హోమ్ /వార్తలు /తెలంగాణ /

KCR-Karnataka: కర్ణాటక ఎన్నికల విషయంలో కేసీఆర్ ప్లాన్ ఏంటి ?

KCR-Karnataka: కర్ణాటక ఎన్నికల విషయంలో కేసీఆర్ ప్లాన్ ఏంటి ?

కుమార స్వామితో సీఎం కేసీఆర్​ (ఫైల్ ఫోటో)

కుమార స్వామితో సీఎం కేసీఆర్​ (ఫైల్ ఫోటో)

Karnataka: టీఆర్ఎస్ బీఆర్ఎస్‌గా మారిన తరువాత ఇతర రాష్ట్రాల్లోనూ పోటీ చేస్తామని ప్రకటించింది. అయితే కర్ణాటకలో తమ మిత్రపక్షమైన జేడీఎస్‌కు మద్దతు ఇస్తామని కేసీఆర్ గతంలో ప్రకటించారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. దీంతో ప్రధాన రాజకీయ పార్టీలు తమ తమ వ్యూహాల్లో మునిగిపోయాయి. ముఖ్యంగా కర్ణాటకలో(Karnataka) మరోసారి అధికారం నిలుపుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తుంటే.. కర్ణాటక నుంచే కాంగ్రెస్(Congress) విజయయాత్రను మొదలుపెట్టాలని కాంగ్రెస్ పట్టుదలగా ఉంది. ఇప్పటికే ఆ పార్టీ మొదట విడతగా అభ్యర్థుల జాబితాను కూడా ప్రకటించింది. కర్ణాటకలో ఎన్నికలకు ఆ రాష్ట్రంలోని పార్టీలు, నేతలు రెడీ అవుతుంటే.. తెలుగు రాష్ట్రాల నేతలు సైతం కర్ణాటక ఎన్నికలపై ఫోకస్ పెట్టబోతున్నారు. కర్ణాటక ఎన్నికల్లో తెలుగు ఓటర్లు కీలకం కానున్నారు. తెలుగు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లోని తెలుగు ఓటర్లు పార్టీల గెలుపోటములను శాసించనున్నారు.

అందులోనూ తెలంగాణకు అత్యధికంగా కర్ణాటక సరిహద్దు జిల్లాలు ఉన్నాయి. బళ్లారి, రాయచూర్, బీదర్, గుల్బర్గా, గాంధార, చిత్రదుర్గలో తెలుగు రాష్ట్రాల్లో తమ పార్టీ నేతలు ప్రచారం చేసేలా ఆయా పార్టీలు షెడ్యూల్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ , బీజేపీలు తెలంగాణలోని తమ నేతలకు కర్ణాటకలోని తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రచారం చేసే బాధ్యతలు అప్పగించడంతో.. తెలంగాణలోని అధికార పార్టీ బీఆర్ఎస్ కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ఏ విధంగా వ్యవహరించనున్నదనే అంశం ఆసక్తికరంగా మారింది.

టీఆర్ఎస్ బీఆర్ఎస్‌గా మారిన తరువాత ఇతర రాష్ట్రాల్లోనూ పోటీ చేస్తామని ప్రకటించింది. అయితే కర్ణాటకలో తమ మిత్రపక్షమైన జేడీఎస్‌కు మద్దతు ఇస్తామని కేసీఆర్ (KCR) గతంలో ప్రకటించారు. కుమారస్వామి మరోసారి కర్ణాటక సీఎం కావాలని కేసీఆర్ ఆకాంక్షించారు. అయితే ఇందుకు తగ్గట్టుగా బీఆర్ఎస్ కర్ణాటకలో జేడీఎస్ కోసం ప్రచారం చేస్తుందా ? సైలెంట్‌గా ఉంటుందా ? అన్నది ఆసక్తికరంగా మారింది.

Bhadradri Kothagudem: సీతారాముల కళ్యాణం.. సీఎం కేసీఆర్ ఈ ఏడాదైనా భద్రాచలం వస్తారా?

Vande Bharat Express: సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ రైలు... వారానికి ఎన్ని రోజులో తెలుసా?

అయితే కర్ణాటకలో జేడీఎస్ రాజకీయ బలం కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితం కావడంతో.. కేసీఆర్ సహా బీఆర్ఎస్ నేతలు అక్కడ ప్రచారం చేసినా పెద్దగా ఫలితం ఉండకపోవచ్చనే చర్చ జరుగుతోంది. అయితే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్, బీజేపీలకు అత్యంత కీలకం కావడం.. అక్కడి గెలుపోటముల ప్రభావం తెలంగాణపై కూడా ఉండే అవకాశం ఉండటంతో.. కేసీఆర్ కర్ణాటక ఎన్నికల విషయంలో ఏ విధమైన వైఖరి, వ్యూహంతో ముందుకు సాగుతారనే దానిపై తెలంగాణ రాజకీయవర్గాల్లో ఆసక్తి నెలకొంది.

First published:

Tags: CM KCR, Karnataka, Telangana

ఉత్తమ కథలు