హోమ్ /వార్తలు /తెలంగాణ /

KCR: ఈడీ దాడులపై కేసీఆర్ రియాక్షన్.. ఆ సభలోనే స్పందించబోతున్నారా ?

KCR: ఈడీ దాడులపై కేసీఆర్ రియాక్షన్.. ఆ సభలోనే స్పందించబోతున్నారా ?

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో

Telangana: తెలంగాణలో ఏడాదిలోపుగానే ఎన్నికలు ఉండటంతో.. సీఎం కేసీఆర్ బీజేపీ విషయంలో మరింత దూకుడుగా ముందుకు సాగే అవకాశాలు ఉన్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

తెలంగాణలోని అధికార టీఆర్ఎస్ నేతలపై ఈడీ దాడులు జరుగుతున్నాయి. మరికొందరు సీబీఐ విచారణకు హాజరవుతున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ రిమాండ్ రిపోర్ట్‌లో కేసీఆర్ కూతురు కవిత పేరును చేర్చారు. త్వరలోనే ఈ కేసుకు సంబంధించిన కవితకు(Kavitha) నోటీసులు కూడా రావొచ్చనే ఊహాగానాలు కూడా జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈ పరిణామాలపై టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) ఏ రకంగా స్పందిస్తారనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. కొద్దిరోజుల నుంచి తెలంగాణలోని తమ పార్టీ నేతలపై ఈడీ దాడులు(ED Raids) జరుగుతున్నా.. కేసీఆర్ మాత్రం సైలెంట్‌గానే ఉంటున్నారు. దీంతో ఈ అంశంపై కేసీఆర్ స్పందించే సమయం ఎప్పుడు వస్తుంది ? అనే అంశంపై టీఆర్ఎస్ వర్గాలు, రాజకీయవర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

ఈ క్రమంలోనే ఎల్లుండి మహబూబ్‌నగర్ జిల్లా పర్యటనకు రాబోతున్నారు. నూతన సమీకృత కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభించబోతున్నారు. కొత్త కలెక్టరేట్ ప్రారంభోత్సవంతో పాటు పాత కలెక్టరేట్ స్థానంలో నిర్మించనున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. ఒక్క ఏడాదిలో పనులు పూర్తి చేసి, ప్రజలకు అందుబాటులోకి తేనున్ను. బస్టాండ్ సమీపంలో నిర్మించిన పార్టీ కార్యాలయాన్ని కూడా ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. మినీ ట్యాంక్ బండ్ వద్ద చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు కూడా శంకుస్థాపన కార్యక్రమం కూడా ఉండనుంది.

ఈ సందర్బంగా జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి పాల్గొనే భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ సభలో పాల్గొననున్న కేసీఆర్.. తెలంగాణలో ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాలపై స్పందిస్తారా ? అనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం కేసీఆర్ బీజేపీనే ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ తమను ఇబ్బంది పెట్టేందుకు ఈడీని ఉపయోగించుకుంటోందని కేసీఆర్ విమర్శలు గుప్పిస్తారా ? లేక మరో విధంగా కేంద్రంలోని బీజేపీని లక్ష్యంగా చేసుకుంటారా ? అన్నది ఆసక్తికరంగా మారింది.

డైరెక్షన్ ఇవ్వడానికి మీరెవరు..సిట్ అధికారిపై ఏసీబీ కోర్టు ఆగ్రహం..క్షమాపణ చెప్పిన గంగాధర్

Breaking News: పాదయాత్ర కొనసాగింపుపై Ys షర్మిల కీలక నిర్ణయం..ఆ రోజే నుంచే ప్రారంభం

తెలంగాణలో ఏడాదిలోపుగానే ఎన్నికలు ఉండటంతో.. సీఎం కేసీఆర్ బీజేపీ విషయంలో మరింత దూకుడుగా ముందుకు సాగే అవకాశాలు ఉన్నాయి. కేంద్రంలోని బీజేపీ తీరును ఎండగట్టేలా కేసీఆర్ ప్రసంగాలు ఉంటాయనడంలో సందేహం లేకపోయినా.. ఈడీ దాడుల విషయంలో కేసీఆర్ ఏం మాట్లాడతారు ? తద్వారా టీఆర్ఎస్ శ్రేణులకు, తెలంగాణ ప్రజలకు ఏ రకమైన సంకేతాలు ఇస్తారన్నది అందరిలోనూ ఆసక్తి రేపుతోంది.

First published:

Tags: CM KCR, Telangana

ఉత్తమ కథలు