క్రిస్మస్‌తో పాటు న్యూ ఇయర్ వేడుకలకు హైకోర్టు బ్రేకులు వేసింది. కరోనా పరిస్థితులపై తెలంగాణ హైకోర్టులో నేడు విచారణ జరిగిన నేపథ్యంలో ఒమిక్రాన్ దృష్ట్యా ఈ వేడుకలపై ఆంక్షలు విధించాలని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే జనం గుంపులు గుంపులుగా గుమి గూడకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి, పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. రెండు రోజుల్లో ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టు పేర్కొంది. ఎయిర్ పోర్ట్‌లో ఉన్న విధంగానే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే జనాలకు తగిన పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాటు చేయలని ధర్మాసనం ఆదేశించింది.
కాగా ఒమిక్రాన్ తీవ్రత రాష్ట్రంలో పెరుగుతున్న నేపథ్యంలోనే దేశ ప్రధాని ఆయా రాష్ట్రాలతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈక్రమంలోనే తెలంగాణలో కూడా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దీంతో ప్రజలు ఆందోళన పరిస్థిలోకి వెళ్లిపోయారు. కాగా ప్రభుత్వం ఇది వరకే కరోనా తగ్గుమొఖం పట్టిన నేపథ్యంలోనే నిబంధనలను సడలించింది. పబ్లిక్ ప్రాంతాలతో పాటు ప్రైవేటు పార్టీలపై ఆంక్షలను తొలగించింది. దీంతో సాధారణ జన జీవనానికి ప్రజలు అలవాటు పడిపోయారు.
ఈ క్రమంలోనే ఒమిక్రాన్ కేసుల విజృంభన మరోసారి భయాందోళనకు గురి చేస్తున్న క్రమంలోనే హైకోర్టు జోక్యం చేసుకుంది. కాగా ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాలు క్రిస్మస్ వేడుకలతో పాటు న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించాయి.. తాజాగా తెలంగాణ ప్రభుత్వం సైతం హైకోర్టు ఆదేశాలతో పండుగలు, ఉత్సవాలపై నిషేధం విధించే దిశగా నిర్ణయాలు తీసుకోనుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.