హోమ్ /వార్తలు /తెలంగాణ /

Cm Kcr: కొండగట్టు అంజన్నకు రూ.100 కోట్లు..జగిత్యాల జిల్లాకు కేసీఆర్ వరాల జల్లు

Cm Kcr: కొండగట్టు అంజన్నకు రూ.100 కోట్లు..జగిత్యాల జిల్లాకు కేసీఆర్ వరాల జల్లు

కొండగట్టు అంజన్నకు రూ.100 కోట్లు: సీఎం కేసీఆర్

కొండగట్టు అంజన్నకు రూ.100 కోట్లు: సీఎం కేసీఆర్

జగిత్యాల జిల్లాలో పర్యటిస్తున్న సీఎం కేసీఆర్ (Cm Kcr) కొండగట్టు అంజన్న (Kondagattu Anjanna) అభివృద్ధికి రూ.100 కోట్లు మంజూరు చేశారు. ఈ నిధులను ఆలయాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయడానికి ఉపయోగించాలని అన్నారు. ఉద్యమం జరిగే సందర్భంలో అత్యంత మహిమానిత్వమైన, అద్భుతమైన నరసింహస్వామి ధర్మపురికి వచ్చాను. ఆరోజు ఒక మాట చెప్పాను. గోదావరి నది నాటి ఏపీలో తెలంగాణలో మొదట ప్రవేశిస్తే గోదావరి పుష్కరాలు ఎందుకు జరపరని సింహంలా గర్జించాను అని కేసీఆర్  (Cm Kcr) అన్నారు. జగిత్యాల జిల్లా మోతెలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్  (Cm Kcr) ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Jagtial

జగిత్యాల జిల్లాలో పర్యటిస్తున్న సీఎం కేసీఆర్ (Cm Kcr) కొండగట్టు అంజన్న (Kondagattu Anjanna) అభివృద్ధికి రూ.100 కోట్లు మంజూరు చేశారు. ఈ నిధులను ఆలయాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయడానికి ఉపయోగించాలని అన్నారు. ఉద్యమం జరిగే సందర్భంలో అత్యంత మహిమానిత్వమైన, అద్భుతమైన నరసింహస్వామి ధర్మపురికి వచ్చాను. ఆరోజు ఒక మాట చెప్పాను. గోదావరి నది నాటి ఏపీలో తెలంగాణలో మొదట ప్రవేశిస్తే గోదావరి పుష్కరాలు ఎందుకు జరపరని సింహంలా గర్జించాను అని కేసీఆర్  (Cm Kcr) అన్నారు. జగిత్యాల జిల్లా మోతెలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్  (Cm Kcr) ఈ వ్యాఖ్యలు చేశారు.

CM KCR: రైతులకు శుభవార్త చెప్పిన సీఎం కేసీఆర్ .. మరో 10 రోజుల్లోనే..

గతంలో 20 ఎకరాలు..ఇప్పుడు 400 ఎకరాలు..

తెలంగాణ ఆధ్యాత్మిక పరిమళాలు ఉన్న ప్రాంతం, కాళేశ్వరం, ధర్మపురి, కొండగట్టు (Kondagattu Anjanna) వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఇక కొండగట్టు అంజన్న (Kondagattu Anjanna) ఆలయానికి లక్షల మంది ఆంజనేయ స్వామి భక్తులు వస్తుంటారు. గతంలో కొండగట్టు అంజన్న ఆలయం 20 ఎకరాల్లోనే ఉండేది. ఆ తరువాత 348 ఎకరాలను దేవాలయానికి ఇచ్చాం. ఇప్పుడు కొండగట్టు అంజన్న (Kondagattu Anjanna) ఆలయం 400 ఎకరాల్లో ఉంది. అత్యాద్భుతంగా ఆలయాన్ని తీర్చి దిద్దడానికి రూ .100 కోట్లు కేటాయిస్తున్నటు కేసీఆర్  (Cm Kcr) తెలిపారు.

నేను బ్రతికున్నంత కాలం రైతుబంధు, రైతుభీమా..

ఇక జగిత్యాల సభ వేదికగా సీఎం కేసీఆర్ (Cm Kcr) రైతులకు తీపి కబురు చెప్పారు. మరో 10,12 రోజుల్లో రైతుబంధు నిధులు విడుదల చేస్తామని కేసీఆర్ తెలిపారు. ఇక దేశంలో రైతుబంధు, రైతుభీమా ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కేసీఆర్ అన్నారు. తాను బ్రతికున్నంత కాలం రైతుబంధు, రైతుభీమా ఆగవని స్పష్టం చేశారు. ఇక దేశంలో ఏ రాష్ట్రం కూడా ధాన్యం కొనడం లేదు. కానీ తెలంగాణలో మాత్రం 7 వేల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసుకొని పంటను కొంటున్నామని అన్నారు.

బండలింగాపూర్ ను మండలం చేస్తాం..

తెలంగాణ రాష్ట్ర సాధనతోనే జగిత్యాల జిల్లా అయిందని కేసీఆర్ (Cm Kcr) అన్నారు. ఇక బండలింగాపూర్ ను కూడా మండల కేంద్రంగా చేస్తామని కేసీఆర్ (Cm Kcr) హామీ ఇచ్చారు. ఇక జగిత్యాల జిల్లా అభివృద్ధికి ఎమ్మెల్యే కోటాలో మరో రూ.10 కోట్లు అదనంగా కేటాయిస్తున్నట్టు తెలిపారు. తెలంగాణాలో ఎప్పటికి మోటార్లకు మీటర్లు పెట్టె ప్రసక్తే లేదని కేసీఆర్ తెలిపారు. దేశంలో ఇప్పటికే అనేక పరిశ్రమలు మూతపడ్డాయి. వేల మంది కార్మికులు రోడ్డు మీద పడ్డారని కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

First published:

Tags: CM KCR, Kcr, Telangana, Telangana News

ఉత్తమ కథలు