Home /News /telangana /

TS HIGH COURT MADE KEY COMMENTS ON NEW YEAR CELEBRATIONS VRY

TS High court : న్యూ ఇయర్ వేడుకలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. !

ts high court

ts high court

TS High court : నూతన సంవత్సర వేడుకల నిర్వాహణపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వేడుకల నియంత్రణపై తాము జోక్యం చేసుకోలేమని వ్యాఖ్యానించింది. అయితే మార్గదర్శకాలు ఉల్లంఘించిన వారిపై తీసుకున్న చర్యలను నివేదిక అందించాలని ఆదేశించింది.

    కరోనా పరిస్థితులపై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ క్రమంలోనే కరోనా చర్యలు, నూతన సంవత్సర వేడుకలపై చేపట్టిన అంశాలతో పాటు నూతన సంవత్సర వేడుకలను నియంత్రించాలని వేసిన పిటిషన్ పై విచారణ జరిగింది. దీంతో కోర్టులో విచారణ జరిగింది. కరోనా మరోసారి విజృంభిస్తున్న తరుణంలో నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పబ్‌లు, బార్లకు అదనపు సమయం ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఢిల్లీ, మహారాష్ట్రాల్లో నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నారని కోర్టుకు తెలిపారు. అదే తరహాలో ఇక్కడ కూడా అమలు చేయాలని కోరారు. ఆ రాష్ట్రాలను వలే తెలంగాణలో కూడ కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాలను అమలు చేయాలని వాదించారు..

    ఈ క్రమంలోనే కోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. న్యూ ఇయర్ వేడుకల నియంత్రణపై తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఆయా రాష్ట్రా పరిస్థితులను బట్టి నిర్ణయాలు ఉంటాయని వ్యాఖ్యానించింది. అయితే నిబంధనలు ఉల్లంఘించిన వారిపై తీసుకునే చర్యలను కోర్టుకు నివేదించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇక పోలీసులు కరోనా నిబంధనలు, న్యూ ఇయర్ వేడుకలపై ఇప్పటికే గైడ్‌లైన్స్ విడుదల చేశారని కూడా కోర్టు తెలిపింది. కాగా కేసును జనవరి నాలుగుకు వాయిదా వేసింది.

    Adilabad : ఆ గ్రామంలో.. ఒకప్పుడు తుపాకుల మోత.. నేడు వేదమంత్రాల ఘోష.. కారణం ఏమిటి..?


    కాగా నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా నేడు అర్థరాత్రి వరకు బార్లు, వైన్స్‌ల ఓపెన్‌కు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో పాటు వేడుకలను కూడా కోవిడ్ నిబంధనలతో జరుపుకునేందుకు అనుమతి ఇచ్చింది. మరోవైపు డ్రంకన్‌ డ్రైవ్ తనీఖీలు కూడా విస్తృతంగా అమలు చేస్తామని మరోవైపు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టులో కొంతమంది న్యాయవాదుల పిటిషన్ వేశారు.
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Highcourt, New Year 2022

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు