హోమ్ /వార్తలు /తెలంగాణ /

గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కు ప్రారంభించిన కేటీఆర్... ఇవీ విశేషాలు

గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కు ప్రారంభించిన కేటీఆర్... ఇవీ విశేషాలు

Green Industrial Park : తెలంగాణ ప్రభుత్వం ఓవైపు పర్యావరణాన్ని పరిరక్షిస్తూ... అదే సమయంలో పారిశ్రామిక అభివృద్ధి కూడా వచ్చేలా చేసుకుంటోంది. అందుకు ఓ ఎగ్జాంపుల్‌గా ఈ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కును చెప్పుకోవచ్చు. దీని ప్రత్యేకతలేంటో ఏంటో తెలుసుకుందాం.

ఇంకా చదవండి ...

  Green Industrial Park in Telangana : రూ.1553 కోట్ల పెట్టుబడులు... 438 ఎకరాల్లో 450 పరిశ్రమల యూనిట్లు... 35వేల మందికి ఉపాధి... ఆలోచన బాగుంది కదా. యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ మండలం దండుమల్కాపూర్‌లో TSIIC-TIF-MSME ఏర్పాటు చేసినదే గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్. దీన్ని ఇవాళ తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన పైలాన్‌‌ను ఆవిష్కరించారు. పార్కుతో పాటూ కేటీఆర్ ఇవాళ... పరిశ్రమల అవసరాల కోసం ఏర్పాటు చేసిన 33/11కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను కూడా ప్రారంభించారు. ఆ తర్వాత... ఈ పార్కు విశేషాల్ని పారిశ్రామిక వేత్తల సమావేశంలో వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మునుగోడి కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి... ఉద్యోగాల కల్పనలో స్థానికులకే ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.

  గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కు

  హైదరాబాద్-విజయవాడ 65వ నెంబర్ హైవే పక్కనే అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రభుత్వం దీన్ని నిర్మించింది. ఇండస్ట్రియల్ పార్కు వరకు గుట్టలను తొలిచి విశాలమైన రోడ్డు నిర్మించారు. అంతర్గత రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం వేగంగా సాగుతోంది. నిజానికి ఈ పార్కు ఏర్పాటు కోసం ప్రభుత్వం 1250 ఎకరాల భూమిని సేకరించింది. మొదటి దశలో 450 మంది పారిశ్రామికవేత్తలకు భూమిని ఇచ్చింది. మరికొంత మంది పారిశ్రామికవేత్తలు యూనిట్ల ఏర్పాటు కోసం దరఖాస్తులు చేసుకున్నారు. రెండో దశలో వారికి భూమిని ఇవ్వనున్నారు.

  గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కు

  గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుతో దండుమల్కాపురం సరికొత్తగా కనిపిస్తోంది. అందరిదృష్టీ ఇప్పుడు దానిపై పడుతోంది. అక్కడ రియల్ ఎస్టేట్‌తోపాటూ... మరిన్ని పరిశ్రమలు రానున్నాయి.

  గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కు

  లక్కేంటంటే... అక్కడ ఇచ్చే ఉద్యోగాల్లో స్థానికులకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వనున్నారు. అందువల్ల స్థానికులకు మంచి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అనుకోవచ్చు.

  Pics : ఈ బెంగాలీ రసగుల్ల అందాల్ని చూస్తే ఆగలేరేమో...

  ఇవి కూడా చదవండి :

  ఆరోగ్యశ్రీ విస్తరణ... ఇక ఆ రాష్ట్రాల్లో కూడా అమలు

  ఏపీ సీఎం జగన్‌కు బిగ్ షాక్... పిటిషన్ కొట్టివేసిన సీబీఐ కోర్టు

  అనసూయ జబర్దస్త్ సందేశం... యువతకు ప్రత్యేకం

  కర్తార్‌పూర్ యాత్రికులకు పాకిస్థాన్ ఆహ్వానం... ఇమ్రాన్‌ఖాన్ ఏమన్నారంటే...

  మహారాష్ట్రలో ఏం జరుగుతోంది? ప్రభుత్వం ఏర్పాటయ్యేదెప్పుడు?

  First published:

  Tags: KTR, Telangana News, Telangana updates, Telugu news, Telugu varthalu

  ఉత్తమ కథలు