రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి... పాడె మోసిన సైబరాబాద్ సీపీ

ఓ కేసు దర్యాప్తు నిమిత్తం బిహార్‌ వెళ్లిన ఎస్సై రవీందర్‌నాయక్‌, కానిస్టేబుల్‌ తులసీరామ్‌, మహిళా కానిస్టేబుల్‌ లలిత వాహనంలో తిరుగు ప్రయాణమయ్యారు. మధ్యప్రదేశ్‌లోని డిండోరి జిల్లా సమన్‌పూర్‌ వద్దకు రాగానే వీరు ప్రయాణిస్తున్న వాహనం చక్రం ఊడిపోయింది.

news18-telugu
Updated: June 14, 2019, 8:10 AM IST
రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి... పాడె మోసిన సైబరాబాద్ సీపీ
సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్
news18-telugu
Updated: June 14, 2019, 8:10 AM IST
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్ తులసీరామ్ పాడెను సైబరాబాద్ పోలీస్ కమిషర్ సజ్జనార్ మోశారు. ఆయన మృతదేహాన్ని ఠాణాకు చేర్చేటప్పుడు తరలింపు వాహనం దాకా పాడెను తీసుకెళ్లారు. ఉద్యోగంలో చేరిన ఏడాదిలోపే, పెళ్లయిన నెలరోజులకే తులసీరామ్‌ మరణించడం అత్యంత దురదృష్టకరమని సీపీ అన్నారు. వెంటనే అతని కుటుంబానికి ఆదుకునేందుకు పోలీస్ సహకార సొసైటీ నుంచి నిధులు అందించారు. మృతుడి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, రూ.14 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం కానిస్టేబుల్‌ తులసీరామ్‌.. పార్థీవ శరీరాన్ని ఆయన స్వగ్రమం వికారాబాద్ జిల్లా ధరూర్‌కు తీసుకెళ్లారు.

మైలార్‌దేవ్‌పల్లి ఠాణాలో పనిచేస్తున్న కానిస్టేబుల్‌ తులసీరామ్ మధ్యప్రదేశ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఓ కేసు దర్యాప్తు నిమిత్తం బిహార్‌ వెళ్లిన ఎస్సై రవీందర్‌నాయక్‌, కానిస్టేబుల్‌ తులసీరామ్‌, మహిళా కానిస్టేబుల్‌ లలిత వాహనంలో తిరుగు ప్రయాణమయ్యారు. మధ్యప్రదేశ్‌లోని డిండోరి జిల్లా సమన్‌పూర్‌ వద్దకు రాగానే వీరు ప్రయాణిస్తున్న వాహనం చక్రం ఊడిపోయింది. ఈ ప్రమాదంలో తలకు బలమైన గాయమై కానిస్టేబుల్‌ తులసిరామ్‌, నిందితుడు రమేష్‌ నాయక్‌ ఘటనాస్థలంలోనే మృతి చెందారు. ఎస్సై రవీందర్‌నాయక్‌, మహిళా కానిస్టేబుల్‌ లలితకు గాయాలయ్యాయి. మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కాటేదాన్‌లో మైనర్‌ బాలికపై అత్యాచారం కేసులో నిందితుడు రమేష్‌ నాయక్‌ పరారీలో ఉన్నాడు. అతడ్ని పట్టుకునేందుకు మూడు రోజుల క్రితం ఎస్‌.ఐ రవీందర్‌ ఆధ్వర్యంలో పోలీసు బృందం బిహార్‌ వెళ్లిన క్రమంలో ఈ ప్రమాదం జరిగింది.

 

First published: June 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...