Home /News /telangana /

TS POLITICS AHEAD OF TRS FORMATION DAY CELEBRATION CM KCR SON MINISTER KTR REVIEW PREPARATION WORK AT HICC MKS

TRS Formation Day: 3 వేల మందికే ప్లీనరీలో చోటు.. మిగతా శ్రేణులు ఎక్కడికక్కడే: KTR క్లారిటీ

హెచ్ఐసీసీని సందర్శించిన కేటీఆర్

హెచ్ఐసీసీని సందర్శించిన కేటీఆర్

ఏప్రిల్ 27న జరుగబోయే ఆవిర్భావ దినోత్స‌వాన్ని పార్టీ శ్రేణులు పండుగగా జ‌రుపుకుంటార‌ని టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. హెచ్ఐసీసీలో ప్లీనరీ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు..

తెలంగాణలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. ఏప్రిల్ 27న జరుగబోయే ఆవిర్భావ దినోత్స‌వాన్ని పార్టీ శ్రేణులు పండుగగా జ‌రుపుకుంటార‌ని టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. హైటెక్స్‌లోని హెఐసీసీని ఆదివారం సందర్శించిన ఆయన టీఆర్ఎస్ ప్లీన‌రీ ఏర్పాట్ల‌ను పరిశీలించారు. మంత్రి కేటీఆర్ వెంట ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌, ఎమ్మెల్సీ న‌వీన్ రావు కూడా ఉన్నారు.

హెచ్ఐసీసీ సందర్శన సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ఆత్మ‌గౌర‌వం, అస్థిత్వానికి ప్ర‌తీక‌గా టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుక‌లు నిర్వ‌హిస్తామ‌న్నారు. టీఆర్ఎస్ పార్టీ ఏర్ప‌డి 21 ఏళ్లు పూర్త‌యిన సంద‌ర్భంగా, హెచ్ఐఐసీలో ప్ర‌తినిధుల మ‌హాస‌భ ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు కేటీఆర్ పేర్కొన్నారు.

Hyderabad: ఎప్పుడూ చలాకీగా ఉండే లాయర్ శివాని ఎందుకిలా చేసింది? భర్త లొంగుబాటు..


కాగా, హెచ్ఐసీసీ వేదికగా జరిగే ఆవిర్భావ దినోత్స‌వానికి కేవలం 3 వేల మంది హాజ‌రు కానున్న‌ట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఆహ్వానాలు అందిన‌వారే స‌భ‌కు రావాల్సి ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. స‌భ‌కు వ‌చ్చే వారికి పాసులు జారీ చేస్తామ‌ని వెల్ల‌డించారు. రేపు మ‌ధ్యాహ్నం జీహెచ్ఎంసీ నాయ‌కుల‌తో స‌మావేశం నిర్వ‌హిస్తామ‌న్నారు. రాష్ట్రం నలుమూలలా గ్రామ శాఖ‌ల అధ్య‌క్షులు టీఆర్ఎస్ జెండాల‌ను ఆవిష్క‌రించాల‌ని సూచించారు. 3,600 చోట్ల ప‌ట్ట‌ణాల్లో జెండా ఆవిష్క‌ర‌ణ చేయాల‌ని కేటీఆర్ పేర్కొన్నారు.

Affair: మరిదితో అక్రమ సంబంధం.. దాన్ని కప్పిపుచ్చేందుకు చెల్లిని ఇచ్చి వివాహం.. చివరికి షాకింగ్ ట్విస్ట్


టీఆర్ఎస్ వ్యవస్థాపక దినోత్సవం నాడు హైదరాబాద్ లో నిర్వహించే ప్రధాన స‌మావేశానికి రాష్ట్ర మంత్రివ‌ర్గంతో పాటు లోక్‌స‌భ‌, రాజ్యస‌భ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్య‌వ‌ర్గం, రాష్ట్ర స్థాయి కార్పొరేష‌న్ల చైర్మ‌న్‌లు, జిల్లాల పార్టీ అధ్య‌క్షులు, జిల్లా ప‌రిష‌త్ చైర్మ‌న్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ అధ్య‌క్షులు, జిల్లా గ్రంథాల‌యాల సంస్థ అధ్య‌క్షులు, జిల్లా రైతుబంధు స‌మితి అధ్య‌క్షులు, మ‌హిళా కోఆర్డినేట‌ర్లు, జ‌డ్పీటీసీ స‌భ్యులు, మున్సిప‌ల్ మేయ‌ర్లు, చైర్మ‌న్లు, మండ‌ల ప‌రిష‌త్ అధ్య‌క్షులు, ప‌ట్ట‌ణాల‌, మండ‌లాల పార్టీ అధ్య‌క్షులు, వ్య‌వ‌సాయ మార్కెట్ క‌మిటీ చైర్మ‌న్లు హాజ‌రు కానున్నారు. ప్ర‌త్యేక ఆహ్వానితులుగా మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజ‌రవుతారు.


TRS Formation Day: 27న కేసీఆర్ యుద్దభేరీ -హెచ్ఐసీసీలో టీఆర్ఎస్ వ్యవస్థాపక వేడుక


ఈనెల 27న టీఆర్ఎస్ వ్యవస్థాపక దినోత్సవ షెడ్యూల్ ప్రకారం.. ఉద‌యం 10 నుంచి 11 గంట‌ల వ‌ర‌కు పార్టీ ప్ర‌తినిధుల పేర్ల న‌మోదు కార్య‌క్ర‌మం కొన‌సాగనుంది. ఉద‌యం 11:05 గంట‌ల‌కు పార్టీ అధ్య‌క్షులు కేసీఆర్ స‌భా ప్రాంగ‌ణానికి చేరుకుని, పార్టీ జెండాను ఆవిష్క‌రిస్తారు. అనంత‌రం స్వాగ‌తోప‌న్యాసం ఉంటుంది. ఆ త‌ర్వాత అధ్య‌క్షుడు కేసీఆర్ మాట్లాడుతారు. దాదాపు 11 తీర్మానాల‌ను ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు. తీర్మానాల‌ను చ‌ర్చించి ఆమోదం తెలుప‌నున్నారు.
Published by:Madhu Kota
First published:

Tags: CM KCR, Hyderabad, KTR, Minister ktr, Telangana, Trs

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు