Home /News /telangana /

TS HIGH COURT MADE KEY COMMENTS ON MLA CHENNAMANENI RAMESH BABU CITIZENSHIP VRY

TS High court : రాష్ట్రంలో మరో ఉప ఎన్నిక .....? టీఎర్ఎస్‌ ఎమ్మెల్యే కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు..

TS High court

TS High court

High court : రాష్ట్రంలో మరో ఉప ఎన్నికకు అవకాశం ఉందా..? అధికార పార్టీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు పౌరసత్వ వాదంలో విచారణ చేపట్టిన హైకోర్టు చేసిన వ్యాఖ్యల వెనక ఆంతర్యం ఏమిటీ..కోర్టు నేరుగా ఉప ఎన్నికలకు సిద్దంగా ఉండాలని చెప్పడం ద్వారా ఇచ్చిన సంకేతాలు ఏంటి..?

ఇంకా చదవండి ...
    వేములవాడ  నియోజకవర్గ  అధికారపార్టీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ బాబు ద్వంద పౌరసత్వ వివాదంపై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ క్రమంలోనే రమేశ్‌బాబు తరఫున వాదనలు వినిపించిన అడ్వకేట్ సమాధానంతో కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ..ఇక నియోజకవర్గంలో ఉప ఎన్నికలకు సిద్దంగా ఉండాలని వ్యాఖ్యానించింది. దీంతో కోర్టు వ్యాఖ్యలు వార్తా పత్రికల్లో  ప్రముఖంగా ప్రచురితమయ్యాయి.

    ఈ నేపథ్యంలోనే మంగళవారం విచారణ చేపట్టిన రాష్ట్ర హైకోర్టు చాలా కీలక వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం. ముఖ్యంగా ఇరు పార్టీల వాదనల్లో భాగంగా జర్మనిలోని భారత రాయభార కార్యాలయం నుండి తీసుకున్న గుర్తింపు కార్డులో రమేశ్‌బాబు జర్మన్ పౌరుడిగా పేర్కొన్న అంశాన్ని కోర్టు ప్రశ్నించింది. ఒకవేళ భారత పౌరసత్వం ఉన్నట్టయితే ..జర్మని పౌరుడిగా పేర్కొనాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించింది.

     విచారణలో భాగంగా  కేంద్రహోంశాఖ తరపున అదనపు సోలిసిటర్ జనరల్ రాజేశ్వర్ రావు హజరయ్యారు. ఈ క్రమంలోనే కేసు విషయంలో మొత్తం వివరాలను ఆయన కోర్టుకు సమర్పించారు...కాగా పౌరసత్వంపై పిటిషన్ వేసిన ఆది శ్రీనివాస్ తరఫున న్యాయవాది రవికిరణ్ హజరయ్యారు. ఈ నేపథ్యంలోనే ఓసిఐ కార్డుపైనే రమేశ్ బాబు ఇండియాకు వచ్చి వెళుతున్నారని కోర్టుకు వివరించారు. కాగా రమేశ్‌బాబు 2009లో తీసుకున్న పాస్‌పోర్టు కాలపరిమితి 2013వరకు మాత్రమే ఉందని.. ఒకవేళ ఆయన భారత పౌరసత్వం కల్గిఉంటే మరోసారి 2023వరకు జర్మని పాస్‌పోర్టును ఎలా రెన్యువల్ చేసుకుంటారనే అంశంపై ఆయన ప్రశ్నించారు..

    ముఖ్యంగా జర్మనిలో ఇండియా రాయభార కార్యాలయం నుండి పోందిన గుర్తింపు కార్డులో పేర్కొన్న అంశంపై పిటిషనర్ లేవనెత్తిన అంశాలపై దృష్టి సారించిన కోర్టు..దానిపై  వివరణ ఇవ్వాలని చెన్నమనేని రమేశ్‌బాబు తరఫున వాదించిన న్యాయవాదిని ధర్మాసనం కోరింది. అయితే ఇదే అంశంపై రమేష్‌బాబు వివరణ తీసుకుని మరోసారి కోర్టుకు తెలియజేస్తామని చెప్పడంతో ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఈ సంధర్భంలోనే రాష్ట్రంలో మరో ఉప ఎన్నికకు సిద్దం కావాలని వ్యాఖ్యానించింది. అనంతరం కేసును ఆగస్టు 24కు వాయిదా వేసింది.

    కాగా కోర్టు వాదనలు కొనసాగుతున్న నేపథ్యంలోనే చెన్నమనేని రమేశ్‌బాబు తన నియోజకర్గానికి చెందిన పలు అభివృద్ది పనుల కోసం మంత్రి కేటీఆర్‌తో భేటి అయ్యారు. ఇందుకోసం ఇరవై కోట్ల రూపాయల అభివృద్ది నిధులను విడుదల చేయించారు.
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Telangana High Court, Trs

    తదుపరి వార్తలు