నేడు గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కు ప్రారంభం... ఏంటి దాని ప్రత్యేకత?

కేటీఆర్

Green Industrial Park : తెలంగాణ ప్రభుత్వం ఓవైపు పర్యావరణాన్ని పరిరక్షిస్తూ... అదే సమయంలో పారిశ్రామిక అభివృద్ధి కూడా వచ్చేలా చేసుకుంటోంది. అందుకు ఓ ఎగ్జాంపుల్‌గా ఈ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కును చెప్పుకోవచ్చు. దీని స్పెషాలిటీ ఏంటో తెలుసుకుందాం.

  • Share this:
Green Industrial Park in Telangana : రూ.1553 కోట్ల పెట్టుబడులు... 438 ఎకరాల్లో 450 పరిశ్రమల యూనిట్లు... 35వేల మందికి ఉపాధి... ఆలోచన బాగుంది కదా... అదే యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ మండలం దండుమల్కాపూర్‌లో TSIIC-TIF-MSME ఏర్పాటు చేసినదే గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్. దీన్ని ఇవాళ తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారు. ఇందుకు సంబంధించిన పైలాన్‌ సిద్ధమైంది. హైదరాబాద్-విజయవాడ 65వ నెంబర్ హైవే పక్కనే అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రభుత్వం దీన్ని నిర్మించింది. ఇండస్ట్రియల్ పార్కు వరకు గుట్టలను తొలిచి విశాలమైన రోడ్డు నిర్మించారు. అంతర్గత రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం వేగంగా సాగుతోంది. పార్కుతో పాటూ కేటీఆర్ ఇవాళ... పరిశ్రమల అవసరాల కోసం ఏర్పాటు చేసిన 33/11కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను కూడా ప్రారంభిస్తారు. ఆ తర్వాత... ఈ పార్కు విశేషాల్ని పారిశ్రామిక వేత్తల సమావేశంలో వివరిస్తారు.

నిజానికి ఈ పార్కు ఏర్పాటు కోసం ప్రభుత్వం 1250 ఎకరాల భూమిని సేకరించింది. మొదటి దశలో 450 మంది పారిశ్రామికవేత్తలకు భూమిని ఇచ్చింది. మరికొంత మంది పారిశ్రామికవేత్తలు యూనిట్ల ఏర్పాటు కోసం దరఖాస్తులు చేసుకున్నారు. రెండో దశలో వారికి భూమిని ఇవ్వనున్నారు.

గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుతో దండుమల్కాపురం సరికొత్తగా కనిపిస్తోంది. అందరిదృష్టీ ఇప్పుడు దానిపై పడుతోంది. అక్కడ రియల్ ఎస్టేట్‌తోపాటూ... మరిన్ని పరిశ్రమలు రానున్నాయి. లక్కేంటంటే... అక్కడ ఇచ్చే ఉద్యోగాల్లో స్థానికులకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వనున్నారు. అందువల్ల స్థానికులకు మంచి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అనుకోవచ్చు.

 

Pics : హాట్ అందాల విందు చేస్తున్న త్రియాదాస్




ఇవి కూడా చదవండి :

జగన్ కోర్టుకు వెళ్తారా... లేదా? నేడు తేల్చనున్న సీబీఐ కోర్టు

Health Tips : రాత్రి త్వరగా భోజనం చేస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు


Health Tips : రేగుపండ్లు తింటున్నారా... అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు


Diabetes Tips : పసుపుతో డయాబెటిస్‌కి చెక్... ఎలా వాడాలంటే...

Health Tips : పండగ సీజన్‌లో డయాబెటిస్ కంట్రోల్ ఎలా... ఇలా చెయ్యండి
First published: