేపీ, కాంగ్రెస్ ఒకదానితో మరొకటి పోటీపడుతున్నాయి. అటు టీఆర్ఎస్ కూడా విపక్షాలకు ధీటైన కౌంటర్ ఇస్తూ ముందుకు సాగుతోంది. అయితే మే నెలలో తెలంగాణలో ఎండ వేడితో పాటు రాజకీయ వేడి మరింతగా పెరగబోతోందని నేతల పర్యటనలు బట్టి అర్థమవుతోంది. ఈ నెల 6న తెలంగాణకు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, ఆ పార్టీ ముఖ్యనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)  రాబోతున్నారు. రాహుల్ గాంధీ తెలంగాణ టూర్‌తో రాష్ట్ర పార్టీలో కొత్త ఉత్సాహం, జోష్ వస్తుందని ఆ పార్టీ నేతలు నమ్ముతున్నారు. అందుకే రాహుల్ గాంధీ తెలంగాణ (Telangana ) టూర్‌ను సక్సెస్ చేసేందుకు తెలంగాణవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ నేతలు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. రాహుల్ గాంధీ రెండు రోజుల పాటు తెలంగాణలో పర్యటించి.. కాంగ్రెస్ నేతలకు దిశానిర్ధేశం చేస్తారని వార్తలు వస్తున్నాయి.

    తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన తరువాత రాష్ట్రంలో పార్టీ పరిస్థితి మారుతుందని.. మళ్లీ కాంగ్రెస్ శ్రేణులు పూర్తిస్థాయిలో యాక్టివ్ అవుతాయని నేతలు ధీమా ఉన్నారు. తెలంగాణ కాంగ్రెస్‌కు మే నెల కీలకంగా మారనుండగా.. మరోవైపు బీజేపీకి కూడా మే నెల అంతే ముఖ్యంగా మారబోతోంది. ఇందుకు ప్రధాన కారణంగా మే 14న ఆ పార్టీ ముఖ్యనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్రానికి రానుండటమే.

    మహబూబ్‌నగర్ జిల్లాలో కొనసాగుతున్న తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ (Bandi Sanjay) రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర మహేశ్వరంలో ముగుస్తుంది. ఈ సభకు అమిత్ షా రానున్నారు. తెలంగాణలో అధికార టీఆర్ఎస్‌పై కేంద్రం, బీజేపీ రాజకీయ పోరాటం తీవ్రమవుతున్న తరుణంలోఅమిత్ షా(Amit shah) రాష్ట్రానికి రానుండటం విశేషం. ఆయన తెలంగాణకు వచ్చిన అధికార టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఏ రకమైన విమర్శల చేస్తారు ? ఇందుకు గులాబీ బాస్ కేసీఆర్(KCR) నుంచ ఏ రకమైన రియాక్షన్ ఉంటుందన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.

    KCR| Prashant Kishore: కేసీఆర్ ప్రత్యామ్నాయ ఎజెండా.. ప్రశాంత్ కిశోర్ కొత్త పార్టీ.. ఈ రెండూ ఒకటేనా ?

    Revanth Reddy: ఆ నేతతో రేవంత్ రెడ్డి రహస్య చర్చలు.. తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త చర్చ

    అయితే మే నెలలో తెలంగాణకు కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ, బీజేపీ ముఖ్యనేత అమిత్ షా వస్తుండటంతో.. వీరికి కౌంటర్ ఇచ్చేందుకు టీఆర్ఎస్ నేతలు కూడా అదే స్థాయిలో రెడీ అవుతారన్నది వేరే చెప్పనవసరం లేదు. ఈ నేపథ్యంలో తెలంగాణలో మే నెలలో సమ్మర్ హీట్ పెరగడంతో పాటు పొలిటికల్ హీట్ కూడా అంతే స్థాయిలో పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: CM KCR, Telangana

    తదుపరి వార్తలు