Home /News /telangana /

TS POLITICS AFTER NITIN GADKARI PRAISES TRS CM KCR TELANGANA BJP LEADERS SAYS UNION MINISTER SPEECH WRONGLY DRAFTED MKS

CM KCR పాలనకు కేంద్రం కితాబు.. టీబీజేపీలో గడ్కరీ కలకలం.. ప్రసంగ పాఠంలో గడబిడ వల్లేనట!

గడ్కరీతో కేసీఆర్ (పాత ఫొటో)

గడ్కరీతో కేసీఆర్ (పాత ఫొటో)

కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలపై తాము పోరాటం చేస్తుంటే.. గడ్కరీ వచ్చి కేసీఆర్ పై ప్రశంసలు గుప్పించడం విస్మయం కలిగిస్తోందని బీజేపీ రాష్ట్ర నేతలు విస్తుపోయారు. అసలేం జరిగిందో వివరించే ప్రయత్నం చేశారు..

ఇంకా చదవండి ...
తెలంగాణ సీఎం కేసీఆర్, ఆయన నేతృత్వంలోని టీఆర్ఎస్ సర్కారుపై అలుపెరుగని పోరాటం చేస్తోన్న టీబీజేపీలో.. కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ వ్యాఖ్యలు ఒక్కసారిగా కలకలం రేపాయి. కేసీఆర్ సర్కారు చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందంటూ రాష్ట్ర బీజేపీ నేతలు ఓవైపు ఆరోపణలు గుప్పిస్తుండగా.. గడ్కరీ మాత్రం ప్రాజెక్టుపై ప్రశంసలు కురిపించారు. అంతేనా? తెలంగాణ అభివృద్ది పథంలో దూసుకుపోతున్నదని, దేశం మొత్తానికీ గీటురాయిగా నిలిచిందంటూ పరోక్షంగా కేసీఆర్ పాలనను పొగిడేశారు. గడ్కరీ వ్యాఖ్యలకు గతుక్కుమన్న టీబీజేపీ నేతలు అసలు పొరపాటు ఎక్కడ జరిగిందో వివరించే ప్రయత్నం చేశారు.

అసలేం జరిగిందంటే: హైదరాబాద్ శివారు శంషాబాద్-చేవెళ్ళ వేదికగా శుక్రవారం నాడు పలు జాతీయ రహదారులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ.. కాళేశ్వరం ప్రాజెక్టుతో హైదరాబాద్‌ నగరవాసులకు తాగునీటి సమస్య పరిష్కారమైందని, తెలంగాణ అద్భుతమైన ప్రగతి సాధించిదని పొగిడారు. టీఆర్ఎస్ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. నీచమైన బీజేపీలో ఏకైక మంచి మనిషి నితిన్ గడ్కరీనే అని కితాబిచ్చారు. ఈ ఇద్దరి వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. బీజేపీలో చాలా కాలంగా నితిన్ గడ్కరీ వర్సెస్ నరేంద్ర మోదీ సీన్ నెలకొన్న దరమిలా.. కేసీఆర్ తెలివిగా మోదీ వ్యతిరేకులకు మద్దతిస్తున్నారని, అటు నుంచి సైతం సానుకూలత ఉందని, అందులో భాగంగానే కేసీఆర్ పాలనను గడ్కరీ పొగిడితే, గడ్కరీని టీఆర్ఎస్ మంత్రి కీర్తించారనే విశ్లేషణలు వెలువడ్డాయి.

KCR అనూహ్య వ్యూహం? మోదీ సీటుకు స్పాట్ పెట్టారా? -బీజేపీలో ఏకైక మంచి మనిషి ఆయనే!!


ప్రసంగ పాఠం రాసిందెవరు?:  కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలపై తాము పోరాటం చేస్తుంటే.. గడ్కరీ వచ్చి కేసీఆర్ పై ప్రశంసలు గుప్పించడం విస్మయం కలిగిస్తోందని బీజేపీ రాష్ట్ర నేతలు విస్తుపోయారు. ప్రధాని మోదీపై, కేంద్ర ప్రభుత్వంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర విమర్శలు చేస్తుంటే.. గడ్కరీ ఇలా మాట్లాడటమేంటని ప్రశ్నిస్తున్నారు. కాగా, అసలు గడబిడంతా గడ్కరీ ప్రసంగ పాఠంలోనే చోటుచేసుకున్నట్లు నేతలు చెబుతున్నారు. గడ్కరీకి ప్రసంగ పాఠం రాసిచ్చినవారే తప్పుదోవ పట్టించారని కమలనాథులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే,

KTR దుమారం వేళ కేంద్రం సంచలనం.. KCR పాలనకు కితాబు.. అమెరికాకు దీటుగా తెలంగాణ: గడ్కరీ


సీఎంల సదస్సుకు కేసీఆర్ డుమ్మా:  కేంద్ర ప్రభుత్వం ఆరేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత న్యాయ వ్యవస్థపై రాష్ట్రాల ముఖ్యమంత్రులు- హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల(సీజే) ఉమ్మడి సదస్సును శనివారం ఢిల్లీలో నిర్వహించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యఅతిథులుగా కార్యక్రమాన్ని నడిపించారు. తెలంగాణ తరఫున మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ వెళ్లారు. న్యాయ సదస్సుకు కేసీఆర్ ఎందుకు హాజరుకాలేదని బీజేపీ నిలదీసింది. ఆయన చర్య రాజ్యాంగాన్ని, అంబేడ్కర్‌ను అవమానించినట్లుందని బీజేపీ నేత గురుప్రకాశ్‌ ఆరోపించారు. కాగా, సదస్సులో తెలంగాణ చీఫ్ సెక్రటరీపై సీజేఐ రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు సీజే సిఫార్సు మేరకు సీఎం కేసీఆర్ ఇచ్చిన ఆదేశాలనూ సీఎస్ బేఖాతరు చేశారని సీజేఐ మండిపడ్డారు.
Published by:Madhu Kota
First published:

Tags: Bjp, CM KCR, Nitin Gadkari, Telangana, Trs

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు