హోమ్ /వార్తలు /తెలంగాణ /

Puvvada Ajay | RS ​​Praveen Kumar: ఓట్ల స్కాంలో తెలంగాణ మంత్రి పేరు .. ఈసీకి దమ్ముంటే అరెస్ట్ చేసి జైలుకు పంపాలన్న RSప్రవీణ్‌కుమార్

Puvvada Ajay | RS ​​Praveen Kumar: ఓట్ల స్కాంలో తెలంగాణ మంత్రి పేరు .. ఈసీకి దమ్ముంటే అరెస్ట్ చేసి జైలుకు పంపాలన్న RSప్రవీణ్‌కుమార్

rs praveen, ajay(file)

rs praveen, ajay(file)

Puvvada Ajay | RS ​​Praveen Kumar: తెలంగాణ రోడ్డు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ అడ్రస్‌పై 532 ఓట్లు నమోదైనట్లుగా ఆర్టీఐ నిర్ధారించడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఒక మంత్రి ఇంటి అడ్రస్‌ పేరుతో ఇప్పటి వరకు జరిగిన నాలుగు ఎన్నికల్లో వందల ఓట్లు నమోదు కావడం ఏంటని ప్రశ్నించారు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

తెలంగాణ రోడ్డు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్(Puvvada Ajay)అడ్రస్‌పై 532 ఓట్లు నమోదైనట్లుగా ఆర్టీఐ (RTI)నిర్ధారించడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఒక మంత్రి ఇంటి అడ్రస్‌ పేరుతో ఇప్పటి వరకు జరిగిన నాలుగు ఎన్నికల్లో వందల ఓట్లు నమోదు కావడం ఏంటని ప్రశ్నించారు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్(RS ​​Praveen Kumar). అంతే కాదు ఇంత జరుగతుంటే ఎన్నికల కమిషన్(Election Commission) ఏం చేస్తోంది..? నిద్రపోతుందా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీఐ చట్టం కింద ఖమ్మం(Khammam) కలెక్టేర్‌ నుంచి బీఎస్పీ కార్యకర్త సేకరించిన వివరాలను సైతం వెల్లడిస్తూ ఆయన ట్విట్టర్‌ వేదికగా ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్ విమర్శనాస్త్రాలు సంధించారు. అధికారాన్ని తమ గుప్పెట్లో పెట్టుకోవాలనే దురుద్ధేశంతో ప్రజాస్వామ్యాన్ని మోసం చేసిన మంత్రిని వెంటనే ఓట్ల స్కాం(Vote scam)లో అరెస్ట్ చేసి జైలు(Jail)కు పంపాలని ప్రవీణ్‌కుమార్‌ ట్విట్టర్‌(Twitter) వేదికగా ఎన్నికల కమిషన్‌ని డిమాండ్ చేశారు.

Hyderabad: ట్యాంక్ బండ్ శివకి మరో శుభవార్త.. త్వరలోనే ఆయన ఇంటికి మంత్రి కేటీఆర్

జైలుకు పంపాల్సిందే..

రాష్ట్ర మంత్రి, అధికార పార్టీ ఎమ్మెల్యే ఖమ్మం జిల్లాలో సీనియర్‌ నాయకుడిగా ఉన్నటువంటి పువ్వాడ అజయ్‌ని వెంటనే అరెస్ట్ చేసి జైలుకు పంపాలని డిమాండ్ చేశారు బీఎస్పీ నేత, ఐపీఎస్‌ అధికారి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్. ఆర్టీఐ వెల్లడించిన నివేదిక ఆధారంగా ఆయన ఈ డిమాండ్ చేశారు. ఖమ్మం నగరపాలక సంస్థ సంస్థలోని 20వ వార్డులోని మంత్రి పువ్వాడ అజయ్ ఇంటి నెంబర్‌పై 532ఓట్లు నమోదవడం ఆశ్చర్యానికి గురి చేసింది. ఇదే విషయాన్ని ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. అధికారం చేజారి పోకుండా ఉండేందుకు ఆధిపత్య వర్గాలు ఇంతటి కుంభకోణానికి పాల్పడటం ప్రజాస్వామ్యానికి జరిగిన మోసంగా ఆయన అభివర్ణించారు.ఇంత జరుగుతుంటే ఎన్నికల కమిషన్ ఏం చేస్తుంది ..? నిద్రపోతుందా అని ప్రశ్నించారు. భవనాలకు, రోడ్లకు, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరు పెట్టి, పెద్ద విగ్రహాలను నిర్మించి, ఆ మహనీయుల ఆశయాలను తెలివిగా తుంగలో తొక్కే ప్రయత్నం అనాదిగా జరుగుతున్నదే…మీకు చిత్తశుద్ది ఉంటే మీ అక్రమ ఆస్తులను పేదలకు పంచి సామాజిక అసమానతలను తొలగించాలని కోరారు ఆర్ఎస్‌ ప్రవీణ్‌కుమార్.

ప్రజాస్వామ్యాన్నే మోసం చేస్తారా..

ఖమ్మంలోని ఆర్టీఐ పేర్కొన్న చిరునామా కలిగిన ఇల్లు మంత్రి పువ్వాడ అజయ్‌గా బీఎస్పీ చీఫ్‌ తెలిపారు. అందులో మంత్రి అజయ్‌కుమార్, ఆయన సతీమణి వసంత లక్ష్మి, కుమారుడు నయన్‌రాజ్ మాత్రమే ఉంటుంటే 532ఓట్లు నమోదు చేయడం మోసం కాదా అని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. అదే ఇంటి అఢ్రస్ పేరుతో 2014ఎన్నికల్లో 453 ఓట్లు, 2018లో 657, 2019లో561,2021 ఎన్నికల్లో 532 ఓట్లు వచ్చాయి. ఆర్టీఐ చట్టం కింద తమ పార్టీ కార్యకర్త కొయ్యిని వెంకన్నవెంకన్న సేకరించిన వివరాలను సైతం ప్రవీణ్‌కుమార్ వెల్లడించారు.

అధికారం కోసం ఆధిపత్య వర్గాల కుట్ర..

సదరు మంత్రి పార్లమెంట్, అసెంబ్లీ, మున్సిపల్‌ కార్పొరేషన్ ఎన్నికలకు ముందే ఈ లెక్కలను మార్చేవారని ఆర్టీఐ తెలపడాన్ని ప్రవీణ్‌కుమార్‌ ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు. ఆర్టీఐ నివేదిక ఆధారంగా ఎన్నికల కమిషన్‌కు దమ్ముంటే ఇప్పటికైనా మంత్రి పువ్వాడ అజయ్‌ని ఓట్ల కుంభకోణం కేసులో అరెస్ట్ చేసి జైలుకు పంపాలని ఆర్ఎస్‌ ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు.

Published by:Siva Nanduri
First published:

Tags: Puvvada Ajay Kumar, Rs praveen kumar, Telangana Politics

ఉత్తమ కథలు