కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra) తెలంగాణలో రెండో రోజు కొనసాగుతుంది. ఈ యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలు, కౌలు రైతులతో రాహుల్ గాంధీ సమావేశం అయ్యారు. ఈ సందర్బంగా రాహుల్ గాంధీ (Rahul Gandhi) పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ధరణి పోర్టల్ (Dharani Portal) ను రద్దు చేస్తామన్నారు. రైతుల కోసం ప్రకటించిన వరంగల్ డిక్లరేషన్ ను అమలు చేస్తామన్నారు. అలాగే కౌలు రైతులను ఆదుకుంటామని రాహుల్ గాంధీ (Rahul Gandhi) భరోసానిచ్చారు.
ఈనెల 23న తెలంగాణాలో భారత్ జోడో యాత్ర ప్రవేశించింది. కర్ణాటక రాష్ట్రంలోని రాయచూరు జిల్లా నుండి నారాయణపేట జిల్లాలోని మక్తల్ నియోజకవర్గంలోకి రాహుల్ (Rahul Gandhi) యాత్ర ప్రవేశించింది. 3 రోజుల విరామం తర్వాత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తెలంగాణాలో భారత్ జోడో యాత్రను నేడు పునః ప్రారంభించారు. రెండు వారాల పాటు రాహుల్ గాంధీ (Rahul Gandhi) పాదయాత్ర తెలంగాణాలో సాగనుంది. ఉదయం 6 గంటలకు మక్తల్‌లోని కేవీ సబ్‌స్టేషన్ నుంచి పాదయాత్ర ప్రారంభం కాగా బొందల్‌కుంట వద్ద పాదయాత్రకు బ్రేక్ ఇచ్చారు. ఆ తర్వాత రాహుల్ గాంధీ (Rahul Gandhi) విశ్రాంతి తీసుకున్నారు. తిరిగి సాయంత్రం 4 గంటలకు రాహుల్ (Rahul Gandhi) పాదయాత్ర ప్రారంభం అయింది. సాయంత్రం ఏడుగంటల సమయంలో మర్రికల్లోని మందిపల్లె వద్ద యాత్రకు విరామం ఇస్తారు. దాంతో ఇవాళ్టి యాత్ర ముగుస్తుంది. రాత్రి మర్రికల్లోని యెలిగండ్ల గ్రౌండ్లో రాహుల్ బస చేస్తారు.
రాహుల్ గాంధీ (Rahul Gandhi) భారత్ జోడో యాత్ర 16 రోజుల పాటు తెలంగాణలో సాగనుంది. 19 అసెంబ్లీ, 7 పార్లమెంట్ నియోజకవర్గాల మీదుగా మొత్తం 375 కిలోమీటర్లు పాదయాత్ర కొనసాగిస్తారు. తెలంగాణలో పాదయాత్రలో భాగంగా పలు ప్రాంతాల్లో మీటింగ్‌లు ఏర్పాటు చేశారు. రోజుకు సగటున 20 నుంచి 25 కిలోమీటర్ల మేరకు పాదయాత్ర ఉంటుంది. రాహుల్ గాంధీ (Rahul Gandhi) పాదయాత్ర హైదరాబాద్ మీదుగా ఉంటుంది. బోయిన్‌పల్లిలో నైట్ హాల్ట్ చేస్తారు. నెక్లెస్ రోడ్లో సభ ప్లాన్ చేశారు నేతలు. ఆరాంఘర్, చార్మినార్, మోజాంజాహి మార్కెట్, గాంధీ భవన్, నాంపల్లి దర్గా, విజయనగర్ కాలనీ, పంజాగుట్ట, అమీర్ పేట్, కూకట్పల్లి, మియాపూర్, పటాన్చెరు మీదుగా రాహుల్ గాంధీ (Rahul Gandhi) యాత్ర సాగుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bharat Jodo Yatra, Congress, Dharani Portal, Farmers, Rahul Gandhi