హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ (Jublihills) పబ్స్ ల వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు (Telangana High Court) మరోసారి విచారణ చేపట్టింది. రాత్రి 10 గంటల తరువాత జూబ్లీహిల్స్ పబ్స్ లలో ఎలాంటి మ్యూజిక్, డీజేలకు అనుమతి లేదని మరోసారి స్పష్టం చేసింది. గతంలో ఇదే తీర్పును సింగిల్ బెంచ్ ఇచ్చింది. కానీ సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ నేషనల్ రెస్టారెంట్స్ అసోసియేషన్, హైదరాబాద్ రెస్ట్రోలాంబ్ అసోసియేషన్ హైకోర్టు (High Court) డివిజన్ బెంచ్ లో సవాల్ విసిరారు. ఈ క్రమంలో విచారణ చేపట్టిన హైకోర్టు (High Court) రాత్రి 10 దాటితే ఎట్టి పరిస్థితుల్లో డీజే (Dj) బంద్ చేయాలంటూ తీర్పునిచ్చింది. టాట్, జూబ్లీ 800, ఫర్జి కేఫ్, అమ్నిషియా, హై లైఫ్, డైలీ డోస్, డర్టీ మార్టిని, హార్ట్ కప్ పబ్ లతో పాటు మరికొన్ని పబ్ లలో 10 తర్వాత డీజే (Dj) బంద్ చేయాలని కోర్టు స్పష్టం చేసింది.
కాగా ఈ ఏడాది సెప్టెంబర్ 26న పబ్ లపై విచారణ నిర్వహించిన హైకోర్టు (High Court) సింగిల్ బెంచ్ కీలక ఆదేశాలు జారీ చేసింది. రాత్రి 10 గంటల తర్వాత మ్యూజిక్ (Dj) ను అనుమతించవద్దని ఆదేశాలు జారీ చేసింది. కేవలం డీజే (Dj)ను నిషేధించడం మాత్రమే కాదు మైనర్లను కూడా పబ్ లోకి అనుమతించవద్దని కోర్టు ఆదేశించింది. ఇక ఈ విషయమై పబ్ లు తీసుకున్న చర్యలపై నివేదికలను ఇవ్వాలని ముగ్గురు పోలీస్ కమీషనర్లను, జీహెచ్.ఎంసీ కమీషనర్ ను హైకోర్టు సెప్టెంబర్ 21న ఆదేశించింది. ఈ ఆదేశాలతో సెప్టెంబర్ 26న ముగ్గురు పోలీసు కమీషనర్లు, జీహెచ్.ఎంసీ (Ghmc) కమీషనర్ తమ నివేదికలను కోర్టు (High Court) ముందుంచారు.
అయితే తాజాగా నేషనల్ రెస్టారెంట్స్ అసోసియేషన్, హైదరాబాద్ రెస్ట్రోలాంబ్ అసోసియేషన్ హైకోర్టు (High Court) డివిజన్ బెంచ్ లో సవాల్ విసిరారు. ఈ క్రమంలో విచారణ చేపట్టిన హైకోర్టు (High Court) రాత్రి 10 దాటితే ఎట్టి పరిస్థితుల్లో డీజే (Dj) బంద్ చేయాలంటూ మరోసారి స్పష్టం చేసింది. అలాగే జూబ్లీహిల్స్ రెసిడెంట్స్ క్లిన్ గ్రీన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంకటరమణ సూర్యదేవర దాఖలు చేసిన పిటీషన్ పై హైకోర్టు (High Court) విచారించింది. నివాస ప్రాంతాలు విద్యాసంస్థలకు సమీపంలో పబ్ లను అనుమతించడంపై కూడా హైకోర్టు (High Court) ఆగ్రహం వ్యక్తం చేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.