హోమ్ /వార్తలు /తెలంగాణ /

Revanth Reddy: రేవంత్ రెడ్డి పాదయాత్రకు సీనియర్ల మద్దతు ఉంటుందా ?

Revanth Reddy: రేవంత్ రెడ్డి పాదయాత్రకు సీనియర్ల మద్దతు ఉంటుందా ?

రేవంత్ రెడ్డి (ఫైల్ ఫోటో)

రేవంత్ రెడ్డి (ఫైల్ ఫోటో)

Revanth Reddy: ఒకవేళ రేవంత్ రెడ్డి పాదయాత్రకు సీనియర్ నేతలు, ముఖ్యనేతలు దూరంగా ఉంటే.. ఆయన పాదయాత్ర కంటే ఎక్కువగా కాంగ్రెస్ నేతల మధ్య ఉన్న గ్యాప్ అంశం మరోసారి చర్చనీయాంశంగా మారుతుందని పలువురు చర్చించుకుంటున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి త్వరలోనే పాదయాత్ర (Padayatra) చేయబోతున్నారు. ఈ నెల 6న మేడారం నుంచి రేవంత్ రెడ్డి పాదయాత్ర మొదలుకాబోతోంది. ఇందుకు సంబంధించి ఆయన కాంగ్రెస్ అధిష్టానానికి షెడ్యూల్ కూడా ఇచ్చారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఇప్పటికే రేవంత్ రెడ్డి ప్రకటన కూడా చేశారు. అయితే రేవంత్ రెడ్డి పాదయాత్రకు కాంగ్రెస్ సీనియర్ల నుంచి ఎంత మేరకు మద్దతు లభిస్తుందన్నది సందేహంగా మారింది. నిజానికి రేవంత్ రెడ్డి(Revanth Reddy) తరహాలో తాము కూడా పాదయాత్రలు చేస్తామని పలువురు సీనియర్ నేతలు భావిస్తున్నారు. ఈ జాబితాలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మధుయాష్కీ వంటి వాళ్లు ఉన్నారు.

రేపు రాష్ట్రానికి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు వస్తున్నారు. ఆయనతో పార్టీ సీనియర్ నేతలతో పాటు రేవంత్ రెడ్డి కూడా సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నేతలు రేవంత్ రెడ్డి పాదయాత్ర విషయంలో ఆయనకు ఏం చెబుతారు ? వారంతా రేవంత్ రెడ్డి పాదయాత్ర ప్రారంభ కార్యక్రమానికి వెళతారా ? అన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ రేవంత్ రెడ్డి పాదయాత్రకు సీనియర్ నేతలు, ముఖ్యనేతలు దూరంగా ఉంటే.. ఆయన పాదయాత్ర కంటే ఎక్కువగా కాంగ్రెస్ నేతల మధ్య ఉన్న గ్యాప్ అంశం మరోసారి చర్చనీయాంశంగా మారుతుందని పలువురు చర్చించుకుంటున్నారు.

అయితే కాంగ్రెస్‌లో పరిణామాలు, పరిస్థితులు ఏ విధంగా ఉన్నా.. పాదయాత్రలో ముందుకు సాగాలన్నది రేవంత్ రెడ్డి ఆలోచనగా కనిపిస్తోంది. పాదయాత్రతో ప్రజల్లోకి వెళ్లి వారి అభిమానం సంపాదించుకుంటే.. అప్పుడు పార్టీ నేతలంతా తన దారికి వస్తారనే భావనలో రేవంత్ రెడ్డి ఉన్నారు. అందుకే పాదయాత్ర ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నా.. ముందుకే సాగాలని రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

PM Modi Tweet: తెలంగాణపై ప్రధాని మోదీ ఆసక్తికర ట్వీట్..రాష్ట్రానికి కొత్త ప్రాజెక్టు!

తెలంగాణ అసెంబ్లీలో ముగిసిన బీఏసీ సమావేశం..6న బడ్జెట్ సహా షెడ్యూల్ ఇలా..

మరోవైపు రేవంత్ రెడ్డి పాదయాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని నమ్ముతున్న ఆయన మద్దతుదారులు.. ఇందుకోసం తాము చేయాల్సిన ఏర్పాట్లును కూడా చేసుకుంటున్నారని తెలుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్‌లో రేవంత్ రెడ్డి ఎదురులేని నాయకుడిగా ఎదగడానికి పాదయాత్ర సక్సెస్ ఎంతో కీలకమని వారంతా భావిస్తున్నారు.

First published:

Tags: Revanth Reddy, Telangana

ఉత్తమ కథలు